ఫిబ్రవరి 14 (సినీ చరిత్రలో ఈరోజు)

* మిరపకాయ్‌ భామ..
దీక్షాసేథ్‌ (పుట్టినరోజు)


చిత్రసీమలో రాణించాలంటే అందం... ప్రతిభే కాదు, కాసింత అదృష్టం కూడా ఉండాలంటారు. కొంతమంది ప్రయాణాన్ని పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తుంది. దీక్షాసేథ్‌ దక్షిణాది చిత్ర పరిశ్రమకి తగ్గ కథానాయిక. ఆమె అందం ఇట్టే ఆకర్షిస్తుంది. కమర్షియల్‌ కొలతలకి తగ్గట్టే ఉంటుంది. కావల్సినంత ప్రతిభ కూడా ఉందని ఆమె చేసిన పాత్రలు చాటి చెప్పాయి. ఒకట్రెండు విజయాలు కూడా లభించాయి కానీ... ఆమె నిలదొక్కుకోలేకపోయింది. ‘రెబల్‌’ తరువాత ఆమె తెలుగు చిత్రసీమవైపు తిరిగి చూడలేదు. ‘వేదం’తో తెలుగు తెరకు పరిచయమైన దీక్ష ఫెమీనా మిస్‌ ఇండియా ఫైనలిస్టుల్లో ఒకరు. గ్లామర్‌ రంగంతో ఉన్న ఆ అనుబంధమే ఆమె సినిమాల్లోకి రావడానికి కారణమైంది. తొలి చిత్రంతోనే ఆకట్టుకోవడంతో వెంటనే ఆమెని అవకాశాలు వరించాయి. ‘మిరపకాయ్‌’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్న దీక్షా... ‘వాంటెడ్‌’, ‘నిప్పు’, ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’, ‘రెబల్‌’... ఇలా వరుసగా పరాజయాల్ని మూటగట్టుకొంది. ఇక ఆ దెబ్బతో ఆమెకి కొత్తగా అవకాశాలే రాలేదు. మరోపక్క తమిళం, కన్నడలోనూ అవకాశాలు లభించినా అక్కడ కూడా పరాజయాలే. హిందీలోనూ ‘లేకర్‌ హమ్‌ దీవానా దిల్‌’, ‘సాద్‌ కదమ్‌’ అనే చిత్రాలు చేసింది కానీ.. ఫలితం మాత్రం లభించలేదు. దాంతో ఆమె 2016 నుంచి సినిమా రంగానికి దూరమైంది. దీక్షాసేత్‌ 14 ఫిబ్రవరి 1990న దిల్లీలో జన్మించింది. ఆమె తండ్రి ఉద్యోగం వల్ల ముంబై, చెన్నై, కోల్‌కతా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర్‌ ప్రదేశ్, ఖాట్మండు, నేపాల్‌ తదితర ప్రాంతాల్లో దీక్షా బాల్యం సాగింది. కాలేజీలో ఉన్నప్పుడే ఫెమీనా మిస్‌ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొని గ్లామర్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఫ్రెష్‌ ఫేస్‌ టైటిల్‌ గెలుచుకొంది. మోడలింగ్‌ అసైన్‌మెంట్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన ఆమెని దర్శకుడు క్రిష్‌ చూసి ‘వేదం’లో నటించే అవకాశాన్నిచ్చారు. ఆరంభంలో అవకాశాలు వచ్చినా అదృష్టం తోడు కాకపోవడంతో వెనుదిరిగింది. ఈ రోజు దీక్షాసేథ్‌ పుట్టినరోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అపార్థాల అల్లిక జిగిబిగి ‘మురళీకృష్ణ’(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)


* అందచందాల బాల!
మధుబాల (జయంతి-1933)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* భయంకర డ్రాక్యులా!


