జులై 22.. (సినీ చరిత్రలో ఈరోజు)

* ‘కవితా’ పయోనిధి...
దాశరథి! (జయంతి- 1922)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* వేదాంత గాన కోవిదుడు!
ముఖేష్‌చంద్ర మాథుర్‌ (జయంతి- 1923)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ఉత్తమ చెత్త చిత్రం!


హా
లీవుడ్‌లో ఎన్నో గొప్ప చిత్రాలు తెరకెక్కి ఉండవచ్చు. కానీ ఒక చిత్రం సాధించిన ఘనతను మాత్రం ఎప్పటికీ అందుకోలేవు. అదేంటో తెలుసా? ‘ఇంతటి చెత్త చిత్రం ఇప్పటి వరకూ నిర్మితమవలేదు’ అనే పేరే! మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంతటి చెత్త చిత్రానికీ రెండు అవార్డులు కూడా ప్రకటించారు. అవేంటో తెలుసా? ‘ఉత్తమ చెత్త సినిమా’ అవార్డు ఒకటైతే, ‘ఉత్తమ చెత్త దర్శకుడు’ అవార్డు మరొకటి. అంతటి ఘనత సాధించిన ఆ సినిమా ‘ప్లాన్‌ 9 ఫ్రమ్‌ ఔటర్‌ స్పేస్‌’ అయితే, దానికి రచయిత, దర్శకుడు, నిర్మాత ‘ఎడ్‌ వుడ్‌’ అనే ఘనుడు. 1959లో జులై 22న విడుదలైన ఈ సినిమా కథ కూడా చిత్రాతిచిత్రమే. ఓ ముసిలావిడ చనిపోతే సమాధి చేస్తారు. కానీ ఆ రాత్రి ఎవరో ఆ సమాధిని తవ్వేసి శవాన్ని మాయం చేస్తారు. మర్నాడు ఆ ముసిలాడు కూడా చనిపోతే బంధువులందరూ సమాధి చేస్తారు. ఆ రాత్రి ఆ ముసిలాడి సమాధిని కూడా తవ్వేసి శవాన్ని ఎవరో మాయం చేస్తారు. ఇలా చాలా మంది చనిపోయిన వాళ్లు సమాధుల నుంచి మాయమైపోతుంటారు. ఇంతకీ ఎవరిలా చేస్తున్నారు? భూమ్మీద మనుషులు ఓ భయంకరమైన బాంబును తయారు చేస్తున్నారని తెలుసుకున్న గ్రహాంతర వాసులు, ఆ బాంబు వల్ల మొత్తం విశ్వానికే ప్రమాదం ఉందని భావించి ఏర్పాటు చేసుకున్న ‘ప్లాన్‌ 9’లో భాగమే ఇదంతా. ఇలా చేస్తే మనుషులు భయపడి దారికి వస్తారని, లేకపోతే వారితో యుద్ధం చేసి మొత్తం మానవజాతినే చంపేయాలని ఆ గ్రహాంతర వాసుల ఉద్దేశం. చనిపోయిన మనుషులనే వాళ్లు తమ సైన్యంగా తయారు చేసుకుంటారు. ఈ పరిస్థితులను మనుషులు ఎలా ఎదుర్కొన్నారనేదే కథ. సినిమాకు సరైన బడ్జెట్‌ లేకపోవడం, నటీనటులు బఫూన్లలాగా ఆషామాషీగా నటించడం, డైలాగులు సరిగా లేకపోవడం లాంటి అనేక కారణాల వల్ల ఈ సినిమా తప్పుల తడకగా, హాస్యాస్పదంగా రూపొందింది. దాంతో కొందరు విమర్శకులు దీనికి ఉత్తమ చెత్త అవార్డులు ప్రకటించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.