జులై 24.. (సినీ చరిత్రలో ఈరోజు)

సినీ ఆలయాన వెలసిన ‘దేవత’!


కు
టుంబంలో మహిళ పాత్ర ఎంత ఉన్నతమైనదో తెలియజేసిన సినిమా ‘దేవత’. హాస్య నటుడు పద్మనాభం నిర్మాతగా తీసిన ఈ తొలిచిత్రం అఖండ విజయం సాధించింది. ఎన్టీఆర్, సావిత్రి, నాగయ్య తదితర నటీనటులతో వచ్చిన ఇది, 1965 జులై 24న విడుదలై ఆరు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఇందులో ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి...’ పాట, ‘బొమ్మను చేసి ప్రాణం పోసి...’ పాట అత్యంత ప్రజాదరణ పొందాయి. కె. హేమాంబరధరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మహిళల ప్రేక్షకాదరణ పొందింది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

మాస్‌ దర్శకుడు బి.గోపాల్‌


వా
ణిజ్య పరంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో బి.గోపాల్‌ ఒకరు. ‘బొబ్బిలిరాజా’, ‘లారీ డ్రైవర్‌’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘చినరాయుడు’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’, ‘సమరసింహారెడ్డి, ‘నరసింహానాయుడు’, ‘ఇంద్ర’... ఇలా బాక్సాఫీసుని కళకళలాడించిన చిత్రాలెన్నో ఆయన్నుంచి వచ్చాయి. ఒకప్పుడు బి.గోపాల్‌ నుంచి సినిమా వస్తుందనగానే, రికార్డుల గురించి మాట్లాడుకోవడం మొదలయ్యేది. ఎక్కువగా అగ్ర కథానాయకులతో సినిమాలు తెరకెక్కించిన బి.గోపాల్‌... వాళ్లని మాస్‌ కోణంలో ఆవిష్కరించడంలోనూ, అభిమానుల్ని మెప్పించడంలోనూ తనకంటూ ఒక మార్క్‌ ఉందని నిరూపించారు. బి.గోపాల్‌ అసలు పేరు బెజవాడ గోపాల్‌. ప్రకాశం జిల్లా, టంగుటూరు దగ్గర ఎమ్‌.నిడమర్రు గ్రామంలో వెంకటేశ్వర్లు, మహాలక్ష్మి దంపతులకి జన్మించిన బి.గోపాల్‌ కారుమంచిలో విద్యాభ్యాసం చేశారు. ఒంగోలులోని సి.ఎస్‌.ఆర్‌శర్మ కాలేజీలోనూ చదువుకొన్నారు. తండ్రి అంగీకారంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన పి.సి.రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా చేరారు. అక్కడ రెండు చిత్రాలు చేసిన అనంతరం ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దగ్గర ‘అడవిరాముడు’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. 12 యేళ్లపాటు ఆయన దగ్గరే ‘దేవత’, ‘జస్టిస్‌ చౌదరి’, ‘అగ్ని పోరాటం’ తదితర చిత్రాలకి పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు దృష్టిలో పడిన బి.గోపాల్‌ ఆయన సంస్థలో, ‘ప్రతిధ్వని’ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని సొంతం చేసుకొన్నారు. ఆ తర్వాత రామానాయుడు సంస్థలోనే ‘ఇన్సాఫ్‌ కి ఆవాజ్‌’ అనే చిత్రాన్ని హిందీలో తెరకెక్కించారు. 1987లో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున ప్రధాన పాత్రధారులుగా ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. ‘రక్తతిలకం’, ‘విజయ్‌’, ‘స్టేట్‌రౌడీ’, ‘లారీడ్రైవర్‌’, ‘బొబ్బిలిరాజా’, ‘చినరాయుడు’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’, ‘మెకానిక్‌ అల్లుడు’, ‘కలెక్టర్‌ గారు’, ‘అడవిలో అన్న’... ఇలా వరుసగా చిత్రాలు తెరకెక్కించారు. మహేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కించిన ‘వంశీ’, ఎన్టీఆర్‌తో తీసిన ‘అల్లరి రాముడు’, ‘నరసింహుడు’, బాలకృష్ణతో తీసిన ‘పల్నాటి బ్రహ్మనాయుడు’, ప్రభాస్‌తో తీసిన ‘అడవిరాముడు’ చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. ఆ ప్రభావం బి.గోపాల్‌ కెరీర్‌పై పడింది. 1989లో హిందీలో సంజయ్‌ దత్‌ కథానాయకుడిగా ‘కనూన్‌ అప్నా అప్నా’ అనే చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు బి.గోపాల్‌. ‘ప్రతిధ్వని’ చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు. చాలాసార్లు చిత్రసీమకు విజయాలు అందించిన బి.గోపాల్‌ పుట్టినరోజు ఈ రోజు.

