ఫిబ్రవరి 29.. (సినీ చరిత్రలో ఈరోజు)

* కుర్రాడికి దూకుడెక్కువే


డుగుపెట్టిన ప్రతి రంగంలోనూ దూసుకుపోవడమే అతడికి తెలుసు. అందుకే ర్యాపర్‌గా, గీత రచయితగా, గాయకుడిగా, నటుడిగా, టీవీ ప్రముఖుడిగా యువత మెచ్చే సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్నాడు అతనే జా రూల్‌. సంగీతకారుడిగా అతడు విడుదల చేసిన వీడియోలు, ఆల్బమ్‌లు ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లకు పైగా అమ్ముడుపోయాయంటే అతడి ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సంగీతకారుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. వెండితెర నటుడిగా ‘టర్న్‌ ఇట్‌ అప్‌’, ‘ద ఫాస్ట్‌ అండ్‌ ద ఫ్యూరియస్‌’, ‘బ్యాక్‌ ఇన్‌ ద సిటీ’, ‘హాఫ్‌ పాస్ట్‌ డెడ్‌’, ‘ద కుకౌట్‌’, ‘అసాల్ట్‌ ఆన్‌ ప్రెసింట్‌ 13’, ‘ఐయామ్‌ ఇన్‌ లవ్‌ విత్‌ ఎ చర్చ్‌ గర్ల్‌’లాంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. న్యూయార్క్‌లో 1976 ఫిబ్రవరి 29న పుట్టిన ఇతడు, చిన్నప్పుడే సంగీతంపై మక్కువ పెంచుకున్నాడు. స్నేహితులతో కలసి సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు. ఆ సంగీతమే అతడి జీవితానికి ఊపునిచ్చి, చురుగ్గా నడిపించింది. టీవీలో కూడా ఎన్నో కార్యక్రమాలు, ప్రదర్శనల ద్వారా ఇంటింటి అభిమానులను సంపాదించుకున్నాడు.  



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.