మార్చి 13.. (సినీ చరిత్రలో ఈరోజు)

* బిఎన్‌ మలచిన ‘భాగ్యరేఖ’
(సినిమా విడుదల)


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* అన్వేషకుల కథ-అత్యంత ప్రభావం చూపించిన గొప్ప సినిమాల్లో ఒకటి!
-మేటి అమెరికా వెస్టర్న్‌ చిత్రంగా గుర్తింపు!
-వంద గొప్ప సినిమాల జాబితాలో 12వ స్థానం!
-అంతర్జాతీయ సర్వేలో ప్రపంచ మేటి సినిమాల్లో 7వ స్థానం!
-అమెరికా జాతీయ సినీ గ్రంథాలయంలో చోటు!
.. వీటన్నింటితో పాటు అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకున్న సినిమా ‘ద సెర్చెర్స్‌’ (1956).

అమెరికాలో ఒకప్పుడు సివిల్‌ వార్‌ తలెత్తిన కాలంనాటి పరిస్థితుల ఆధారంగా అమెరికా రచయిత అలన్‌ లీమే రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమాలో ఓ మధ్య వయస్కుడు, తప్పిపోయిన తన మేనకోడలును వెతకుతూ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేదే కథ.

* సూపర్‌హీరో సాహసాలుఅమెరికాలో సూపర్‌ హీరోలకు కొదవ లేదు. ఒకొక్కరికీ ఒకో డ్రెస్‌... ఒకో పవర్‌. అందరూ ఎదుర్కొనేది దుండగులనే, కాపాడేది సామాన్య ప్రజలనే. అలాంటి సూపర్‌ హీరోల పరంపరలో అందర్నీ ఆకట్టుకున్న వాడు కెప్టెన్‌ అమెరికా. మార్వెల్‌ కామిక్స్‌ పుస్తకాల్లో 1941లో పుట్టిన ఇతగాడు వెండితెరపై చేసిన సాహసాలే ‘కెప్టెన్‌ అమెరికా: ద వింటర్‌ సోల్జర్‌’ (2014) సినిమా. ఇది 2011లో వచ్చిన ‘ద ఫస్ట్‌ ఎవెంజర్‌’ సినిమాకి సీక్వెల్‌. మార్వెల్‌ కామిక్‌ సినీమాటిక్‌ యూనివర్శ్‌ సంస్థ నుంచి వచ్చి తొమ్మిదో చిత్రం. దీన్ని 177 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తెరకెక్కిస్తే 714.3 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా 2016లో ‘సివిల్‌ వార్‌’ సినిమా వచ్చింది.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.