ఆ తేడాలు కనిపెట్టేవారెవరురా
వైవిధ్యభరిత కథాచిత్రాలకు చిరునామా శ్రీవిష్ణు. ‘మెంటల్‌ మదిలో’ వంటి విభిన్న కథాంశాన్ని తెరకెక్కించి తొలి అడుగులోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ. ఇప్పుడు వీరిద్దరి కలియికలో రాబోతున్న చిత్రమే ‘బ్రోచేవారెవరురా’. చలనమే చిత్రము - చిత్రమే చలనము.. ఉపశీర్షిక. నివేదా థామస్, నివేతా పేతురాజ్‌ కథానాయికలు. సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ.. చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను బయటకొదిలింది. కింద చూస్తున్న ఈ పోస్టర్లు రెండూ దానికి సంబంధించినవే. ఈ రెండూ చూసేందుకు ఒకేలా ఉన్నా వీటి మధ్య ఐదు తేడాలున్నాయి. మరి అవేంటో పట్టుకోగలరా. అన్నట్లు చెప్పడం మర్చిపోయాం.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా.. జూన్‌ 28న థియేటర్లలోకి రాబోతుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.