జనవరి 14 (సినీ చరిత్రలో ఈరోజు)

* ఉన్నత వ్యక్తిత్వాల...
‘గుడిగంటలు’


‘క్రోధ లోహ మోహములే పడగలెత్తెరా... బుసలు కొట్టి గుండెల్లో విషము కక్కెరా... ధర్మజ్యోతి తల్లివోలె ఆదరించెరా... నా మనసె దివ్య మందిరముగ మారిపోయెరా...
- ఈ ఒక్క చరణం చాలు ‘గుడిగంటలు’ సినిమా కథకు బలం ఏమిటో చెప్పడానికి. అన్నీ ఉన్న ఓ ధనవంతుడు తనలోని స్వార్ధాన్ని, దుర్గుణాలను జయించి చివరకు ఓ యోగిగా మారడమే కథాంశం. ఈ కథలో ప్రతి మనిషి కథ ఉంది. మనిషి, మనీషిగా ఎలా మారాలో చెప్పే మార్గం ఉంది. అందుకే 1964 జనవరి 14న విడుదలైన ‘గుడిగంటలు’ సినిమా, విజయ ‘జేగంటలు’ మోగించింది. ఈ కథలో స్నేహమాధుర్యం ఉంది... త్రికోణాత్మక ప్రేమ కథ ఉంది... ప్రేమించిన అమ్మాయిని స్నేహితుడి కోసం వదులుకున్న ఓ యువకుడి త్యాగం ఉంది... పెళ్లాడిన భర్తనే దైవంగా భావించే ఓ యువతి మనో నిబ్బరం ఉంది... అన్నింటినీ మించి ఎన్టీఆర్‌ అద్భుత నటన ఉంది... విక్టరీ మధుసూదన రావు దర్శకత్వ ప్రతిభ ఉంది... కృష్ణకుమారి, జగ్గయ్యల పాత్రోచితమైన అభినయం ఉంది... ముళ్లపూడి వెంకట రమణ సంభాషణా చాతుర్యం ఉంది... ఘంటసాల స్వరపరిచిన చక్కని పాటలు ఉన్నాయి... మొత్తం మీద ఓ జనరంజకమైన సినిమాకు కావలసిన అన్ని అంశాలూ సమపాళ్లలో అమరాయి.

(మరిన్ని ఆసక్తికరమైన సంగతుల కోసం క్లిక్‌ చేయండి...)

* వెండితెర అందగాడు...
శోభన్‌బాబు (జయంతి)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* పౌరాణిక బ్రహ్మ
అపురూప సృష్టి! 


పురాణ గాథలను అద్భుతంగా వెండితెర మీద ఆవిష్కరించి ‘పౌరాణిక బ్రహ్మ’ బిరుదు అందుకున్న దర్శకుడు కమలాకర కామేశ్వరరావు రూపొందించిన మరో అపురూప చిత్రం ‘పాండవ వనవాసం’. ఎన్టీఆర్‌ భీముడిగా, ఎస్వీఆర్‌ దుర్యోధనుడిగా, సావిత్రి ద్రౌపదిగా, కాంతారావు కృష్ణుడిగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 1965 జనవరి 14న విడుదలై విజయం సాధించింది. ఘంటసాల స్వర పరిచిన పాటలు అత్యంత జనాదరణ పొందాయి.

(మరిన్ని ఆసక్తికర సంగతుల కోసం క్లిక్‌ చేయండి...)

* హాస్యానికి చిరునామా!
జంధ్యాల (
జయంతి)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అభినయం... విలక్షణం
రావు గోపాలరావు (జయంతి)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* చక్కని చిత్రాల రూపశిల్పి!
కె.బి.తిలక్‌ (జయంతి)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అలనాటి అపురూప నటి..
దుర్గాఖొటే (జయంతి)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ఆరు దశాబ్దాల ప్రయాణం..


ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్, బాఫ్తా, ఎమ్మీ, లెపర్డ్‌ క్లబ్‌లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్న నటిగా ఫాయే డనెవే గుర్తిండిపోతుంది. ఆకట్టుకునే అందం, పాత్రోచితమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమె, ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఇచ్చే అరుదైన ఆర్డర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పురస్కారాన్ని పొందింది. నాటకాలు, రేడియో, టీవీ, వెండితెర... ఇలా అన్ని మాధ్యమాల్లోనూ ఆమె ముద్ర ప్రస్ఫుటం. ఫ్లోరిడాలో 1941 జనవరి 14న పుట్టిన ఆమె ‘ద హ్యాపెనింగ్‌’ (1967) సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ‘బోనీ అండ్‌ క్లైడ్‌’, ‘ద థామస్‌ క్రౌన్‌ ఎఫైర్‌’, ‘ద ఎరేంజ్‌మెంట్‌’, ‘లిటిల్‌ బిగ్‌ మ్యాన్‌’, ‘ద త్రీ మస్కటీర్స్‌’, ‘చైనా టౌన్‌’, ‘ద టవరింగ్‌ ఇన్‌ఫెర్నో’, ‘ఐస్‌ ఆఫ్‌ లారా మార్స్‌’, ‘మమ్మీ డియరెస్ట్‌’, ‘ద ట్విలైట్‌ ఆప్‌ ద గాడ్స్‌’, ‘ద రూల్స్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌’, ‘ఎ మ్యాన్‌ ఆఫ్‌ ఆల్‌ సీజన్స్‌’ లాంటి చిత్రాలతో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది.   
* అభినయంతో మెప్పించి...


మత్తెక్కించే అందం...ఉంగరాల జుత్తు... ఆకర్షణీయమైన ఆకృతి... వీటికి మించి అభినయం. ఇంకేంకావాలి హాలీవుడ్‌లో వెండితెరను ఏలడానికి? ఇవన్నీ ఉన్నాయి కాబట్టే షెల్లీ వింటర్స్‌ ఆరు దశాబ్దాల పాటు అందాల నటిగా అలరించడమే కాదు, రెండు ఆస్కార్‌ అవార్డులు కూడా అందుకుంది. మిస్సోరిలో 1920లో పుట్టిన ఈమె మోడల్‌గా మెరిసి, ఆపై వెండితెరపై వెలిగింది. ‘ద డైరీ ఆఫ్‌ అన్నే ఫ్రాంక్‌’ (1959), ‘ఎ ప్యాచ్‌ ఆఫ్‌ బ్లూ’, ‘ఎ ప్లేస్‌ ఇన్‌ ద సన్‌’, ‘ద పోసీడాన్‌ అడ్వెంచర్‌’, ‘ఎ డబుల్‌ లైఫ్‌’, ‘ద నైట్‌ ఆఫ్‌ ద హంటర్‌’, ‘లొలితా’ లాంటి చిత్రాల ద్వారా ప్రపంచ సినీ అభిమానులను అలరించింది.  * గుర్తుండిపోయే దర్శకుడు


ఇరవై ఆరేళ్ల వయసులో ఎవరైనా చిత్రసీమలో తొలి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆ యువకుడు మాత్రం ఆ వయసుకల్లా ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన కేన్స్‌ చిత్రోత్సవంలో అత్యున్నతమైన ‘పామే డిఓర్‌’ పురస్కారాన్ని అందుకున్న యువ దర్శకుడిగా సంచలనం సృష్టించాడు. అతడే స్టీవెన్‌ సోడర్‌బెర్గ్‌. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ రైటర్‌గా, దర్శకుడిగా కూడా గుర్తుంచుకోదగ్గ ముద్ర వేశాడు. ఇతడి సినిమాల గురించి చెప్పాలంటే ‘సెక్స్, లైస్‌ అండ్‌ వీడియోటేప్‌’ ఒక్కటి గుర్తు చేస్తే చాలు. ఈ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు సాధించాడు. అనేక అవార్డులు కూడా అందుకున్నాడు. ‘ట్రాఫిక్‌’ చిత్రంతో ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ కైవశం చేసుకున్నాడు. ఇతడి దర్శకత్వం వహించిన ‘ఔటాఫ్‌ సైట్‌’, ‘ఎరిన్‌ బ్రొకోవిచ్‌’, ‘ఓషన్స్‌ ట్రయాలజీ’, ‘కాంటాజియాన్‌’, ‘మ్యాజిక్‌ మైక్‌’, ‘సైడ్‌ ఎఫెక్ట్స్‌’, ‘లోగన్‌ లక్కీ’, ‘అన్‌సేన్‌’ చిత్రాలు వేర్వేరు జోనర్లతో ఉండి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇతడి సినిమాలన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్‌ డాలర్లును, ఏడు ఆస్కార్‌ అవార్డులను పొందడం విశేషం. ఇతడి సినిమాల్లో విభిన్నమైన స్క్రీన్‌ప్లే, చిత్రీకరణ శైలి, ప్రయోగాత్మక సన్నివేశాలు, అనూహ్యమైన మలుపులు, ఉత్కంఠత ఎక్కువగా కనిపిస్తాయి. అమెరికాలో 1963 జనవరి 14న పుట్టిన ఇతగాడు చిన్నవయసులోనే 16 ఎమ్‌ఎమ్‌ కెమేరాతో లఘుచిత్రాలు తీశాడు. చిత్రసీమలో ఎడిటర్‌గా చేరి అంచెలంచెలుగా ఎదిగాడు.
.......................................................................................................................................

