ఆగస్టు 18.. (సినీ చరిత్రలో ఈరోజు)

* బహుముఖ ప్రజ్ఞాశాలి!
(గుల్జార్‌ పుట్టినరోజు-1934)


బాలీవుడ్‌లోనే కాదు, భారతీయ సినిమా చరిత్రలోనే గుల్జార్‌ది ఓ ప్రత్యేకమైన అధ్యాయం. ఆస్కార్, గ్రామీ, దాదాసాహెబ్‌ ఫాల్కే లాంటి ఎన్నో అవార్డులు ఆయన ప్రతిభకు గీటురాళ్లు మాత్రమే. కవిగా, గీత రచయితగా, సంగీతకారుడిగా, దర్శకుడిగా ఆయన ప్రతిభ బహుముఖం.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అలరించిన అభినయం...
(రాబర్ట్‌ రెడ్‌ఫోర్డ్‌ (జూ) పుట్టినరోజు- 1936)


అమెరికా అధ్యక్షుడు అందించిన అత్యున్నత పతకం... ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత పురస్కారం... రెండు ఆస్కార్లు... బాఫ్తా, గోల్డెన్‌గ్లోబ్, యాక్టర్స్‌గిల్డ్, జీవితకాల సాఫల్య పురస్కారాలు... ప్రపంచంలోనే ప్రభావవంతుడిగా టైమ్స్‌ గురింపు... ఇలాంటి అవార్డులెన్నో గెలుచుకున్న అమెరికా నటుడు, దర్శకుడు, నిర్మాత, వ్యాపారవేత్త, సన్‌డ్యాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ వ్యవస్థాపకుడు ఛార్లెస్‌ రాబర్ట్‌ రెడ్‌ఫోర్డ్‌ (జూ). 1936 ఆగస్టు 18న పుట్టిన ఇతడు టెలివిజన్‌ నటుడిగా ఉత్తమ నటన కనబరిచి వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి చిత్రం ‘వార్‌హంట్‌’ (1962), ‘ఇన్‌సైడ్‌ డైసీ క్లోవర్‌’ (1965)లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘జెరేమియా జాన్సన్‌’, ‘ద స్టింగ్‌’, ‘ఆల్‌ ప్రెసిడెంట్స్‌ మెన్‌’ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. దర్శకుడిగా అతడి తొలిచిత్రం ‘ఆర్డినరీ పీపుల్‌’ నాలుగు ఆస్కార్‌ అవార్డులు గెలుచుకుంది. ‘బ్రుబాకెర్‌’, ‘ఔట్‌ ఆఫ్‌ అమెరికా’ సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. 2014లో ‘కెప్టెన్‌ అమెరికా: ది వింటర్‌ సోల్జర్‌’లో అలెగ్జాండర్‌ ఫీర్స్‌ పాత్రలో నటించారు. 2016 నుంచి 2019 వరకు వరుసగా ‘పేట్స్‌ డ్రాగన్‌’, ‘ది డిస్కవరీ’, ‘అవర్‌ సోల్స్‌ ఎట్‌ నైట్‌’, ‘ది ఓల్డ్‌ మ్యాన్‌ అండ్‌ ది గన్‌’, ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’లాంటి చిత్రాల్లో నటించారు.

* అభినయంతో మెప్పించి


మత్తెక్కించే అందం...ఉంగరాల జుత్తు... ఆకర్షణీయమైన ఆకృతి... వీటికి మించి అభినయం. ఇంకేంకావాలి హాలీవుడ్‌లో వెండితెరను ఏలడానికి? ఇవన్నీ ఉన్నాయి కాబట్టే షెల్లీ వింటర్స్‌ ఆరు దశాబ్దాల పాటు అందాల నటిగా అలరించడమే కాదు, రెండు ఆస్కార్‌ అవార్డులు కూడా అందుకుంది. మిస్సోరిలో 1920లో పుట్టిన ఈమె మోడల్‌గా మెరిసి, ఆపై వెండితెరపై వెలిగింది. ‘ద డైరీ ఆఫ్‌ అన్నే ఫ్రాంక్‌’ (1959), ‘ఎ ప్యాచ్‌ ఆఫ్‌ బ్లూ’, ‘ఎ ప్లేస్‌ ఇన్‌ ద సన్‌’, ‘ద పోసీడాన్‌ అడ్వెంచర్‌’, ‘ఎ డబుల్‌ లైఫ్‌’, ‘ద నైట్‌ ఆఫ్‌ ద హంటర్‌’, ‘లొలితా’ లాంటి చిత్రాల ద్వారా ప్రపంచ సినీ అభిమానులను అలరించింది. ఎన్నో అవార్డులు అందుకున్న షెల్లీ వింటర్స్‌ ఆగస్టు 8, 1920న సెయింట్‌ లూయిస్‌లోని ముస్సోరిలో జన్మించింది. 1943లో వచ్చిన ‘దేర్స్‌ సమ్‌థింగ్‌ అబౌట్‌ ఏ సోల్జర్‌’ చిత్రంతో వెండితెర అరంగ్రేటం చేసింది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన షెల్లీ జనవరి 24, 2006న బ్రేవెర్లీ హిల్స్, కాలిఫోర్నియాలో చనిపోయింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.