రివ్యూ : ఫలక్‌నుమా దాస్‌
నటీనటులు: విశ్వక్‌సేన్‌, సలోనీ మిశ్రా, హర్షితా గౌర్‌, తరుణ్‌ భాస్కర్‌, అభినవ్‌ గోమతం
సంగీతం: వివేక్‌ సాగర్‌
నిర్మాణ సంస్థ: వాన్మయే క్రియేషన్స్‌, విశ్వక్‌ సేన్‌ సినిమాస్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వక్‌ సేన్‌
విడుదల తేదీ: 31-05-2019

తెలుగు సినిమా మూస ధోర‌ణి నుంచి ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతోంది. వాస్తవిక‌త‌ని ఎక్కువ‌గా న‌మ్ముకుంటోంది. జ‌నాల‌కూ అదే న‌చ్చుతోంది. న‌ట‌న‌, స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌, పాత్రల స్వభావం, లొకేష‌న్లు ఇలా ప్రతీ విష‌యంలోనూ వాస్తవిక‌త ప్రతిబింబించ‌డం కూడా ఓ ట్రెండ్ అయ్యింది. దాన్ని అనుస‌రించిన చిత్రం ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’. ‘అంగ‌మ‌లై డైరీస్’ అనే ఓ మ‌ల‌యాళ చిత్రానికి రీమేక్ ఇది. దానికి తెలంగాణ నేటివిటీ జోడించే ప్రయత్నం చేశారు. మరి అదెంత వ‌ర‌కు స‌ఫ‌లీకృతం అయ్యింది? దాసు మెప్పించాడా?చూద్దాం.

క‌థేంటి: శంక‌ర‌న్న అనే లోక‌ల్ గుండాని చూసి తాను కూడా అలా అవ్వాల‌ని చిన్నప్పటి నుంచీ క‌ల‌లు కంటుంటాడు దాసు (విశ్వక్ సేన్‌). ఫ‌ల‌క్‌నుమాలో ఓ గ్యాంగ్ ని వేసుకుని తిరుగుతుంటాడు. గొడ‌వ‌లూ, కొట్లాట‌లూ అంటూ ప్రతీ రోజూ బిజీనే. డిగ్రీ త‌ప్పిన దాసు... త‌న స్నేహితుల‌తో క‌లిసి మ‌ట‌న్ వ్యాపారం మొద‌లెడ‌తాడు. అయితే... అదే వ్యాపారం చేస్తున్న ఇద్దరు రౌడీ బ్రదర్స్‌తో వైరం మొద‌ల‌వుతుంది. అక్కడి నుంచి దాసుకి క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు దాసు. ఆ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే రూ.25 ల‌క్షలు అవ‌స‌రం అవుతాయి. ఆ డ‌బ్బు సంపాదించ‌డానికి ర‌క‌ర‌కాల మార్గాలు ఎంచుకుంటాడు. అవ‌న్నీ త‌న‌కు కొత్త త‌ల‌నొప్పుల్ని, శ‌త్రువుల్నీ తెచ్చిపెడుతుంది. వాటి నుంచి దాసు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? చివ‌రికి ఏమైంద‌న్నదే క‌థ‌.


ఎలా ఉంది:
విశ్వక్ సేన్ మ‌ల‌యాళం సినిమాని ఉన్నది ఉన్నట్టుగా అనుస‌రించేశారు. ఆఖ‌రికి కొన్ని డైలాగులు కూడా త‌ర్జుమా చేసేసుకున్నారు. కాక‌పోతే... ఆ క‌థ‌ని తెలంగాణ నేప‌థ్యానికి చ‌క్కగా అన్వయించుకున్నాడు. తొలి స‌న్నివేశం నుంచే కెమెరా ఫ‌ల‌క్‌నుమా గల్లీల్లో తిరుగుతుంటుంది. అక్కడి జీవిన విధానం, మాట తీరు, దందాలు న‌డిచే ప‌ద్ధతి, కుర్రాళ్ల అల‌వాట్లూ వీటిపై ఫోక‌స్ చేసుకుంటూ వెళ్లారు. ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’లో పెద్దగా క‌థ ఉండ‌దు.


