Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
సినిమా ఎలా ఉంది?
టాలీవుడ్
Search
టాలీవుడ్
రివ్యూ: అల్లుడు అదుర్స్
హిట్ అందుకోవడం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. కెరీర్ ఆరంభంలోనే ‘అల్లుడు శీను’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన ‘స్పీడునోడు’, ‘సాక్ష్యం’, ‘కవచం’ సినిమాలతో అనుకున్న స్థాయి విజయాలను అందుకోలేకపోయారు. ‘రాక్షసుడు’తో మెప్పించినా ‘సీత’తో మిశ్రమ స్పందనలు ఎదుర్కొవాల్సి వచ్చింది. దీంతో ఆయన.. తనకి ఎంతో కలిసి వచ్చిన ‘అల్లుడు’ అనే టైటిల్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘అల్లుడు అదుర్స్’అంటూ సంక్రాంతి బరిలోకి దిగిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా? ఈ ఏడాది ఆయన విజయాన్ని అందుకున్నారా?
రివ్యూ: రెడ్
వెండితెరపై హుషారైన నటన కనబరిచే అతికొద్దిమంది యువ కథానాయకుల్లో రామ్ ఒకరు. వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్న ఆయన 2019లో ‘ఇస్మార్ట్ శంకర్’ అంటూ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో తమిళ సూపర్‌హిట్ ‘తడమ్’ను పట్టాలెక్కించారు. ‘రెడ్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది వేసవి కానుకగా విడుదల కావాల్సి ఉన్నా, కరోనా, లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ ద్విపాత్రాభినయం చేయటం, కిషోర్ తిరుమల దర్శకత్వంలో హ్యాట్రిక్ చిత్రం కావడంతో ‘రెడ్’పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ‘రెడ్’లో రామ్ ఎలా నటించారు? కథేంటి? తమిళ ‘తడమ్’లో ఏయే మార్పులు చేశారు?
రివ్యూ: మాస్టర్
తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు విజయ్. గత కొన్నేళ్లుగాగా ఆయన నటించిన సినిమాలు ఏకకాలంలో తమిళం, తెలుగులో విడుదలవుతున్నాయి. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంచుకునే కథలు, సినిమాలు ఇక్కడి ప్రేక్షకులనూ అలరిస్తున్నాయి. తాజాగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘మాస్టర్’. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యంగా ఈ సంక్రాంతికి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాలో విజయ్ నటన ఎలా ఉంది? ‘ఖైదీ’తో క్రేజ్ సంపాదించిన లోకేశ్ కనకరాజ్ విజయ్ను ఎలా చూపించారు? ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి మెప్పించారా?
రివ్యూ: క్రాక్
తెలుగునాట సంక్రాంతి అంటే కొత్త సినిమాల సందడి ఉండి తీరాల్సిందే. ఈసారి కరోనా కూడా మన సినీ సంక్రాంతిని ఆపలేకపోయింది. ఎప్పట్లాగే నాలుగు సినిమాలు బాక్సాఫీసు ముందుకు వరుస కడుతున్నాయి. అందులో భాగంగా విడుదలైన తొలి సినిమా ‘క్రాక్’. ‘డాన్‌శీను’, ‘బలుపు’ తర్వాత రవితేజ - గోపీచంద్ మలినేని కలయికలో రూపొందిన మరో చిత్రమిది. మాస్‌కి నిర్వచనంలా కనిపించే రవితేజ మరోసారి పోలీస్‌గా నటించడం... ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. శనివారం ఉదయమే విడుదల కావల్సిన ఈ సినిమా, ఆర్థిక కారణాలతో కాస్త ఆలస్యంగా రాత్రి విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? రవితేజ ఫామ్‌లోకి వచ్చినట్టేనా?
రివ్యూ: సోలో బ్రతుకే సో బెటర్
థియేటర్లలో శుక్రవారం మళ్లీ జోష్ మొదలైంది. లాక్‌డౌన్‌తో మూతపడిన థియేటర్లు.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఓ కొత్త సినిమా సందడిని రుచి చూశాయి. క్రిస్మస్ సందర్భంగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల కావడంతో... ప్రేక్షక, పరిశ్రమ వర్గాలు ఈ సినిమా గురించి ప్రత్యేకమైన ఆసక్తిని వ్యక్తం చేశాయి. దీని ఫలితంపైనే మిగతా సినిమాల రిలీజ్లు ఆధారపడి ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడిని ఈ సినిమా ఏ మేరకు సంతృప్తి పరిచింది? గతేడాది ‘ప్రతి రోజు పండగ’తో విజయాన్ని అందుకున్న సాయితేజ్ దాన్ని పునరావృతం చేశారా?
రివ్యూ: మర్డర్
రాంగోపాల్ వర్మ వెండితెరపై హిట్టు మాట వినిపించి చాలా కాలమే అయిపోయింది. కానీ, ఇప్పటికీ వర్మ సినిమా వస్తుందంటే.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూడటానికి కారణం ఆయన ఎంచుకునే వివాదాస్పద కథాంశాలే. సినిమా ప్రారంభిస్తూనే వివాదాల అగ్గి రాజేయడం.. దానిపై వచ్చే విమర్శల్నే ప్రచార అస్త్రాలుగా మార్చుకొని తనదైన శైలిలో సినిమాకు క్రేజ్ తీసుకురావడం వర్మ ఎత్తుగడగా మారిపోయింది. 'మర్డర్' చిత్రం ఆయన మరోసారి అదే పంథాలో నడిచారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఒక పరువు హత్య స్ఫూర్తితో కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ చిత్రం గురువారం థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రంతో ఆయన ఈసారి ఏం చూపించారు? అందరూ అనుకుంటున్నట్లు మిర్యాలగూడ పరువు హత్యకి.. ఈ కథకీ సంబంధం ఉందా? ఈ సినిమాతోనైనా ఆయన హిట్టు మాట వినిపించారా? తెలుసుకుందాం పదండి.
