ఆగస్టు 31(సినీ చరిత్రలో ఈరోజు)
* కొండగాలిలో... గుండె ఊసులు! (ఆరుద్ర జయంతి-1925)
భాగవతుల సదాశివ శంకరశాస్త్రి ఆరుద్రగా మారి తెలుగు సాహిత్యంలోను, సినిమా రంగంలోను చెరగని ముద్ర వేశారు. కవిగా, రచయితగా, గీత రచయితగా, అనువాదకుడిగా, ప్రచురణకర్తగా బహుముఖ ప్రజ్ఞ చూపించి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న సృజనశీలి ఆరుద్ర. విశాఖపట్నం దగ్గరి యలమంచిలో 1925 ఆగస్టు 31న పుట్టిన ఆరుద్ర కొన్నాళ్లు ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసి తర్వాత చెన్నై వచ్చి ‘ఆనందవాణి’ పత్రికలో ఉద్యోగం చేశారు. ఆపై సినీరంగ ప్రవేశం చేసి చిరస్మరణీయమైన పాటల్ని, మాటల్ని అందించారు. ఆయన పాటలు కొండగాలిలో గుండె ఊసులాడినట్టు ఉంటాయి. పడుచుదనం అందానికి ఇచ్చిన తాంబూలంలాగా ఊరిస్తాయి. నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వినట్టు ఉంటాయి.


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* పెండ్యాల నాగేశ్వరరావు వర్థంతి (సంగీత దర్శకుడు)(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* కొంటె బొమ్మల బాపు... గుండెనూయలనూపు! (బాపు వర్థంతి-2014)


‘కొంటె బొమ్మల బాపు... కొన్ని గంటల సేపు... గుండెనూయలనూపు... ఓ కూనలమ్మా!’ అన్నారు సినీకవి ఆరుద్ర. నిజమే. బాపు సినిమాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. పెదవులపై ఓ చిరునవ్వు దోబూచులాడుతూ ఉంటుంది. మనసులో ఏదో ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* శృంగార పురుషుడు!

మగవాళ్లలో ‘సెక్స్‌ సింబల్‌’ గుర్తింపు పొందడం అంతు సులువేమీ కాదు. అందం, నటన, హుందాతనం కలగలిసి ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టే రిచర్డ్‌ టిఫానీ గెరె నటుడిగానే కాదు, మానవతా వాదిగా కూడా పేరు పొందాడు. 1949 ఆగస్టు 31న పుట్టిన ఇతగాడి నటన గురించి తెలుసుకోవాలంటే ‘ప్రెట్టీ ఉమన్‌’, ‘రన్‌ ఎవే బ్రైడ్‌’, ‘షికాగో’, ‘లుకింగ్‌ ఫర్‌ మిస్టర్‌ గుడ్‌బార్‌’, ‘డేస్‌ ఆఫ్‌ హెవెన్‌’, ‘అమెరికన్‌ గిగోలో’, ‘యాన్‌ ఆఫీసర్‌ అండ్‌ ఎ జెంటిల్‌మన్‌’ లాంటి సినిమాలు చూడాలి. హాలీవుడ్‌లో హోమోసెక్సువల్‌గా, గే గా నటించి, మెప్పించిన గుర్తింపు కూడా ఇతడిదే. గెరె 2007లో ఇండియాకి వచ్చి ఎయిడ్స్‌ అవగాహన కార్యక్రుమాల్లో పాల్గొన్నాడు. ఆ సందర్భంలోనే నటి శిల్పాశెట్టిని బహిరంగ వేదికపై కౌగలించుకుని, చెంప మీద ముద్దు పెట్టుకుని వివాదాలకు కేంద్రబిందువయ్యాడు. ఈ ప్రవర్తన భారతీయ సంప్రదాయాలకు విరుద్ధమంటూ కేసు దాఖలవడంతో అతడి అరెస్ట్‌ వారెంట్‌ కూడా జారీ అయింది. అయితే ఆ తర్వాత ఛీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని బెంచ్‌ తీర్పునిస్తూ ఆ కేసును కొట్టివేసింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.