జులై 25.. (సినీ చరిత్రలో ఈరోజు)

నవరస నటనా సార్వభౌముడు!

(కైకాల సత్యనారాయణ పుట్టినరోజు-1935)

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ‘బాణం’లా దూసుకొచ్చి...

(నారా రోహిత్‌ పుట్టిన రోజు)


కథల విషయంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిరుచి ఉందని చాటి చెప్పారు నారా రోహిత్‌. ‘బాణం’తో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన రోహిత్, ఆ తర్వాత తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. తన కుటుంబానికి సినీ, రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ... ఆ ప్రభావం, ప్రమేయం లేకుండా తనకి నచ్చిన కథల్ని ఎంచుకొంటూ, పరిమిత వ్యయంతో కూడిన చిత్రాల్ని చేస్తూ ముందుకు సాగుతున్నారు. ‘సోలో’, ‘ప్రతిధ్వని’, ‘రౌడీ ఫెలో’, ‘అసుర’, ‘జ్యో అచ్యుతానంద’ తదితర విజయాలు ఆయన కెరీర్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు తనయుడైన నారా రోహిత్‌ పాఠశాల విద్యని హైదరాబాద్‌లో, వడ్లమూడి విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఇంటర్మీడియట్, చెన్నై అన్నా యూనివర్సిటీ నుంచి బీటెక్‌ పట్టా అందుకొన్నారు. ఆ తర్వాత న్యూ యార్క్‌ ఫిల్మ్‌ అకాడెమీలో నటనకి సంబంధించిన కోర్సు చేశారు. 2009లో విడుదలైన ‘బాణం’ విమర్శకుల మెప్పు పొందింది. నటుడిగా రోహిత్‌ ప్రతిభేంటో ఆ చిత్రంతో తెలిసింది. దాంతో ఆయనకి వరుసగా అవకాశాలొచ్చాయి. వేగంగా సినిమాలు చేయడంలో రోహిత్‌ దిట్ట. 2016, 2017లో ‘తుంటరి’, ‘సావిత్రి’, ‘రాజా చెయ్యి వేస్తే’, ‘జ్యో అచ్యుతానంద’, ‘శంకర’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘శమంతకమణి’, ‘కథలో రాజకుమారి’, ‘బాలకృష్ణుడు చిత్రాలు చేశారు రోహిత్‌. త్వరలోనే ‘వీరభోగ వసంతరాయలు’, ‘ఆటగాళ్లు’ చిత్రాల్లో నటించి సందడి చేశారు. ‘పండగలా వచ్చాడు’ విడుదల కావల్సి ఉంది. ‘బాణం’లో సన్నగా కనిపించిన రోహిత్, ఆ తర్వాత కాస్త బొద్దుగా మారారు. ‘బాలకృష్ణుడు’ చిత్రంతో నాజూగ్గా మారారు. ఆరన్‌ మీడియా వర్క్స్‌ సంస్థని స్థాపించిన నారా రోహిత్‌ నిర్మాణంలోనూ పాలు పంచుకొంటున్నారు. ఈ రోజు నారా రోహిత్‌ పుట్టినరోజు.

* ఆటలో... నటనలో... యుద్ధంలో...


ఆట వేరు... నటన వేరు... యుద్ధం వేరు. ఈ మూడింటిలోనూ మంచి పేరు తెచ్చుకునే వారు మాత్రం చాలా అరుదు. అలాంటి అరుదైన వాడే ఆరడుగుల మూడంగుళాల ‘ఉడీ స్టోడ్ర్‌’. క్రీడాకారుడిగా రికార్డులు, నటుడిగా అవార్డులు పొందిన ఇతగాడు అమెరికా డెకథ్లెట్‌ (పది అథ్లెటిక్‌ ఈవెంట్స్‌లో మేటి)గా, ఫుట్‌బాల్‌ స్టార్‌గా రాణించాడు. నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లో పాల్గొన్నాడు. రెజ్లర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. క్రీడా జీవితం తర్వాత వెండితెర నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకున్నాడు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా తరఫున పాల్గొన్నాడు కూడా. సినిమా విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన ‘స్పార్ట్‌కస్‌’ (1960)లో ఇతడి నటన మరువలేనిదే. అలాగే ‘టెన్‌ కమాండ్‌మెంట్స్‌’ చిత్రంలో ఇథియోపియా రాజుగా, బానిసగా రెండు పాత్రలు ధరించాడు. ‘టార్జాన్‌’ సినిమాల్లో విలన్‌గా మెప్పించాడు. 1914 జులై 25న పుట్టిన ‘ద క్విక్‌ అండ్‌ ద డెడ్‌’ (1995) వరకు ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్‌ నటుడిగా మెప్పించాడు. చివరి చిత్రం విడుదలకు ముందే 1994లో మరణించాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.