* గానంలో మేటి... అభినయంలో సాటి


అతడి అసలు పేరు జేమ్స్‌ టోడ్‌ స్మిత్‌ అని చెబితే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. అదే ‘ఎల్‌ఎల్‌ కూల్‌ జె’ అంటే మాత్రం ఇట్టే పట్టేస్తారు. మరి ఈ ముద్దు పేరు అర్థం తెలుసా? ‘లేడీస్‌ లవ్‌ కూల్‌ జేమ్స్‌’ అని! ర్యాప్‌ మ్యూజిక్‌ కళాకారుడిగా అమెరికా యువతను ఉర్రూతలూగించిన ఇతడు, వెండితెర నటుడిగా ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. గాయకుడిగా, నటుడిగా, రచయితగా కూడా పేరొందాడు. ‘ఇన్‌ టూ డీప్‌’, ‘ఎనీ గివెన్‌ సండే’, ‘డీప్‌ బ్లూ సీ’, ‘మైండ్‌ హంటర్స్‌’, ‘ఎడిసన్‌’ లాంటి ఎన్నో సినిమాలతో మంచి నటుడనిపించుకున్నాడు. గాయకుడిగా రెండు గ్రామీ అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. రేడియో, టీవీల ద్వారా కూడా ఇంటింటి అభిమానులను సంపాదించుకున్నాడు. న్యూయార్క్‌లో 1968 జనవరి 14న పుట్టిన ఇతగాడు, తొమ్మిదో ఏటనే ర్యాప్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచి అదే హుషారుతో అంచెలంచెలుగా ఎదిగాడు.
.........................................................................................................................................

* అవార్డుల నటుడు


నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన జేసన్‌ బేట్‌మన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. బుల్లితెరైనా, వెండితెరైనా తన ప్రతిభే బాసటగా సాగిపోయిన ఇతడికి గోల్డెన్‌గ్లోబ్, ఎమ్మీ, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ లాంటి ఎన్నో అవార్డులు అందివచ్చాయి. ఇతడు నటించిన ‘టీన్‌ ఊల్ఫ్‌ టూ’, ‘ద బ్రేకప్‌’, ‘జునో’, ‘హన్‌కాక్‌’, ‘అప్‌ ఇన్‌ ద ఎయిర్‌’, ‘కపుల్స్‌ రిట్రీట్‌’, ‘ఎక్స్‌ట్రాక్ట్‌’, ‘ద స్విచ్‌’, ‘హారిబుల్‌ బాసెస్‌’, ‘ద గిఫ్ట్‌’, ‘ఆఫీస్‌ క్రిస్ట్‌మస్‌ పార్టీ’, ‘జూటోపియా’, ‘గేమ్‌ నైట్‌’ లాంటి ఎన్నో సినిమాలు అంతర్జాతీయంగా ఆకట్టుకున్నాయి. అమెరికాలో 1969 జనవరి 14న పుట్టిన ఇతడి తండ్రి కెంట్‌ బేట్‌మన్‌ కూడా నటుడు, దర్శకుడు, రచయిత కూడా. తండ్రి దారిలో నటుడైన ఇతడు ఆ తర్వాత తనదైన ముద్రతో ముందుకు సాగుతున్నాడు.
.............................................................................................................................................

