ఆగస్టు 26.. (సినీ చరిత్రలో ఈరోజు)

 సినిమా చరిత్రకే ఓ మలుపు...
‘పథేర్‌ పాంచాలి’!సరిగ్గా 65
సంవత్సరాల క్రితం ఇదే రోజు బెంగాలిలో ‘పథేర్‌ పాంచాలి’ విడుదలైంది. భారతీయ సినిమా చరిత్రలోనే ఓ గొప్ప సినిమాగా గుర్తింపు పొందిన అది అంతర్జాతీయంగా కూడా అనేక ప్రశంసలు అందుకుంది. ప్రఖ్యాత భారతీయ దర్శకుడిగా గుర్తింపు పొందిన సత్యజిత్‌ రే మలిచిన అద్భుత చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలన్నీ ఆశ్చర్యం కలిగించేవే.

-
చిత్ర దర్శకుడికి ఇది తొలి చిత్రం. ఎలాంటి అనుభవమూ లేదు!

- సినీమాటోగ్రాఫర్‌కి అంతకు ముందు మూవీ కెమేరా ఎలా ఉంటుందో కూడా తెలీదు!
* షూటింగ్‌ మొదటి రోజంతా కెమేరాను విప్పి చూసుకోడానికే సరిపోయింది!
- ముఖ్య నటీనటులందరూ ఊరూపేరూ లేని వారే! వాళ్లకి ఎలా నటించాలో కూడా తెలీదు!
- ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక వర్గంలోని చాలా మంది కూడా పూర్తిగా కొత్తవారే!
- తగినన్ని నిధులు లేక చిత్ర నిర్మాణం తరచు ఆగిపోతూ పూర్తవడానికి ఐదేళ్లు పట్టింది!... ఇన్ని రకాల ఆటంకాల మధ్య పూర్తయి విడుదలైన ‘పథేర్‌ పాంచాలి’...
- ప్రపంచానికి సమాంతర సినిమాను పరిచయం చేసింది!
- ఓ మేటి దర్శకుడిని సినీరంగానికి అందించింది!
- జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది!
- ప్రతిష్టాత్మక కేన్స్‌ చిత్రోత్సవంలో ‘బెస్ట్‌ హ్యూమన్‌ డాక్యుమెంట్‌’ అవార్డు పొందింది!
- అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అవార్డులు, ప్రపంచ సినీ ప్రముఖల నుంచి ఎన్నెన్నో ప్రశంసలు పొందింది!

బెంగాలీ రచయిత బిభూతిభూషణ్‌ బంధోపాధ్యాయ్‌ 1929లో రాసిన నవల ఆధారంగా అదే పేరుతో తీసిన సినిమా ‘పథేర్‌ పాంచాలి’. బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఈ సినిమాలో సుబీర్‌ బెనర్జీ, కాను బెనర్జీ, కరుణ బెనర్జీ, ఉమా దాస్‌గుప్తా, చునిబాల దేవి తదితరులు నటించారు. సినిమా కథంతా పేద కుటుంబానికి చెందిన అపు అనే పిల్లాడు, అతడి అక్క దుర్గల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకు నేపథ్య సంగీతాన్ని ప్రఖ్యాత సితార కళాకారుడు రవిశంకర్‌ సమకూర్చారు. ఈ సినిమా విజయవంతం కావడంతో సత్యజిత్‌ రే, దీనికి కొనసాగింపుగా మరో రెండు సినిమాలను నిర్మించాడు. ‘అపు ట్రయాలజీ’గా పేర్కొనే వీటిలో ‘పథేర్‌ పాంచాలి’ (1955), ‘అపరాజితో’ (1956), ‘ద వరల్డ్‌ ఆఫ్‌ అపు’ (1959) ఉన్నాయి. ఇవి మూడూ కూడా గొప్ప సినిమాలుగా అంతర్జాతీయ గుర్తింపు పొందడం విశేషం. వాస్తవికమైన చిత్రీకరణతో, మానవ సంబంధాలను అద్భుతంగా తెరకెక్కించి, సినీ చరిత్రనే ఓ మేటి మలుపు తిప్పిన సినిమాగా పేరు ప్రఖ్యాతులు పొందింది. ఈ సినిమా తరువాత సత్యజిత్‌ రే 36 సినిమాలు తీశారు. వాటిలో డాక్యుమెంటరీలు, లఘుచిత్రాలు కూడా ఉన్నాయి.

వ్యంగ్యానికి వెండితెర రూపం!
(కన్యాశుల్కం విడుదల-1955)


బుచ్చమ్మ... గిరీశం... మధురవాణి... లుబ్దావధాన్లు... కరకట శాస్త్రి... రామప్పపంతులు... ఈ పేర్లలో ఏది విన్నా గుర్తొచ్చేది ఒక్కటే... ‘కన్యాశుల్కం’! సంఘసంస్కర్త, సాహితీవైతాళికుడు గురజాడ అప్పారావు రాసిన ఈ నాటకం వేదికలపై ఆబాలగోపాలాన్ని అలరించింది. ఆ పాత్రల్ని, ఆ సంభాషణల్ని ఇంటింటికీ తరతరాలకీ గుర్తుండిపోయేలా చేసింది. ఆ నాటకానికి వెండితెర రూపమైన ‘కన్యాశుల్కం’ సినిమా 1955 ఆగస్టు 26న విడుదలైంది. ఎన్టీఆర్, సావిత్రి, సీఎస్‌ఆర్‌లాంటి దిగ్గజాలు నటించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు చూసినా ఆకట్టుకుంటుంది. పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా వెనుక ఆసక్తికరమైన సంగతులేంటి?

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

 ‘హోమ్‌ ఎలోన్‌’ కుర్రాడి కథ!


ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘హోమ్‌ ఎలోన్‌’ సినిమా గుర్తుందా? అమ్మానాన్న సహా బంధువులందరూ క్రిస్టమస్‌ సెలవులకు ప్యారిస్‌ బయల్దేరే హడావుడిలో ఇంట్లో ఓ పదేళ్ల కుర్రాడిని మర్చిపోయి విమానం ఎక్కేస్తారు. ఒంæరిగా ఇంట్లో మిగిలిపోయిన ఆ కుర్రాడు, దోపిడీకి ప్రయత్నించిన ముగ్గురు దొంగలను ఎదుర్కొని, తన తెలివితేæలతో వాళ్లకి ఎలా బుద్ధి చెప్పాడనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 476 మిలియన్‌ డాలర్లకుపైగా ఆర్జించి సంచలనం సృష్టించింది. ఇందులో నటించిన బాల నటుడే మెకాలే కుల్కిన్‌. ఆ తరువాత నటుడిగా, గాయకుడిగా ఎదిగాడు. 1980 ఆగస్టు 26న న్యూయార్క్‌లో పుట్టిన మెకాలే ఏడుగురు సంతానంలో మూడోవాడు. తల్లి టెలిఫోన్‌ ఆపరేæర్‌ అయితే, తండ్రి చర్చిలో పనిచేసేవాడు. నాలుగేళ్లకే నాæకాల్లో, టీవీల్లో వేషాలు వేశాడు. ‘హోమ్‌ ఎలోన్‌’ సిరీస్‌ చిత్రాలతో పాటు ‘మై గర్ల్‌’ (1991), ‘ద గుడ్‌ సన్‌’, ‘ద పేజ్‌మాస్టర్‌’, ‘రిచీరిచ్‌’ లాంటి సినిమాల్లో నటించాడు. ‘వందమంది మేటి బాల నటుల’ జాబితాలో ఒకడిగా నిలిచాడు. ‘జూనియర్‌’ పేరుతో ఆత్మకథను రాశాడు. రాక్‌బ్యాండ్‌ను స్థాపించి గాయకుడిగా ఎదిగాడు. ప్రఖ్యాత పాప్‌గాయకుడు మైకేల్‌ జాక్సన్‌కి మిత్రుడై ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ మ్యూజిక్‌ వీడియోలో కనిపించాడు. 2007లో వచ్చిన ‘సెక్స్‌ అండ్‌ బ్రేక్‌ఫాస్ట్‌’ జేమ్స్‌ పాత్రలో అలరించాడు. తరువాత ‘ది వ్రాంగ్‌ ఫెరారి’ (2011), ‘ఆడమ్‌ గ్రీన్స్‌ అల్దాద్దీన్‌’ (2015)లో నటించాడు. 2019లో కామెడీ నేపథ్యంగా తెరకెక్కి విడుదలైన ‘చేంజ్‌లాండ్‌’లో నటించి మెప్పించాడు.

పాటలతో... డ్యాన్స్‌లతో...
ఆరు ఆస్కార్లతో! మన సినిమాల్లో పాటలు అంతర్భాగం. హాలీవుడ్‌ సినిమాల్లో పాటలంటూ ఉండవు. కానీ పాటలతోనే కథను నడిపించే సినిమాలు మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి. వాటినే మ్యూజికల్‌ ఫిల్మ్స్‌ అంటారు. అలాంటి సినిమాల్లో పాత్రలు, పాత్రధారులు కూడా అడుగడుగునా పాటలు పాడుతూ, ఒకోసారి వాటికి డ్యాన్స్‌లు చేస్తూ భావోద్వేగాల్ని, సన్నివేశాల్ని సంగీతమయంగా చేస్తారు. అలాంటి సినిమాల్లో ఒకటి ‘ఏన్‌ అమెరికన్‌ ఇన్‌ ప్యారిస్‌’ (1951). అమెరికాలో 1928లో ఇదే పేరుతో ఓ సంగీత రూపకం బాగా ప్రాచుర్యం పొందింది. దాని స్ఫూర్తితో ఈ సినిమాను పేరున్న గాయకులు, డ్యాన్సర్లతో తీశారు. పాటలతో, ఆటలతో ప్రదర్శనలు ఇచ్చే కళాకారుల కథగా ఇది కనిపిస్తుంది. ఉపాధి కోసం అమెరికా నుంచి ప్యారిస్‌ వెళ్లిన ముగ్గురు మిత్రుల కథ ఇది. ఇందులో ఇద్దరు ఒకే అమ్మాయితో ప్రేమలో పడడం, ఆ ప్రేమను పొందడం కోసం చేసిన ప్రయత్నాల నేపథ్యంలో సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో క్లైమాక్స్‌గా ఓ పెద్ద డాన్స్‌ బ్యాలట్‌ ఉంటుంది. దీని నిడివి ఏకంగా 17 నిమిషాలు. దీన్ని తీయడానికి నెల్లాళ్లు పట్టింది. ఈ బ్యాలట్‌ చిత్రీకరణకే అప్పట్లో పది లక్షల డాలర్లు ఖర్చు చేశారు. ఈ సినిమా విపరీతంగా జనాదరణ పొందింది. ఎనిమిది ఆస్కార్‌ నామినేషన్లు పొంది, ఆరు ఆస్కార్లను అందుకుంది. ఇక ప్రశంసలు, పురస్కారాలకు లెక్కేలేదు. మేటి మ్యూజికల్‌ సినిమాల జాబితాలో స్థానం సంపాదించుకుంది. దీన్ని 2.7 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీస్తే బాక్సాఫీస్‌ వద్ద 7 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.

.......................................................................................................................................................................

హృదయాలను దోచుకున్న.. 
హంగల్‌! (వర్ధంతి - 2012)(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...) 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.