‘సాహో’లోని ఆ ఐదు తేడాలు కనిపెట్టారా?
‘‘టిప్పర్‌ లారీ వెళ్లి.. స్కూటర్‌ను గుద్దితే ఎట్టా ఉంటాదో తెలుసా’’.. తెలియకపోతే ‘సాహో’ టీజర్‌పై ఓసారి లుక్కేయండి సరిపోద్ది. మూడేళ్ల పాటు అభిమానులను నిరీక్షించేలా చేస్తే.. చేశాడు కానీ, అద్భుతమైన యాక్షన్‌ హంగామాను రుచి చూపించాడు. ‘బాహుబలి’ తర్వాత జాతీయంగా, అంతర్జాతీయంగా తనపై అంచనాలు భారీగా పెరిగిన నేపథ్యంలో దానికి తగ్గట్లుగానే ఓ పవర్‌ఫుల్‌ థ్రిల్లింగ్‌ యాక్షన్‌ స్టోరీతో బాక్సాఫీస్‌ పోరుకు సిద్ధమయ్యాడు. టీజర్‌లో కనిపించిన విజువల్స్‌ చూశాక.. ఎవరికైనా ఇది తెలుగు సినిమానా? లేక హాలీవుడ్‌ చిత్రమా? అని అనిపించక మానదు. అంతగొప్పగా తీర్చిదిద్దాడు దర్శకుడు సుజీత్‌. ఇది అతనికి రెండో చిత్రమే అయినప్పటికీ.. గొప్ప అనుభవమున్న దర్శకుడిగా టేకింగ్‌ చూపించాడు. ముఖ్యంగా యాక్షన్‌, ఛేజింగ్‌ సీన్స్‌లో అతని ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక ఇదంతా పక్కన పెడితే.. కింద కనిపిస్తున్న ‘సాహో’లోని ఈ రెండు స్టిల్స్‌ చూడ్డానికి ఒకేలా కనిపిస్తున్నా.. వీటి మధ్య ఐదు తేడాలున్నాయి. అవేమిటో కనిపెట్టండి చూద్దాం.








Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.