చిత్రం: డర్టీ హరి
లాక్డౌన్ తర్వాత ఓటీటీలు, ఏటీటీలే సినీ వినోదాన్ని పంచుతున్నాయి. ఈ వేదికల ద్వారా తరచూ కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ వారాంతంలో ఫ్రైడే మూవీస్ అనే కొత్త ఓటీటీ వేదిక ద్వారా ‘డర్టీ హరి’ విడుదలైంది. ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రాజు దర్శకత్వం వహించడం... ప్రచార చిత్రాలు ఆకర్షించేలా ఉండటంతో ఈ సినిమా గురించి సినీ అభిమానులు ప్రత్యేకంగా ఎదురు చూశారు. మరి చిత్రం ఎలా ఉంది? ఇంతక ఈ ‘డర్టీ హరి’ ఎవరు?
రివ్యూ : బెల్‌బాటమ్
ప్రపంచంలో భాషతో సంబంధం లేని కొన్ని సినిమాలు ఉంటాయి. అవి ఏ ప్రాంతం వారినైనా, ఏ జోనర్ ఇష్టపడేవారినైనా తమవైపునకు తిప్పుకుంటాయి. జేమ్స్‌బాండ్, డిటెక్టివ్ సినిమాలు ఈ కోవలోకి వచ్చేవే. ఈ సినిమాల్లో అగ్ర హీరోలు నటిస్తే భారీ యాక్షన్ సన్నివేశాలు, ఫారెన్ లొకేషన్ పాటలతో నింపేస్తారు. అదే చిన్న హీరోలైతే కథ, కథనాలపై దృష్టి పెడతారు. అలా ఇటీవల కాలంలో తెలుగులో బాగా అలరించిన చిత్రాలు ‘గూఢచారి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉంటాయి. ‘కేజీఎఫ్’తో ఇప్పుడిప్పుడే కన్నడ ఇండస్ట్రీ గురించి యావత్ దేశానికి తెలుస్తోంది. అక్కడ కూడా మంచి ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రం ‘బెల్ బాటమ్’. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ వేదికగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మరి ఈ డిటెక్టివ్‌కు ఏ సమస్య ఎదురైంది? ఎలా పరిష్కరించాడు?
రివ్యూ: మిడిల్‌క్లాస్ మెలొడీస్
మన తెలుగు సినిమాల్లో హీరో ఎక్కువగా మధ్య తరగతి యువకుడిగానే కనిపిస్తాడు. అయితే ఆలోచనలు, ఆశయాలు అంతకుమించి ఉంటాయి. వాటిని మనం తప్పు పట్టలేం కానీ... అలాంటి యువకుడు జీవితంలో ఏదో సాధించాలని అనుకోవడం, దాని కోసం తపన పడటం, గెలవడం అనేది ఎప్పుడూ ఆసక్తికర అంశమే. అలాంటి కథాంశంతో రూపొందిన సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలతో ఆసక్తిరేకెత్తించింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ రోజు ( 20/11/20)న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
రివ్యూ: అమ్మోరు తల్లి
దేవుడు భూముల అన్యాక్రాంతం, దొంగ బాబాలు... ఈ రెండు అంశాల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. చాలావరకు విజయాలు సాధించాయి. కొన్ని బోల్తా కొట్టాయి. అయినా ఈ అంశాలు హాట్కేక్లే. ఈ రెండూ అన్ని ప్రాంతాలకు చెందిన సబ్జెక్ట్‌లు కావడంతో ఏ భాషలో అయినా ఆదరణ దక్కుతుంది. దీంతో ఆర్.జె.బాలాజీ, శవరణన్ డైరక్టర్స్‌గా తొలి సినిమాకు ఆ అంశాన్నే ఎంచుకున్నారు. అదే ‘అమ్మోరు తల్లి’. తమిళంలో ‘మూకుత్తి అమ్మన్’గా తెరకెక్కిన సినిమాకు డబ్బింగ్ ఇది. సినిమాలో ప్రధాన పాత్రధారిగా నయనతారను ఎంచుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రచార చిత్రాలతో అది ఇంకా పెంచారు. ఈ సినిమా ఈ రోజు (14/11/20)న డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం!
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
టాలీవుడ్
మరిన్ని
రివ్యూ: అల్లుడు అదుర్స్
రివ్యూ: రెడ్
రివ్యూ: మాస్టర్
రివ్యూ: క్రాక్
రివ్యూ: సోలో బ్రతుకే సో బెటర్
రివ్యూ: మర్డర్
బాలీవుడ్
మరిన్ని
రివ్యూ: శకుంతలా దేవి
రివ్యూ: దిల్ బెచరా
రివ్యూ: అంగ్రేజీ మీడియం
రివ్యూ: థప్పడ్
చిత్రం: లవ్ ఆజ్ కల్
రివ్యూ: మలంగ్
హాలీవుడ్
మరిన్ని
రివ్యూ: ‘డెడ్‌మెన్ టెల్ నో టేల్స్’
ఫైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ ( ‘డెడ్‌మెన్ టెల్ నో టేల్స్’)
రివ్యూ: ఎక్స్ట్రాక్షన్
రివ్యూ: జుమాంజి: నెక్ట్స్ లెవల్
రివ్యూ: ఫ్రోజెన్ 2
రివ్యూ : ది లయన్ కింగ్