దాసు అనే కుర్రాడి జీవితంలో వివిధ ద‌శ‌లు, వాటిని దాటుకొచ్చిన ప‌ద్ధతి, ప‌డిన ఇబ్బందులు, చేసిన అల్లరే క‌నిపిస్తాయి. మాటకు మాట‌, దెబ్బకు దెబ్బ తీసే కుర్రాడి క‌థ ఇది. మందు కొట్టడం, అడ్డొచ్చిన‌వాళ్లని కొట్టడం ఇదే దాసు గ్యాంగ్‌ చేసే ప‌నులు. తొలి స‌న్నివేశాల్లోనే దాసు గ్యాంగ్ ఏం చేస్తుంద‌నేది చూపించేశారు. అయితే మాటి మాటికీ కొట్టుకోవ‌డాలే క‌నిపిస్తుంటాయి. దాసుకి ఒక‌టి కాదు, మూడు ప్రేమ‌క‌థ‌లు. అయితే ఏ ప్రేమ‌క‌థా గట్టెక్కదు. స్నేహితుల గ్యాంగ్‌లో అంత‌మంది ఉన్నా ఏ పాత్రా ప్రత్యేకంగా క‌నిపించ‌దు. ప్రతీ స‌న్నివేశంలోనూ మందు, మ‌ట‌నూ క‌నిపిస్తుంటాయి. మాస్ గోల ఎక్కువ‌. అయినా స‌రే, ప్రథమార్ధం పాసైపోతుంది. ద్వితీయార్ధం మాత్రం న‌డ‌క త‌ప్పింది.స్క్రీన్ ప్లే ఆర్డరంటూ లేకుండా... ఏవేవో కొన్ని స‌న్నివేశాలు వ‌చ్చి ప‌డిపోతుంటాయి. అందులో చాలా స‌న్నివేశాలు సుదీర్ఘంగా సాగుతాయి. వాటిలో కొన్ని స‌న్నివేశాలు త‌ప్పించినా క‌థ అర్థం కాకుండా పోదు. కాల‌యాప‌న త‌ప్ప‌... కొన్ని సీన్లకు ప్రత్యేక‌మైన ప్రయోజ‌నం ఏమీ క‌నిపించ‌దు. క్లైమాక్స్‌లో మాత్రం ద‌ర్శకుడు ఓ ప్రయోగం చేశాడు. 13 నిమిషాల సుదీర్ఘమైన స‌న్నివేశాన్ని ఒకే ఒక్క షాట్‌లో తెర‌కెక్కించాడు. అది నిజంగా సాహ‌స‌మే. అక్కడక్కడా కొన్ని మెరుపులు, తెలంగాణ భాష‌లోని సొగ‌సు, న‌టీన‌టుల ప్రతిభ.. ఇవి మిన‌హాయిస్తే.. ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ ఏ విష‌యంలోనూ మెప్పించ‌లేక‌పోయాడు.

ఎవ‌రెలా చేశారు:
విశ్వక్ సేన్ మ‌ల‌యాళం సినిమాని ఉన్నది ఉన్నట్టుగా అనుస‌రించేశారు. ఆఖ‌రికి కొన్ని డైలాగులు కూడా త‌ర్జుమా చేసేసుకున్నారు. కాక‌పోతే... ఆ క‌థ‌ని తెలంగాణ నేప‌థ్యానికి చ‌క్కగా అన్వయించుకున్నాడు. తొలి స‌న్నివేశం నుంచే కెమెరా ఫ‌ల‌క్‌నుమా గల్లీల్లో తిరుగుతుంటుంది. అక్కడి జీవిన విధానం, మాట తీరు, దందాలు న‌డిచే ప‌ద్ధతి, కుర్రాళ్ల అల‌వాట్లూ వీటిపై ఫోక‌స్ చేసుకుంటూ వెళ్లారు. ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’లో పెద్దగా క‌థ ఉండ‌దు.

