ఆగస్టు 12 (సినీ చరిత్రలో ఈరోజు)

అలరించిన ‘వీరాభిమన్యు’!


వి
డుదలై 55 ఏళ్లయినా ఇప్పటికీ ఆకట్టుకునే చిత్రం ‘వీరాభిమన్యు’. ఎన్టీఆర్‌ కృష్ణుడిగా నటించిన ఈ సినిమా శోభన్‌బాబును హీరోను చేస్తే, కాంచనను తెలుగు తెరకు పరిచయం చేసింది. రవికాంత్‌ నగాయిచ్‌ ట్రిక్‌ ఫొటోగ్రఫీ అద్భుత లోకాలను కళ్లముందు ఆవిష్కరిస్తుంది. పన్నెండు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమా విశేషాలు ఆద్యంతం ఆసక్తికరం.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

ఆ సినిమాకి ఎన్నో
ప్రత్యేకతలు ఉన్నాయి..


నిశ్శబ్ద చిత్రాల్లో ఆస్కార్‌ అవార్డు పొందిన ఏకైన సినిమా అది.

- ఇద్దరు పురుషులు ముద్దు పెట్టుకున్నట్టు చూపించిన తొలి సినిమా అది.

- నగ్నత్వాన్ని తొలి సారిగా చూపించిన సినిమా అది.

- ఆస్కార్‌ అవార్డుల తొలి వేడుకలో ఉత్తమ చిత్రంగా నిలిచిన సినిమా అది.

85వ వార్షికోత్సవం సందర్భంగా 2012లోను, 90వ వార్షికోత్సవం సందర్భంగా 2017లోను రీరిలీజ్‌ అయిన సినిమా అది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ సినిమా ‘వింగ్స్‌’ 1927లో ఆగస్టు 12న విడుదలైంది. నిశ్శబ్ద చిత్రాల కాలంలో అందాల తారగా పేరొందిన క్లారా బౌ నటించిన ఈ సినిమా మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో అల్లుకున్న కథతో వచ్చింది. ప్రపంచ యుద్ధంలో పైలట్‌గా వ్యవహరించిన విలియం ఎ.వెల్‌మ్యాన్‌ దీనికి దర్శకత్వం వహించడం విశేషం. వందలాది మంది ఎక్స్‌ట్రా నటులు, 300 పైలెట్లు, అమెరికా సైన్యానికి చెందిన విమానాలు, 3500 మంది సైనిక పాత్రధారులతో చాలా వాస్తవికంగా చిత్రీకరించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. బెస్ట్‌ ఇంజినీరింగ్‌ ఎఫెక్ట్స్‌కి మరో ఆస్కార్‌ అందుకున్న ఈ చిత్రాన్ని రెండు మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీస్తే, 28.8 మిలియన్‌ డాలర్లను రాబట్టింది.

హాలీవుడ్‌ పితామహుడు!


ఆయన...‘ఫాదర్‌ ఆఫ్‌ ద సినిమా ఆఫ్‌ ద యునైటెడ్‌ స్టే’గా పేరొందాడు!

వ్యాపారాత్మకంగా విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శక నిర్మాతగా కీర్తి గడించాడు!

గొప్ప దృశ్యకావ్యాలుగా, భారీతనంతో కూడిన చిత్రాలను తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాడు!

ఆయనే... సెసిల్‌ బి.డెమిల్లే. ఇలా చెబితే తెలియడం కష్టమే. కానీ ‘ద టెన్‌ కమాండ్‌మెంట్స్‌’, ‘ద కింగ్‌ ఆఫ్‌ కింగ్స్‌’, ‘క్లియోపాత్రా’, ‘శాంసన్‌ అండ్‌ డిలైలా’ లాంటి చిత్రాల రూపకర్తగా చెబితే జేజేలు పలుకుతారు. 1914 నుంచి 1958 వరకు ఆయన మొత్తం 70 చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించాడు. తొలి సినిమా ‘ద స్క్వా మ్యాన్‌’తోనే హాలీవుడ్‌కే గుర్తింపు తెచ్చిన డెమిల్లే ఆ తరువాత భాగస్వాములతో కలిసి ‘ప్యారమౌంట్‌ పిక్చర్స్‌’ సంస్థను స్థాపించాడు. ‘ద గ్రేటెస్ట్‌ షో ఆన్‌ ఎర్త్‌’ (1952) సినిమా ఉత్తమ చిత్రంగా ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు అందుకుంది. ‘ద టెన్‌ కమాండ్‌మెంట్స్‌’ సినిమా ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో 7వ స్థానంలో నిలించింది. సినీ రంగానికి సేవలకుగాను డెమిల్లే గౌరవ ఆస్కార్‌ అవార్డును అందుకున్నాడు.

