ఏప్రిల్‌ 5 (సినీ చరిత్రలో ఈరోజు)

* అందాల అభినేత్రి...
దివ్యభారతి (వర్థంతి-1993)


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* స్వర్ణయుగంలో గొప్ప నటుడు


హా
లీవుడ్‌లో క్లాసిక్‌ సినిమాలు తెరకెక్కిన కాలంలో ఓ గొప్ప నటుడిగా పేరు పొందాడు స్పెన్సర్‌ ట్రేసీ. రెండు ఆస్కార్‌ అవార్డులు సహా మరెన్నో పురస్కారాలు అతడి అభినయ కౌశలానికి గీటురాళ్లు. కాలేజీ రోజుల్లోనే నాటకాల ద్వారా నటుడైన ట్రేసీ, ‘అప్‌ ద రివర్‌’ (1930) సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆపై ‘ద పవర్‌ ఆఫ్‌ ద గ్లోరీ’, ‘కెప్టెన్స్‌ కరేజియస్‌’, ‘బోయ్స్‌ టౌన్‌’, ‘గెస్‌ హూ ఈజ్‌ కమింగ్‌ టు డిన్నర్‌’లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. అమెరికాలో 1900 ఏప్రిల్‌ 5న పుట్టిన ఇతడు ‘గ్రేటెస్ట్‌ మేల్‌ స్టార్‌ ఆఫ్‌ హాలీవుడ్‌ గోల్డెన్‌ ఎరా’గా గుర్తింపు తెచ్చుకుని, 1967 జూన్‌ 10న కాలిఫోర్నియాలో తన 57వ ఏట మరణించాడు.

* అలనాటి మేటి నటి


60
ఏళ్ల నటనా ప్రస్థానం...
నాటకాలు, టీవీ, సినీ రంగాల్లో గుర్తింపు...
హాలీవుడ్‌ చరిత్రలోనే గొప్ప నటిగా ప్రాచుర్యం...
ఉత్తమ నటిగా రెండు ఆస్కార్లు సహా మరెన్నో పురస్కారాలు...

ఇవీ బెట్వే డేవిస్‌ సాధించిన విజయాలు. మసాచుసెట్స్‌లో 1908 ఏప్రిల్‌ 5న పుట్టిన ఈమె, నాటకాలు చూసి నటి కావాలని ఆశపడింది. అనుకున్నది సాధించి నాటక రంగంలో మంచి నటిగా పేరు పొంది, సినీ రంగం నుంచి ఆహ్వానాలు అందుకుంది. ‘బ్యాడ్‌ సిస్టర్‌’ (1931)తో వెండితెరకు పరిచయమై, ‘సీడ్‌’, ‘వాటర్లూ బ్రిడ్జ్‌’, ‘ద మెనేస్‌’, ‘హెల్స్‌ హౌస్‌’, ‘ద మ్యాన్‌ హూ ప్లేయ్డ్‌ గాడ్‌’, ‘ఆఫ్‌ హ్యూమన్‌ బాండేజ్‌’లాంటి ఎన్నో సినిమాల్లో అందాల తారగా మురిపించింది. ‘ఉమన్‌ ఆఫ్‌ లవ్లీ ఐస్‌’గా పేరు పొందిన ఈమె, ఫ్రాన్స్‌లో 1989 అక్టోబర్‌ 6న తన 81 ఏళ్ల వయసులో కన్నుమూసింది.