విలక్షణ నటుడు


ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న ‘రాబిన్‌హుడ్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ థీవ్స్‌’, ‘డై హార్డ్‌’, ‘హ్యారీపాటర్‌’ సినిమాల్లో విలక్షణ నటనతో మెప్పించిన నటుడు అలాన్‌ రిక్‌మ్యాన్‌. ‘డై హార్డ్‌’లో జర్మన్‌ టెర్రరిస్ట్‌ పాత్రలో గుర్తుండిపోయాడు. ‘రాబిన్‌హుడ్‌...’ సినిమాలో పాత్రకు బాఫ్తా అవార్డు అందుకున్నాడు. ఇంకా ‘క్విగ్లీ డైన్‌ అండర్‌’, ‘ట్రూలీ, మ్యాడ్లీ, డీప్లీ’, ‘యాన్‌ ఆఫుల్లీ బిగ్‌ ఎడ్వంచర్‌’, ‘సెన్స్‌ అండ్‌ సెన్సిబిలిటీ’, ‘గెలాక్సీ క్వెస్ట్‌’, ‘లవ్‌ యాక్చువల్లీ’లాంటి సినిమాల ద్వారా అభిమానులను సంపాదించుకున్నాడు. ‘హ్యారీపాటర్‌’ సినిమాల్లో సెవెరస్‌ స్నేప్‌ పాత్ర ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. నాటక, టీవీ రంగాల్లో కూడా తనదైన ముద్ర వేశాడు. గోల్డెన్‌గ్లోబ్, ఎమ్మీ, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ లాంటి అవార్డులు అందుకున్నాడు. లండన్‌లో 1946 ఫిబ్రవరి 21న పుట్టిన ఇతడు, తన 69వ ఏట క్యాన్సర్‌ కారణంగా 2016 జనవరి 14న మరణించాడు.
..................................................................................................................................................

* అమెరికా సంస్కృతికి అతడో గుర్తు


హాలీవుడ్‌లో క్లాసిక్‌ సినిమాలు వచ్చిన కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచర్యుం పొంది, ‘అమెరికన్‌ కల్చరల్‌ ఐకాన్‌’గా గుర్తింపు సాధించిన నటుడు హంఫ్రీ బొగార్ట్‌. అమెరికన్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌ అతడిని ‘గ్రేటెస్ట్‌ మేల్‌ స్టార్‌ ఆఫ్‌ క్లాసిక్‌ అమెరికన్‌ సినిమా’గా ఎంపిక చేసి గౌరవించింది. ‘అప్‌ ద రివర్‌’, ‘ద పెర్టిఫైడ్‌ ఫారెస్ట్‌’, ‘హై సియరా’, ‘ద మాల్టీజ్‌ ఫాల్కన్‌’, ‘ద బిగ్‌ స్లీప్‌’, ‘కసబ్లాంకా’, ‘టు హేవ్‌ అండ్‌ హేవ్‌ నాట్‌’, ‘డార్క్‌ ప్యాసేజ్‌’, ‘కీ లార్గో’, ‘ద ట్రెజర్‌ ఆఫ్‌ ద సియరా మాడ్రే’, ‘ఇన్‌ ఎ లోన్లీ ప్లేస్‌’, ‘ద బేర్‌ఫుట్‌ కాంటెస్సా’లాంటి ఎన్నో సినిమాల్లో అతడి అభినయాన్ని అభిమానులు మర్చిపోలేరు. ‘ద ఆఫ్రికన్‌ క్వీన్‌’ సినిమాతో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నాడు. అమెరికాలో 1899 డిసెంబర్‌ 25న పుట్టిన ఇతడు నాటకాల ద్వారా సినిమాల్లోకి వచ్చాడు. తక్కువ సమయంలోనే గొప్ప పేరు సంపాదించిన ఇతగాడు, విపరీతమైన సిగరెట్, మందు అలవాట్ల వల్ల క్యాన్సర్‌కి గురై 1957, జనవరి 14న తన 57 ఏళ్ల వయసులోనే అకాల మరణానికి గురవడం విషాదం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.