జులై 19 (సినీ చరిత్రలో ఈరోజు)

 నవ్వుల రాజేంద్రుడు..


హాస్యానికి హీరోయిజాన్ని తెచ్చిపెట్టిన నటుడు రాజేంద్రప్రసాద్‌. హాస్య నటులు, క్యారెక్టర్‌ నటులు మాత్రమే హాస్యం పండిస్తున్న రోజుల్లో... హీరో కూడా నవ్వించగలడని, రెండు గంటలపాటు నవ్వులతోనే సినిమాని నడిపించొచ్చని నిరూపిస్తూ తన నట ప్రయాణం కొనసాగించారు. ఒకప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు సైతం ‘తాను పనితో ఒత్తిడికి గురైనప్పుడు రాజేంద్రప్రసాద్‌ సినిమాలు చూసి ఉపశమనం పొందుతుంటాన’ని చెప్పేవారు. సామాన్యుడి దగ్గర్నుంచి, ప్రధానమంత్రి వరకు తనదైన హాస్యంతో కడుపుబ్బా నవ్వించిన ఘనత రాజేంద్రప్రసాద్‌ది. హాస్యకిరీటిగా ప్రేక్షకుల మనన్ననలు పొందుతున్న రాజేంద్రప్రసాద్‌ నిమ్మకూరులో ఎన్టీఆర్‌ ఇంటి ఆవరణంలోనే పెరిగారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, ఆయన సలహాతోనే చెన్నైలోని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. నటుడిగా ఒక ప్రత్యేకమైన శైలి ఉంటేనే రాణిస్తావన్న ఎన్టీఆర్‌ సూచనతోనే, హాస్యంవైపు దృష్టిపెట్టారు రాజేంద్రప్రసాద్‌. బాపు దర్శకత్వంలో ‘స్నేహం’తో కథానాయకుడిగా పరిచయమైన ఆయన ఆ తరువాత ‘ఛాయ’, ‘నిజం’, ‘ఆడది గడప దాటితే’, ‘మూడు ముళ్ల బంధం’, ‘దారి తప్పిన మనిషి’, ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘మంచుపల్లకి’, ‘కలవారి సంసారం’, ‘ముందడుగు’, ‘పెళ్ళిచూపులు’, ‘రామరాజ్యంలో భీమరాజు’ తదితర చిత్రాలతో దూసుకెళ్లారు. వంశీ దర్శకత్వం వహించిన ‘లేడీస్‌ టైలర్‌’ నుంచి ఆయన ప్రయాణం మరో మలుపు తిరిగింది. ‘రెండు రెళ్లు ఆరు’, ‘సంసారం ఒక చదరంగం’, ‘ప్రేమించి చూడు’, ‘ఏప్రిల్‌ ఒకటి విడుదల’, ‘చెవిలో పువ్వు’, ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’, ‘ప్రేమ తపస్సు’, ‘పెళ్లిపుస్తకం’, ‘అప్పుల అప్పారావు’, ‘ఎర్రమందారం’, ‘పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి ప్రేమలేఖ’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘కన్నయ్య కిట్టయ్య’, ‘అలీబాబా అరడజను దొంగలు’, ‘అక్క పెత్తనం చెల్లెలి కాపురం’, ‘మాయలోడు’, ‘మిస్టర్‌ పెళ్లాం’, ‘పేకాట పాపారావు’, ‘మేడమ్‌’, ‘అల్లరోడు’, ‘పరుగో పరుగు’ ఇలా జైత్రయాత్ర కొనసాగించారు. ‘క్విక్‌గన్‌ మురుగన్‌’ అనే చిత్రంతో హాలీవుడ్‌లోకీ అడుగుపెట్టారు. ఇటీవల కాలంలో తన వయసుకు తగ్గ పాత్రల్ని ఎంపిక చేసుకొంటూ, క్యారెక్టర్‌ నటుడిగా సినిమాలపై తనదైన ప్రభావం చూపిస్తున్నారు. ఒకపక్క ‘మీ శ్రేయోభిలాషి’, ‘ఆ నలుగురు’, ‘ఓనమాలు’ వంటి చిత్రాలు చేస్తూనే, క్యారెక్టర్‌ నటుడిగా ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 42 యేళ్ల సుదీర్ఘ నట ప్రయాణంలో ఆయన 200కిపైగా సినిమాలు చేశారు. ‘ఎర్రమందారం’, ‘ఆ నలుగురు’ చిత్రాలకిగానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకొన్నారాయన. ‘మేడమ్‌’లో నటనకి నంది స్పెషల్‌ జ్యూరీ పురస్కారం అందుకొన్నారు. ‘మేడమ్‌’ అనే చిత్రంలో నటిస్తూనే, నిర్మాణం కూడా చేశారు రాజేంద్రప్రసాద్‌. ‘టోపీరాజా స్వీటీ రోజా’తో సంగీత దర్శకుడిగా మారారు, అందులో పాట కూడా పాడారు. ‘టామీ’లో నటనకిగానూ ఉత్తమ క్యారెక్టర్‌ నటుడిగా నంది అందుకొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ని అందుకొన్న ఆయన, 2015లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడిగా ఎన్నికై, పలు సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకొన్నారు. 1956 జులై 19న జన్మించిన రాజేంద్రప్రసాద్‌కి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ రోజు రాజేంద్రప్రసాద్‌ పుట్టినరోజు.

 మాటయినా... పాటయినా... ఆయనే సాటి!

(సముద్రాల రాఘవాచార్య జయంతి-1902)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

 పిల్లి, ఎలుకల నవ్వుల చెణుకులు!కొంటె ఎలుక... ఓ తుంæరి పిల్లి... ఇవి రెండూ కలిసి ప్రపంచవ్యాప్తంగా పండించిన వినోదం అంతా ఇంతా కాదు. తరతరాలుగా పిల్లలు, పెద్దలు వీటిని చూసి మురిసిపోతూనే ఉన్నారు. కేరింతలు కొడుతూనే ఉన్నారు. ఆ కొంటె ఎలుక జెర్రీ అయితే, ఆ తుంæరి పిల్లి టామ్‌. ఇవి రెండూ బుల్లితెరపై సందడి చేసి, ఆ తరువాత వెండితెరపై కూడా వినోదాల వెలుగులు వెదజల్లాయి. ఈ టామ్, జెర్రీలు ఇవే పేర్లతో తొలిసారి సందడి చేసిన బొమ్మల సినిమా ఏంటో తెలుసా? ‘ద మిడ్‌నైట్‌ స్నాక్‌’. ఈ యానిమేషన్‌ లఘుచిత్రం 1941లో జులై 19న విడుదలైంది. అంతక్రితమే ఈ పిల్లీ, ఎలుకలు ఓ చిత్రంలో కనిపించినా అందులో వాటి పేర్లు వేరు. పిల్లి పేరు జాస్పర్, ఎలుక పేరు జింక్స్‌. టామ్, జెర్రీలను సృష్టించిన వ్యక్తులుగా విలియం హన్నా, జోసెఫ్‌ బార్బారా ప్రపంచ ప్రఖ్యాతులయ్యారు. వీరిద్దరూ కలిసి 1940 నుంచి 1958 వరకు 114 ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ చిత్రాలను రూపొందించారు. ఏడు ఆస్కార్‌ అవార్డులు సాధించారు. కార్టూన్‌ పాత్రల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఘనత టామ్, జెర్రీలదే. వీటితో తొలిసారి ఓ ఫీచర్‌ ఫిల్‌À్మగా ‘టామ్‌ అండ్‌ జెర్రీ: ద మూవీ’ 1992లో వచ్చింది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.