ఏప్రిల్‌ 15.. (సినీ చరిత్రలో ఈరోజు)

* మధుర గాయకుడు!
(పి.బి.శ్రీనివాస్‌ వర్థంతి-2013)(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* అందానికి సాక్షి
(సాక్షి శివానంద్‌ పుట్టిన రోజు-1977)


తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు హిందీ భామలదే హవా. ఆ సమయంలోనే అడుగుపెట్టింది సాక్షి శివానంద్‌. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు, మహేష్‌బాబు, నాగార్జున, రాజశేఖర్‌ తదితర అగ్ర కథానాయకుల సరసన ఆడిపాడింది. తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తన అందంతో అసలు సిసలు కమర్షియల్‌ కథానాయిక అనిపించుకుంది. ‘మాస్టర్‌’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ‘కలెక్టర్‌ గారు’, ‘రాజహంస’, ‘నిధి’, ‘సముద్రం’, ‘సీతారామరాజు’, ‘పెళ్లివారమండీ’, ‘యమజాతకుడు’, ‘వంశోద్ధారకుడు’, ‘యువరాజు’, ‘మా పెళ్లికి రండి’, ‘సింహరాశి’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా... తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించిందామె. ముంబైలో 1977 ఏప్రిల్‌ 15న జన్మించిన సాక్షి 1995లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత దక్షిణాదిపై దృష్టిపెట్టి వరుస అవకాశాలు అందుకొంది. ఇతర భాషలతో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఆమెకి ఎక్కువ పేరొచ్చింది. ‘హోమం’, ‘రంగ ది దొంగ’ తర్వాత మళ్లీ ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. ‘కలెక్టర్‌ గారు’, ‘సముద్రం’ చిత్రాల్లో ఆమె గ్లామర్‌ అప్పట్లో కుర్రకారుని కిర్రెక్కిచ్చింది. సాక్షికి శిల్పా ఆనంద్‌ అనే ఓ చెల్లెలు ఉన్నారు. ఆమె హిందీ ధారావాహికలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈరోజు సాక్షి శివానంద్‌ పుట్టినరోజు.

* లాస్‌ ఏంజెలిస్‌లో లావా!


ఎప్పుడూ హడావిడిగా, వాహనాల ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే మహానగరం మధ్యలో అగ్నిపర్వతం బద్దలై, లావా పెల్లుబికితే? ఆ ఊహే భయానకంగా ఉంటుంది. అలాంటి ఊహ నిజమైతే ఎలా ఉంటుందో కళ్లకు కట్టిన సినిమా ‘వాల్కనో’ (1997). తుపాను, సునామీ, టోర్నెడోల్లాంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వీటిని డిజాస్టర్‌ సినిమాలంటారు. లాస్‌ ఏంజెలిస్‌ మహానగరంలోని ఓ పార్క్‌లోంచి ఉన్నట్టుండి అగ్నిపర్వతం బద్దలై, అత్యధిక ఉష్ణోగ్రతతలో ఉండే చిక్కని లావా ఓ నదిలాగా ప్రవహించడం మొదలైతే ఎలా ఉంటుందో, ఆ లావా ప్రవాహాన్ని దారి మళ్లించడం కోసం ‘డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌’ బృంద సభ్యులు ఎలాంటి ప్రణాళికలు వేశారో, సామాన్య ప్రజలు ఎలా గగ్గోలు పెట్టారో... ఇలాంటి సన్నివేశాలతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందింది. సినిమాలో లావా విరజిమ్మడం, అగ్ని పర్వతం విస్ఫోటనాలు వెదజల్లడం లాంటి దృశ్యాలను అత్యంత సహజంగా చిత్రీకరించారు. చిత్రమేమిటంటే, లావా నేపథ్యంలో ఒకే ఏడాది రెండు సినిమాలు వచ్చాయి. ఈ సినిమా విడుదలకు రెండు నెలల ముందు ‘డాంటేస్‌ పీక్‌’ అనే మరో సినిమా విడుదలైంది. రెండూ ప్రేక్షకాదరణ పొందడం మరో విశేషం.

* ఎమ్మా వాట్సనా? హెర్మియాన్‌ గ్రాంగరా?


హ్యారీపాటర్‌ సినిమాలు చూసే వాళ్లందరూ ఆమెను హెర్మియర్‌ గ్రాంగర్‌గానే గుర్తుపెట్టుకుంటారు. అసలు పేరు కన్నా పాత్ర పేరుతో ప్రాచుర్యం పొందిన ఆ నటే ఎమ్మా వాట్సన్‌. నటిగా, మోడల్‌గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈమె, హ్యారీ పాటర్‌ సినిమాలతో చిన్నతనంలోనే అత్యధికంగా సంపాదించిన నటిగా రికార్డు సృష్టించింది. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘సితార.నెట్‌’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.