జులై 12.. (సినీ చరిత్రలో ఈరోజు)

* కరడుకట్టిన క్రూరత్వానికి నిలువెత్తు నిదర్శనం!

(బాలీవుడ్‌ నటుడు ప్రాణ్‌ వర్థంతి)

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి)

* దేవదాసుగా షారుఖ్‌... పార్వతిగా ఐశ్వర్యరాయ్‌

(దేవదాస్‌ హిందీ చిత్రం విడుదల)(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* అసాధ్యుడు ఆ గూఢచారి!


ఎథాన్‌ హంట్‌... ఎవరో తెలుసా? తెలిస్తే... ఆ పాత్రలో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూయిజ్‌ అదరగొట్టాడని చెప్పక్కర్లేదు. ఆ పాత్ర ప్రధానంగా వచ్చిన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సినిమాలు ఆరు వచ్చాయని చెప్పక్కర్లేదు. ఆ పేరుతో టీవీ సీరియల్స్‌ కూడా వచ్చి ఆకట్టుకున్నాయని కూడా చెప్పక్కర్లేదు. అంతలా ఆ పాత్ర, ఆ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్నాయి. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సినిమాలు వెండితెరపై సందడి చేయడం 1996లో మొదలైంది. ఆ తర్వాత 2000, 2006, 2011, 2015, 2018ల్లో సీక్వెల్స్‌ వచ్చాయి. ఈ ఆరు సినిమాలను మొత్తం 828 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తెరకెక్కిస్తే, అవన్నీ కలిసి 3.57 బిలియన్‌ డాలర్లను వసూలు చేసి సంచలనం సృష్టించాయి. వీటి హడావుడి ఇంకా అయిపోలేదు. ఈ సినిమాల్లో ఏడోది, ఎనిమిదోది 2021, 2022ల్లో విడుదల అవుతాయని ముందే ప్రకటించేశారు కూడా. గూఢచారి సినిమాల్లో కనిపించే నేరాలు, వ్యూహాలు, ఎత్తులు పైఎత్తులు, ఛేజింగ్‌లు, పోరాటాలు, తుపాకీ మోతలు... లాంటి హడావుడంతా ఈ సినిమాల్లో కనిపిస్తుంది. ఈ సినిమాల పరంపరలో ఆరోదైన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: ఫాలౌట్‌’ 2018లో ఇదే రోజు విడుదలైంది. అత్యంత కీలకమైన ప్టుటోనియం గనులను అక్రమంగా తవ్వుతున్న దుండగులపై గూఢచారి ఎథాన్‌ హంట్‌ పోరాటమే ఈ సినిమా. దీన్ని 178 మిలియన్‌ డాలర్లతో తీస్తే, 791.1 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. ఇది టామ్‌ క్రూయిజ్‌ సినిమాల్లో అత్యధికంగా వసూలు చేసిన సినిమాగా నిలవడంతోబాటు, ఈ సిరీస్‌లోనే అత్యుత్తమంగా తీసినదిగా పేరు పొందింది.

* నటనలో మేటి... నాట్యంలో సరిసాటి!


యాక్టర్‌... సింగర్‌... డ్యాన్సర్‌... కొరియోగ్రాఫర్‌... టీవీ ప్రెజెంటేటర్‌... ఇలా బహుముఖమైన నైపుణ్యాలు ఉండడం వేరు. ఆ కళలలో మేటిగా ఏకంగా 76 ఏళ్ల పాటు ఉత్తముడిగా పేరు పొందడం వేరు. అలా చెప్పుకోగలిగిన హాలీవుడ్‌ నటుడే ‘ఫ్రెడ్‌ యాస్టైర్‌’. హాలీవుడ్‌లో ‘100 ఏళ్లలో 100 స్టార్స్‌’ పేరిట అమెరికా ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ఓ సర్వే చేసి జావితా రూపొందిస్తే, అందులో ఐదవవాడిగా నిలిచాడు ఇతడు. సినిమాల్లో నృత్యాల చరిత్ర అనేది అతడితోనే మొదలైందని చెబుతారు. ప్రపంచాన్ని తమ నృత్యాలతో ఆకట్టుకున్న మైకేల్‌ జాక్సన్, మాధురీ దీక్షిత్, గ్రెగరీ హైన్స్‌ లాంటి ఎందరో కళాకారులు తమకు స్ఫూరినిచ్చింది యాస్టైర్‌ అని చెప్పడం విశేషం.


* చలనచిత్ర మౌనముని.. బిమల్‌రాయ్‌ (జయంతి)


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.