ప్పుడో చచ్చిపోయాడు...కానీ సమాధి నుంచి లేచాడు... మనుషుల రక్తం పీల్చుకుంటాడు... గబ్బిలంగా మారిపోయి కావలసిన చోటుకు వెళ్తాడు... అందమైన అమ్మాయిలు కనిపిస్తే కళ్లలోకి చూసి వశపరుచుకుంటాడు... ఆపై ఆమె మెడమీద తన రెండు కోరలతో కొరుకుతాడు... అంతే! ఆ అమ్మాయి రక్తం తాగే పిశాచి వాంపైర్‌గా మారిపోతుంది...
- ఇది చదవగానే ప్రపంచంలో ఎవరికైనా ‘డ్రాక్యులా’ కథలు, సినిమాలు గుర్తొస్తాయి. అంతలా ఆ పాత్ర ప్రాచుర్యం పొందింది. అలాంటి రక్తపిశాచి కథతో వచ్చిన ‘డ్రాక్యులా’ సినిమా 1931లో విడుదలై సంచలనం సృష్టించింది. ‘వంద మేటి భయంకర సినిమాల జాబితా’లో స్థానం సాధించింది. ఎన్నో సినిమాల్లో హత్యలు చేసే విలన్‌గా, పిశాచిగా, డ్రాక్యులాగా పాత్రలు పోషించి ప్రాచుర్యం పొందిన బెలా లుగోసీ ఇందులో డ్రాక్యులాగా కనిపిస్తాడు. డ్రాక్యులా పాత్రను బ్రామ్‌ స్టోకర్‌ అనే రచయిత 1897లో ఓ నవల ద్వారా సృష్టించాడు. ఆపై ఈ పాత్ర అనేక నాటకాలు, సినిమాలు, పుస్తకాలకు నాంది పలికింది. ఈ నవల ఆధారంగా 1922లోనే ఓ సినిమాను తీస్తే, బ్రామ్‌ స్టోకర్‌ భార్య కోర్టుకు వెళ్లి విజయం సాధించింది. ఫలితంగా ఆ సినిమా ప్రతులను తగులబెట్టేశారు. ఆ తరువాత ఈ పాత్ర ఆధారంగా 1923, 1925ల్లో రెండు మూకీ చిత్రాలు వచ్చాయి. హాలీవుడ్‌ సినిమాల్లో క్లాసిక్‌ హారర్‌ చిత్రంగా పేరుతెచ్చుకున్న ‘డ్రాక్యులా’ ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైంది.   

* తన కథ తనే తీసుకున్న దర్శకుడు!


సినిమా  పేరును ఒక అంకె సూచిస్తుంది. అది 8 పక్కన అర. అంటే ‘ఎయిట్‌ అండ్‌ హాఫ్‌’ (ఎనిమిదిన్నర) అన్నమాట. ఇది ఓ హాలీవుడ్‌ దర్శకుడు తన గురించి తనే తీసుకున్న సినిమా. మరి ‘ఎనిమిదిన్నర’కి అర్థం ఏమిటి? ఏంటంటే... అది ఆ దర్శకుడు అప్పటి వరకు తీసిన సినిమాల సంఖ్య. మరి ‘అర’ సినిమా ఏంటి? అది అతడు మరో దర్శకుడితో కలిసి తీసిన సినిమా. ఆ దర్శకుడు ఫెడెరికో ఫెల్లిని. ఇటాలియన్‌. ప్రపంచ సినిమాపై గొప్ప ప్రభావం చూపిన దర్శకుడిగా ప్రాచుర్యం పొందాడు. యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో అద్భుతమైన సినిమాలు తీసిన ఇతడు ఇటలీ ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’ పురస్కారంతో పాటు, కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అత్యునత అవార్డును, నాలుగు ఆస్కార్‌లను, జీవిత కాల పురస్కారాన్ని అందుకున్న ప్రతిభాశాలి. ఇలాంటి ఫెడెరికో, తన జీవిత కథను, తను అంతవరకు తీసిన సినిమాల వివరాలను కలిపి హాస్యభరితంగా, వ్యంగ్యాత్మకంగా తీసిన సినిమానే ‘ఎనిమిదిన్నర’ (1963). ఈ సినిమా ప్రపంచంలోనే గొప్ప చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకోవడంతో పాటు ఉత్తమ విదేశీ చిత్రం, కాస్ట్యూమ్స్‌ విభాగాల్లో రెండు ఆస్కార్లు సహా అనేక అవార్డులు గెల్చుకోవడం విశేషం. ఓ దర్శకుడిగా గొప్ప హిట్‌ చిత్రాన్ని ఇచ్చిన తరువాత ఎలాంటి సినిమా తీయాలో తోచక సతమతమవడం, దాన్ని అధిగమించడానికి ప్రయత్నించడం లాంటి మానసిక పరిస్థితులకు కూడా అద్దం పడుతుంది. ఇతడు తన జీవితంలో తాను ప్రేమించిన అమ్మాయిల సంగతులను కూడా పొందుపరిచాడు.
.............................................................................................................................................

