ఫిబ్రవరి 21 (సినీ చరిత్రలో ఈరోజు)...

* అందాల తార


మూ
డేళ్లకే వేదిక ఎక్కి నదరూ బెదురూ లేకుండా ప్రదర్శన ఇచ్చిన ఓ ముచ్చటైన పాప, పెద్దయ్యాక అందాల తారగా వెండితెరనేలింది. ఐదేళ్లకల్లా డ్యాన్స్‌లతో ఆకట్టుకుంటూ రష్యా, యూరప్‌ దేశాలు చుట్టేసింది. పదేళ్ల వయసులో ప్రకటనలు, మోడల్‌ రంగాల్లో పేరుతెచ్చుకుంది. పన్నెండేళ్లకల్లా పాప్‌ ఆల్బమ్‌ విడుదల చేసింది. ఆపై టీవీల్లో మెరిసి వెండితెరకు పరిచయమైంది. నటిగా, గాయనిగా, గీత రచయితగా, నిర్మాతగా, దర్శకురాలిగా బహుముఖంగా ఎదిగిన ఆ అందాల తారే జెన్నిఫర్‌ లవ్‌ హెవిట్‌. టెక్సాస్‌లో 1979 ఫిబ్రవరి 21న పుట్టిన హెవిట్, ‘ఐ నో వాట్‌ యు డిడ్‌ లాస్ట్‌ సమ్మర్‌’ (1997) సినిమాలో టీనేజి అమ్మాయిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై ‘కాన్ట్‌ హార్డ్‌లీ వెయిట్‌’, ‘హార్ట్‌ బ్రేకర్స్‌’, ‘ద టుక్సెడో’, ‘ఘోస్ట్‌ విస్పరెర్‌’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఉత్తమ నటిగా అవార్డులు అందుకుంది.
..........................................................................................................................................................

* సృజనాత్మక నిర్మాత..
నాగిరెడ్డి (వర్థంతి-2004)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ‘ఎక్స్‌మెన్‌’ అమ్మాయి...


మా
నవాతీత శక్తులుండే కొందరు చేసే సాహసాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘ఎక్స్‌మెన్‌’ వరస సినిమాలు గుర్తున్నాయా? వాటిలో కిట్టీ ప్రైడ్‌ పాత్రలో ఆకట్టుకున్న నటి ఎలెన్‌ పేజ్‌. నటిగా, నిర్మాతగా పేరు తెచ్చుకుంది. చిన్నప్పుడే టీవీ సీరియల్స్‌లో నటించిన ఈమె ‘హార్డ్‌క్యాండీ’ సినిమాతో వెండితెరపై గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డు సైతం అందుకుంది. ‘జునో’ సినిమాతో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డు లాంటి అవార్డులు అందుకుంది. ‘యాన్‌ అమెరికన్‌ క్రైమ్‌’, ‘ద ట్రేసీ ఫ్రాగ్‌మెంట్స్‌’, ‘స్మార్ట్‌ పీపుల్‌’, ‘విప్‌ ఇట్‌’, ‘సూపర్‌’, ‘ఇన్సెప్షన్‌’లాంటి సినిమాలతో మెప్పించిన ఎలెన్‌ కెనడాలో 1987 ఫిబ్రవరి 21న పుట్టింది.

* విలక్షణ నటుడు


ప్ర
పంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న ‘రాబిన్‌హుడ్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ థీవ్స్‌’, ‘డై హార్డ్‌’, ‘హ్యారీపాటర్‌’ సినిమాల్లో విలక్షణ నటనతో మెప్పించిన నటుడు అలాన్‌ రిక్‌మ్యాన్‌. ‘డై హార్డ్‌’లో జర్మన్‌ టెర్రరిస్ట్‌ పాత్రలో గుర్తుండిపోయాడు. ‘రాబిన్‌హుడ్‌...’ సినిమాలో పాత్రకు బాఫ్తా అవార్డు అందుకున్నాడు. ఇంకా ‘క్విగ్లీ డైన్‌ అండర్‌’, ‘ట్రూలీ, మ్యాడ్లీ, డీప్లీ’, ‘యాన్‌ ఆఫుల్లీ బిగ్‌ ఎడ్వంచర్‌’, ‘సెన్స్‌ అండ్‌ సెన్సిబిలిటీ’, ‘గెలాక్సీ క్వెస్ట్‌’, ‘లవ్‌ యాక్చువల్లీ’లాంటి సినిమాల ద్వారా అభిమానులను సంపాదించుకున్నాడు. ‘హ్యారీపాటర్‌’ సినిమాల్లో సెవెరస్‌ స్నేప్‌ పాత్ర ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. నాటక, టీవీ రంగాల్లో కూడా తనదైన ముద్ర వేశాడు. గోల్డెన్‌గ్లోబ్, ఎమ్మీ, స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ లాంటి అవార్డులు అందుకున్నాడు. లండన్‌లో 1946 ఫిబ్రవరి 21న పుట్టిన ఇతడు, తన 69వ ఏట క్యాన్సర్‌ కారణంగా 2016 జనవరి 14న మరణించాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.