దాసు అనే కుర్రాడి జీవితంలో వివిధ ద‌శ‌లు, వాటిని దాటుకొచ్చిన ప‌ద్ధతి, ప‌డిన ఇబ్బందులు, చేసిన అల్లరే క‌నిపిస్తాయి. మాటకు మాట‌, దెబ్బకు దెబ్బ తీసే కుర్రాడి క‌థ ఇది. మందు కొట్టడం, అడ్డొచ్చిన‌వాళ్లని కొట్టడం ఇదే దాసు గ్యాంగ్‌ చేసే ప‌నులు. తొలి స‌న్నివేశాల్లోనే దాసు గ్యాంగ్ ఏం చేస్తుంద‌నేది చూపించేశారు. అయితే మాటి మాటికీ కొట్టుకోవ‌డాలే క‌నిపిస్తుంటాయి. దాసుకి ఒక‌టి కాదు, మూడు ప్రేమ‌క‌థ‌లు. అయితే ఏ ప్రేమ‌క‌థా గట్టెక్కదు. స్నేహితుల గ్యాంగ్‌లో అంత‌మంది ఉన్నా ఏ పాత్రా ప్రత్యేకంగా క‌నిపించ‌దు. ప్రతీ స‌న్నివేశంలోనూ మందు, మ‌ట‌నూ క‌నిపిస్తుంటాయి. మాస్ గోల ఎక్కువ‌. అయినా స‌రే, ప్రథమార్ధం పాసైపోతుంది. ద్వితీయార్ధం మాత్రం న‌డ‌క త‌ప్పింది.

స్క్రీన్ ప్లే ఆర్డరంటూ లేకుండా... ఏవేవో కొన్ని స‌న్నివేశాలు వ‌చ్చి ప‌డిపోతుంటాయి. అందులో చాలా స‌న్నివేశాలు సుదీర్ఘంగా సాగుతాయి. వాటిలో కొన్ని స‌న్నివేశాలు త‌ప్పించినా క‌థ అర్థం కాకుండా పోదు. కాల‌యాప‌న త‌ప్ప‌... కొన్ని సీన్లకు ప్రత్యేక‌మైన ప్రయోజ‌నం ఏమీ క‌నిపించ‌దు. క్లైమాక్స్‌లో మాత్రం ద‌ర్శకుడు ఓ ప్రయోగం చేశాడు. 13 నిమిషాల సుదీర్ఘమైన స‌న్నివేశాన్ని ఒకే ఒక్క షాట్‌లో తెర‌కెక్కించాడు. అది నిజంగా సాహ‌స‌మే. అక్కడక్కడా కొన్ని మెరుపులు, తెలంగాణ భాష‌లోని సొగ‌సు, న‌టీన‌టుల ప్రతిభ.. ఇవి మిన‌హాయిస్తే.. ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ ఏ విష‌యంలోనూ మెప్పించ‌లేక‌పోయాడు.

ఎవ‌రెలా చేశారు: వాస్తవిక‌త‌ని ప్రతిబింబించాల‌నుకున్న సినిమా ఇది. న‌ట‌న‌లోనూ అదే క‌నిపిస్తుంది. ఏ పాత్రా న‌టిస్తున్నట్టు అనిపించ‌దు. విశ్వక్ సేన్ న‌టుడిగా మెప్పిస్తాడు. త‌న బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ బాగున్నాయి. క‌థానాయిక‌లు ముగ్గురున్నా ఏ ఒక్కరినీ గుర్తు పెట్టుకోలేం. స్నేహితుల బృందం, రౌడీ గ్యాంగ్ ఇలా ఎవ‌రి గురించి చెప్పుకొన్నా పాత్రానుసారం న‌టించారు. కాక‌పోతే లెక్కకు మించిన పాత్రలుంటాయి. అవ‌న్నీ రిజిస్టర్‌ కావ‌డం క‌ష్టం. చాలా రోజుల త‌ర‌వాత ఉత్తేజ్‌కి మంచి పాత్ర ప‌డింది. దర్శకుడు త‌రుణ్ భాస్కర్‌ నట‌న ఓ స్పెష‌ల్ ప్యాకేజీ లాంటిది.

కెమెరా టేకింగ్ విష‌యంలో, నేప‌థ్య సంగీతం విష‌యంలో ప్రత్యేక‌త క‌న‌బ‌రిచిందీ సినిమా. మాట‌లు అక్కడక్కడా బాగున్నాయి. హైద‌రాబాదీ సంస్క్కృతి, ఇక్కడి దందాలు, గ్యాంగ్‌ల గురించి బాగానే చూపించారు. నిడివి ఎక్కువ అవ్వడం, వినోదం పాళ్లు త‌క్కువ కావ‌డం ప్రతికూలాంశాలు. 

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ న‌టీన‌టులు
+ వాస్తవిక‌త‌
- నిడివి
- పాత్రల్ని బ‌లంగా తీర్చిదిద్దక‌పోవ‌డం

చివ‌రిగా: ఫ‌ల‌క్‌నుమా దాస్.. పక్కా మాస్‌Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.