* అంతర్జాతీయ గుర్తింపు


టుడు, కమేడియన్, స్క్రీన్‌ రైటర్, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన సైమన్‌ పెగ్‌ అంతర్జాతీయ సినీ ప్రేక్షకులకు చిరపరిచితుడే. ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న ‘డాక్టర్‌ హూ’, ‘స్టార్‌ ట్రెక్‌’, ‘స్టార్‌వార్స్‌: ద ఫోర్స్‌ అవేకన్స్‌’, ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’, ‘ద డార్క్‌ క్రిష్టల్‌: ఏజ్‌ ఆఫ్‌ రెసిస్టెన్స్‌’ చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలతో మెప్పించాడు. బుల్లితెర, వెండితెరలపై అలరించాడు. ఇంగ్లండ్‌లో 1970 ఫిబ్రవరి 14న పుట్టిన ఇతడు, పదహారేళ్ల వయసులోనే నాటకాల ద్వారా మంచి నటుడనిపించుకున్నాడు. టీవీ సీరియల్స్‌ ద్వారా సినిమా అవకాశాలు అందుకున్నాడు. అభినయ రంగంలో పలు అవార్డులు అందుకుని ముందుకు సాగుతున్నాడు.    
* అలరించే భయంకర సినిమా


- పెట్టుబడి 19 మిలియన్‌ డాలర్లు... వసూళ్లు 272.7 మిలియన్‌ డాలర్లు!
- ఆస్కార్‌ అవార్డుల్లో మొదటి అయిదు విభాగాలనూ గెల్చుకున్న కేవలం మూడు సినిమాల్లో ఒకటి!
- ఆస్కార్‌ సాధించిన మొదటి హారర్‌ చిత్రం!
- అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు!
- ప్రపంచంలోనే గొప్ప చిత్రాల్లో ఒకటిగా విమర్శకులు, దర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు!

ఇన్ని ఘనతలు సాధించిన సినిమా ‘ద సైలెన్స్‌ ఆఫ్‌ ద ల్యాంబ్స్‌’ (1991). సైకలాజికల్, హారర్, థ్రిలర్‌. దర్శకుడు జోనాథన్‌ డమ్మీ. గొప్ప నటిగా ఎన్నో అవార్డులు సాధించిన జోడీ ఫాస్టర్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్‌ నటులు ఆంథోనీ హాప్కిన్స్, స్కాట్‌ గ్లెన్‌ తదితరులు నటించారు. దీన్ని థామస్‌ హ్యారిస్‌ అనే రచయిత 1988లో రాసిన నవల ఆధారంగా తీశారు.

కథేంటి: ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌లో ట్రైనీగా చేరిన క్లారిస్‌ అనే అమ్మాయి, ఎనిమిదేళ్లుగా జైల్లో ఉన్న భయంకర ఖైదీని ఇంæరాగేట్‌ చేయాల్సి వస్తుంది. అతడో సీరియల్‌ కిల్లర్‌. వరసగా హత్యలు చేసి వారిని తిన్న నరమాంస భక్షకుడు. ఇంతకీ అతడినెందుకు ఇంæరాగేట్‌ చేయడం? అమెరికాలో బొద్దుగా, అందంగా ఉండే అమ్మాయిలను ఎంచుకుని వాళ్లని జలాశయాల్లో ముంచి హత్యలు చేస్తూ వాళ్ల చర్మాలను ఒలిచేస్తున్న మరో సీరియల్‌ కిల్లర్‌ను పట్టుకునే వ్యూహంలో భాగంగానే. ఇలాంటి భయంకర హత్యలు చేసే వాళ్ల సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసుకోడానికే. కథ ఇలాంటిదైనప్పుడు ఇక ఆ సినిమాలో భయంకరమైన, ఉత్కంఠభరితమైన, ఉన్మాద కరమైన సన్నివేశాలకు కొదవేం ఉంటుంది? అందుకనే ఈ సినిమా ప్రపంచ వ్యాపంగా భయాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. కాసులు, అవార్డులు కురిపించింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.