విలక్షణ నటుడు


చి
న్నతనంలోనే నటుడిగా ప్రయాణం ప్రారంభించిన అతడు విలక్షణ అభినయంతో ఆకట్టుకుని అవార్డులు అందుకున్నాడు. అతడే కేసీ ఎఫ్లెక్‌. నటుడిగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన ఇతడు, ‘టు డై ఫర్‌’, ‘గుడ్‌విల్‌ హంటింగ్‌’, ‘గెర్రీ’, ‘గాన్‌ బేబీ గాన్‌’, ‘ఐయామ్‌ స్టిల్‌ హియర్‌’, ‘ఇంటర్‌స్టెల్లార్‌’, ‘ఎ ఘోస్ట్‌ స్టోరీ’, ‘ఓషన్స్‌ ఎలెవెన్‌’ సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. బుల్లితెర ద్వారా కూడా ఇంటింటి అభిమానులను పొందాడు. ‘మాంచెస్టర్‌ బై ద సీ’ సినిమాలో నటనకు గోల్డెన్‌గ్లోబ్, బాఫ్టా, అకాడమీ, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ లాంటి అవార్డులను అందుకున్నాడు. మసాచుసెట్స్‌లో 1975 ఆగస్టు 12న పుట్టిన ఇతడు చిన్నతనంలోనే నాటకరంగం ద్వారా నటనను ప్రారంభించాడు. ఇతడి సోదరుడు బెన్‌ అఫ్లెక్‌ కూడా నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇద్దరూ కలిసి నాటకాల్లో పాత్రలు ధరిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు.

అయిదు దశాబ్దాల ముద్ర


ప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నించే హాలీవుడ్‌లో అయిదు దశాబ్దాల పాటు నటుడిగా కొనసాగడం అసాధారణమే. అదే సాధించాడు హెన్రీ ఫాండా. నాటకాలతో మొదలు పెట్టి వెండితెరకి ఎదిగి విలక్షణ పాత్రల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ద గ్రేప్స్‌ ఆప్‌ రాత్‌’, ‘ద ఆక్స్‌బౌ ఇన్సిడెంట్‌’, ‘మిస్టర్‌ రాబర్ట్స్‌’, ‘12 యాంగ్రీమెన్‌’, ‘వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ద వెస్ట్‌’, ‘యువర్స్‌ మైన్‌ అండ్‌ అవర్స్‌’ లాంటి సినిమాల ద్వారా మెప్పించాడు. ‘ఆన్‌ గోల్డెన్‌ పాండ్‌’ సినిమా ద్వారా ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నాడు. ఇతడి కుటుంబం అంతా నటులుగా పేరు తెచ్చుకోవడం విశేషం. కూతురు జానే ఫాండా, కొడుకు పీటర్‌ ఫాండా, మనవరాలు బ్రిడ్జెట్‌ ఫాండా, మనవడు ట్రోయ్‌ గ్యారిటీ నటులుగా రాణించారు. హాలీవుడ్‌లో గ్రేటెస్ట్‌ మేల్‌ స్టార్‌గా ఇతడిని అమెరికన్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌ గుర్తించడం విశేషం. నెబ్రాస్కాలో 1905 మే 16న పుట్టిన ఇతడు ఇరవై ఏళ్ల వయసులో నటన పట్ల ఆకర్షితుడయ్యాడు. నాటకాల ద్వారా పేరు తెచ్చుకుని వెండితెరపై మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు, కాలిఫోర్నియాలో 1982 ఆగస్టు 12న తన 77వ ఏట మరణించాడు.

ముగ్గురు సోదరీమణులు


క్కచెల్లెళ్లు వెండితెర తారలుగా అలరించడం మామూలే. తెలుగులో లలిత, పద్మిని, రాగిణి నుంచి బి. సరోజ, వైజయంతి మాల, షావుకారు జానకి, కృష్ణకుమారి నుంచి ఇలా ఎందరో అన్ని భాషా చిత్రాల్లోను కనిపిస్తారు. హాలీవుడ్‌లో కూడా ఇలాంటి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. వారే పాలీ యాన్, సాలీ బ్లేన్, లొరెట్టా యంగ్‌ ఇలాంటి వాళ్లే. వీరిలో లొరెట్టా యంగ్‌ మాత్రం చిరకాలం సినిమాల్లో కొనసాగుతూ అందాల తారగా మంచి పేరు తెచ్చుకుంది. ‘ద ఫార్మర్స్‌ డాటర్‌’ సినిమాతో ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకుంది. టీవీల్లో ‘లొరెట్టా యంగ్‌ షో’ కార్యక్రమం ద్వారా ఎనిమిదేళ్లు ఆకట్టుకుంది. అమెరికాలో 1913 జనవరి 6న పుట్టిన లొరెట్టా యంగ్, రెండేళ్లకే మూకీ చిత్రాల్లో బాలనటిగా ప్రస్థానం ప్రారంభించింది. దశాబ్దాల పాటు నటిగా తనదైన ముద్ర వేసిన ఈమె, కాలిఫోర్నియాలో 2000 ఆగస్టు 12న తన 87వ ఏట మరణించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.