ఏప్రిల్‌ 10.. (సినీ చరిత్రలో ఈరోజు)

* అందాల నటి (ఆయేషా టికియా పుట్టిన రోజు)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)
 

* మరోసారి విజృంభించిన స్పైడర్‌మ్యాన్‌సాలీడులాగా గోడలను నిట్టనిలువుగా ఎక్కడమే కాదు, సాలె దారాల ఆధారంతో గాలిలోకి చకచకా ఎగురగలిగే స్పైడర్‌మ్యాన్‌ తరతరాలుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. మార్వెల్‌ కామిక్‌ పుస్తకాల్లో సూపర్‌హీరో పాత్రగా 1962లో పుట్టిన స్పైడర్‌మ్యాన్‌ టీవీల్లోను, సినిమాల్లోనూ సందడి చేస్తూనే ఉన్నాడు. ఆ పాత్రలో వచ్చిన మరో సినిమా ‘ద ఎమేజింగ్‌ స్పైడర్‌మ్యాన్‌2’ (2014). ఇది స్పైడర్‌ మ్యాన్‌ పాత్రతో వచ్చిన సినిమాల్లో అయిదవది. అంతక్రితం వచ్చిన ‘ద ఎమేజింగ్‌ స్పైడర్‌మ్యాన్‌’ (2012) సినిమాకి సీక్వెల్‌. ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో తెరకెక్కించిన ఈ సినిమా 293 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి ఏకంగా 709 మిలియన్‌ డాలర్లు రాబట్టి విజయం సాధించింది.

* గెలాక్సీని కాపాడే వీరులు
ప్రపంచాన్ని కాపాడ్డం పాత విషయం. జేమ్స్‌బాండ్, సూపర్‌మ్యాన్‌ లాంటి వాళ్లు ఆ పని ఎప్పుడో చేసేశారు. అందుకే సినిమా కొత్త బాట పట్టింది. ఈసారి భూమి పరిధులు దాటి అంతరిక్షంలో నక్షత్రమండలాలకే ప్రమాదం ముంచుకొస్తే? వాటిని కాపాడేదెవరు? ఊహలకు రెక్కలొస్తే అలాంటి వీరులు పుట్టుకురావడం ఎంతసేపు? అలాగే వచ్చేశారు గెలాక్సీనే రక్షించగలిగే సూపర్‌హీరోలు. వాళ్ల కథతో వచ్చిన సినిమా ‘గార్డియన్స్‌ ఆఫ్‌ ద గెలాక్సీ’ సినిమా. కామిక్స్‌ పుస్తకాల్లోంచి ప్రాణం పోసుకున్న హీరోలందరూ కలిసి ఈ సినిమాలో చేసిన విన్యాసాలు ఆకట్టుకోవడంతో దానికి సీక్వెల్‌లో 2017లో అదే పేరుకు వాల్యూమ్‌2 జతచేసి మరో సినిమా తీశారు. కథ ఎప్పుడైతే భూమి నుంచి ఎగిరిపోయి నక్షత్రాల బాట పట్టిందో, అందులోని పాత్రల వింత శక్తులు, విచిత్ర రూపాలకు అడ్డేముంది? ఆపేముంటుంది? అందుకే ఈ సినిమాలో అద్భుత శక్తుల మాయాజాలం కనిపిస్తుంది. చిత్రవిచిత్ర రూపాలతో ఉండే గ్రహాంతర వాసులు, వాళ్ల నివాస గ్రహాలు, అంతుపట్టని అంతరిక్ష నౌకలు, అనూహ్యమైన ఆయుధాలు... ఇవన్నీ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌తో అద్భుత లోకాన్ని ఆవిష్కరించడంతో ఈ సినిమా 200 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 863.8 మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టింది.

* స్టార్‌వార్స్‌ నటిస్టార్‌వార్స్‌ సినిమాలు చూసిన వారికి డైసీ రిడ్లీ ఇట్టే గుర్తుండిపోతుంది. బుల్లితెర, లఘుచిత్రాల ద్వారా ఆమె నటిగా నిరూపించుకుని వెండితెరకు పరిచయమైంది. ‘స్క్రాల్‌’ (2015) సినిమాతో ఆకట్టుకున్న ఆమె, ‘స్టార్‌వార్స్‌’ సినిమాల ట్రయాలజీతో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ సినిమాల్లో ప్రధాన పాత్ర ‘రే’గా ఆమె నటన ఆకట్టుకుంటుంది. ‘మర్డర్‌ ఆన్‌ ద ఓరియంట్‌ ఎక్స్‌ప్రెస్‌’ (2017) సినిమా కూగా ఆమెకు మంచి నటిగా పేరు తెచ్చింది. లండన్‌లో 1992 ఏప్రిల్‌ 10న పుట్టిన డైసీ, టీవీల ద్వారా నటిగా నిరూపించుకుని వెండితెర అవకాశాలు అందిపుచ్చుకుని తారగా ఎదిగింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.