* మరువలేని నటుడు


ల్లిదండ్రులు చిన్నప్పుడే విడాకులు తీసుకోవడంతో అమ్మమ్మ ఇంట పెరిగాడు... అమ్మమ్మ వారానికో సినిమా చూపించడంతో నటన పట్ల ఆకర్షితుడయ్యాడు... ఆపై నాటక రంగంలో మెప్పించి వెండితెరపై విలక్షణ నటుడిగా ముద్ర వేశాడు... అమెరికా అధ్యక్షుని నుంచి అత్యున్నత పురస్కారం అందుకున్నాడు... ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్‌ సహా మరెన్నో అవార్డులు, గౌరవాలు పొందాడు... ఆ నటుడే గ్రెగరీ పెక్‌. ప్రపంచ వ్యాప్తంగా విజయఢంకా మోగించిన ఎన్నో సినిమాల్లో చిరస్మరణీయమైన పాత్రలు ధరించి సినీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. ‘ద గన్స్‌ ఆఫ్‌ నవరోన్‌’, ‘ద ఓమెన్‌’, ‘టు కిల్‌ ఎ మాకింగ్‌ బర్డ్‌’, ‘ద కీస్‌ ఆఫ్‌ ద కింగ్‌డమ్‌’, ‘ద ఈర్లింగ్‌’, ‘జెంటిల్‌మ్యాన్స్‌ ఎగ్రిమెంట్‌’, ‘ట్వెల్వోక్లాక్‌ హై’, ‘స్పెల్‌బౌండ్‌’, ‘ద గన్‌ఫైటర్‌’, ‘ద బాయ్స్‌ ఫ్రమ్‌ బ్రెజిల్‌’ లాంటి ఎన్నో సినిమాల ద్వారా ప్రపంచ ప్రేక్షకులను మెప్పించాడు. కాలిఫోర్నియాలో 1916, ఏప్రిల్‌ 5న పుట్టిన గ్రెగరీ పెక్, ‘ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’ పురస్కారం సహా, ‘గ్రేటెస్ట్‌ మేల్‌ స్టార్‌ ఆఫ్‌ క్లాసిక్‌ హాలీవుడ్‌ సినిమా’ గుర్తింపులతో వెండితెర అభినయ రంగాన్ని సుసంపన్నం చేసి తన 87వ ఏట 2003 జూన్‌ 12న మరణించాడు.

* వెండితెర మోజెస్‌సి
నీ చరిత్రలో గొప్ప సినిమాలనగానే గుర్తుకు వచ్చే సినిమా ‘టెన్‌ కమాండ్‌మెంట్స్‌’. నాటికీ, నేటికీ ఈ సినిమా ఓ అత్యద్భుత దృశ్యకావ్యంగా సినీ అభిమానుల నీరాజనాలు అందుకుంటూనే ఉంది. ఆ సినిమాలో మోజెస్‌ పాత్రలో ప్రపంచ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన నటుడు చార్ల్‌æన్‌ హెస్టన్‌. అలాగే మరో మేటి సినిమా ‘బెన్‌హర్‌’లో ప్రధాన పాత్ర ధరించిందీ ఇతడే. మేటి నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా కూడా ప్రాచుర్యం పొందాడు. ఆరు దశాబ్దాల కాలంలో 100కు పైగా సినిమాల్లో నటించిన ఈయన ప్రతి పాత్ర గుర్తుండిపోయేదే. ‘టచ్‌ ఆఫ్‌ ఈవిల్‌’, ‘ఎల్‌సిడ్‌’, ‘ప్లానెట్‌ ఆఫ్‌ ఏప్స్‌’, ‘ద గ్రేటెస్ట్‌ షో ఆన్‌ ఎర్త్‌’, ‘సీక్రెట్‌ ఆఫ్‌ ఇంకాస్‌’, ‘ద బిగ్‌ కౌంటీ’, ‘ద గ్రేటెస్ట్‌ స్టోరీ ఎవర్‌ టోల్డ్‌’లాంటి ఎన్నో ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్లో విలక్షణ నటనతో మెప్పించాడు. ఇల్లినాయిస్‌లో 1923 అక్టోబర్‌ 4న పుట్టిన హెస్టన్, నాటక రంగంలో మెప్పించి వెండితెరకు ఎదిగాడు. అతడి సినీ విజయ పరంపం ‘డార్క్‌సిటీ’ (1950)తో మొదలై అప్రతిహతంగా సాగింది. ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్‌ సహా మరెన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న హెస్టన్, తన 84వ ఏట 2008 ఏప్రిల్‌ 5న కాలిఫోర్నియాలో కన్నుమూశాడు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.