మాభూమి’ దర్శకుడు...
గౌతమ్‌ ఘోష్‌ (పుట్టినరోజు)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

యుద్ధంతో అవార్డులు...


యు
ద్ధం నేపథ్యంలో సినిమా తీయడమే కష్టం. ఆ సినిమాతో ప్రతిష్ఠాత్మక అవార్డులు కొల్లగొట్టడం మరీ కష్టం. ఈ రెండు కష్టాల్నీ సునాయాసంగా సాధించింది ‘సేవింగ్‌ ప్రైవేట్‌ ర్యాన్‌’ సినిమా. ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దర్శకత్వంలో టామ్‌హ్యాంక్స్, మట్‌ డామన్‌ నటించిన ఈ సినిమా 11 ఆస్కార్‌ నామినేషన్లు సాధించి 5 ఆస్కార్‌లను ఎగరేసుకుపోయింది. స్పీల్‌బర్గ్‌కు దర్శకుడిగా రెండో ఆస్కార్‌ను అందించింది. అయితే ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ ఇవ్వకపోవడంపై విపరీతమైన నిరసన వ్యక్తమైంది. అలాగే గోల్డెన్‌గ్లోబ్, బాఫ్తా, గ్రామీ, గోల్డెన్‌ లారెల్, శాటర్న్‌ లాంటి అవార్డులెన్నో దీన్ని వరించాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా సైనికులు ఫ్రాన్స్‌లోని నార్మండీ ప్రాంతంపై చేసిన దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యుద్ధ దృశ్యాల చిత్రీకరణ అద్భుతంగా ఉందనే ప్రశంసలు లభించాయి. సినిమాలో తొలి 27 నిమిషాలను చాలా గొప్పగా చిత్రీకరించారని చెబుతారు.

ఇల్లు వదిలి వెళ్లి...
తారాపథానికి...!


దిహేడేళ్ల వయసులో ఓ అమ్మాయి, సినిమాల్లో నటిస్తానంది. అమ్మానాన్నా ‘ఠాఠ్‌... వీల్లేదు’ అన్నారు. దాంతో ఆ అమ్మాయి ఇల్లు వదిలి ఒంటరి ప్రయాణానికి సిద్ధపడింది... కట్‌ చేస్తే... ఆమె అంచెలంచెలుగా గాయనిగా, నర్తకిగా, నటిగా, నిర్మాతగా ఎదిగి, అనుకున్నది సాధించింది. ఆ సాహసికరాలు ఎవరో తెలుసా? జెన్నిఫర్‌ లోపెజ్‌. అభిమానుల ముద్దుగా ‘జేలో’ అని పిలిచుకునే ఆమె ‘మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఉమన్‌ ఇన్‌ ద వరల్డ్‌’ అనే గుర్తింపు పొందింది. ‘అనకొండ’ (1997), ‘ఔట్‌ ఆఫ్‌ సైట్‌’ (1998) చిత్రాలతో హాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం పొందిన లాటిన్‌ యువతిగా పేరు పొందింది. లాటిన్‌ తల్లిదండ్రులకు న్యూయార్క్‌లో (July 24, 1969) పుట్టిన జెన్నిఫర్, ఐదేళ్ల వయసులోనే ఇద్దరు సోదరిలతో కలిసి సంగీతం, నృత్యం నేర్చుకుని వేదికలపై చిన్న చిన్న ప్రదర్శనలు ఇచ్చేది. జిమ్నాస్టిక్స్, సాఫ్ట్‌బాల్‌ క్రీడల్లో జాతీయ స్థాయికి చేరిన జెన్నీ, ‘మై లిటిల్‌ గర్ల్‌’ (1986) సినిమాలో చిన్న వేషం కోసం ఆడిషన్స్‌కు వెళ్లి తెరపై కనిపించింది. అప్పుడే పెద్ద తారనవ్వాలని కలలు కంది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇల్లు వదిలి మ్యూజిక్‌ ప్రదర్శనలతో ముందడుగు వేసింది. టీవీల్లో కనిపించింది. 1997లో సెలెనా బయోపిక్‌లో వేషంతో వెండితెర ముచ్చట తీర్చుకుంది. ఓ పక్క పాప్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌లు చేస్తూ, మరో పక్క సినిమాల్లో నటిస్తూ ఎదిగింది.

బెంగాలీ బాబు ..
ఉత్తమ్ కుమార్ (వర్ధంతి)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.