నవంబర్‌ 15..(సినీ చరిత్రలో ఈరోజు)

* సూపర్‌ హీరో వీర విహారం!


మెరికా కామిక్‌ పుస్తకాల్లో మానవాతీత శక్తులున్న సూపర్‌హీరోలు చాలా మంది పుట్టుకొచ్చారు. వాళ్లంతా ఆ తర్వాత టీవీల్లో జొరబడి సందడి చేశారు. ఆపై వెండితెరపైకి దూకి వసూళ్ల వర్షం కురిపించారు. సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, ఐరన్‌మ్యాన్, బర్డ్‌మ్యాన్‌లాంటి విచిత్ర శక్తుల, వింత రూపాల హీరోలే వీళ్లంతా. వీరిలో కావాలనుకున్నప్పుడల్లా గబ్బిలం ఆకారంతో గగన విహారం చేస్తూ అద్భుత శక్తులతో అక్రమార్కుల పని పట్టే బ్యాట్‌మ్యాన్‌ ఆధారంగా హాలీవుడ్‌లో సీక్వెల్‌ సినిమాలు సందడి చేశాయి. ఇవన్నీ వందల కోట్ల డాలర్లను కురిపించి విజయవంతమయ్యాయి. అలా తొలిసారిగా వచ్చిన బ్యాట్‌మ్యాన్‌ సినిమా 1989 విడుదలై కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని ఈ కథలను వీడియోలుగా విడుదల చేస్తే అవి కూడా అమ్మకాల్లో రికార్డు సృష్టించాయి.

....................................................................................................................................................................

* రజనీగంధ... విద్యా సిన్హా (జయంతి)


(ప్రతేక్య వార్త కోసం క్లిక్ చేయండి..)

* కుటుంబమంతా నటులే! 


బాలీవుడ్‌లో పృథ్వీరాజ్‌ కపూర్‌ కుటుంబం గురించి తెలిసిందే. రంగస్థలం నుంచి వెండితెర వరకు ఈ కుటుంబీకులు మూడు తరాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇలా హాలీవుడ్‌లో కూడా ఓ పెద్ద కుటుంబం ఉంది. అదే ‘బారీమోర్‌ ఫ్యామిలీ’. ఈ కుటుంబం కూడా తరతరాలుగా నాటకాలు, రేడియోలు, టీవీలు, సినిమాల ద్వారా అమెరికా ప్రేక్షకులందరికీ చిరపరిచితులే. ఈ కుటుంబం గురించి చెప్పుకోవాలంటే 1827 దగ్గర్నుంచి మొదలు పెట్టాలి. అలాంటి కుటుంబంలో పుట్టి హాలీవుడ్‌లో లెజెండ్‌గా పేరు తెచ్చుకున్న నటుడే లియోనెల్‌ బారీమోర్‌. ఇతడి తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు, మేనళ్లుళ్లు, మేనకోడళ్లు, కొడుకులు, మనవలు, మనవరాళ్లు... ఇలా చాలా మంది సినీ రంగానికి సేవలందించిన ప్రముఖులే. లియోనెల్‌ నటుడిగా, దర్శకుడిగా పేరు పొందాడు. ‘ఎ ఫ్రీ సోల్‌’ (1931) సినిమాలో నటనకు ఆస్కార్‌ అందుకున్నాడు. ‘ఇట్స్‌ ఎ వండర్‌ఫుల్‌ లైఫ్‌’ (1946) సినిమాలో విలన్‌ పాత్ర ద్వారా ప్రపంచ వ్యాప్త గుర్తింపు సాధించాడు. ఫిలడెల్ఫియాలో 1923 ఏప్రిల్‌ 28న పుట్టిన ఇతడు విలక్షణ నటుడిగా పేరు పొంది, 1954లో నవంబర్‌ 15న తన 76 ఏళ్ల వయసులో మరణించాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.