జులై 30.. (సినీ చరిత్రలో ఈరోజు)

బొమ్మాళీ నిన్నొదలా..
సోనూ సూద్‌! (పుట్టినరోజు)


ప్ర
తినాయకుడిగా ఎన్ని సినిమాలు చేసినా... తెలుగు ప్రేక్షకులకు మాత్రం పశుపతిగానే గుర్తుకొస్తుంటాడు సోనూసూద్‌. ‘అరుంధతి’లో బొమ్మాళీ నిన్నొదలా... అంటూ ఆయన చేసిన హంగామా అలాంటిది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ, కన్నడ, పంజాబీ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు సోనూ. ‘సిటీ ఆఫ్‌ లైప్‌’, ‘కుంగ్‌ఫు యోగా’తో ఆంగ్లంలోనూ నటించారాయన. నటుడిగానే కాకుండా, మోడల్‌గా, నిర్మాతగా కూడా రాణించారు. 1999లో ‘కలైజ్ఞర్‌’, ‘నెంజిలే’ చిత్రాలతో తమిళంలోకి అడుగుపెట్టారు సోనూ. ఆ తరువాత తెలుగులో ‘హ్యాండ్సప్‌’ అనే చిత్రం చేశారు. 2005లో నాగార్జునతో కలిసి నటించిన ‘సూపర్‌’తో సోనూకి తెలుగులో మంచి గుర్తింపొచ్చింది. ఆ తరువాత ‘అతడు’, ‘అశోక్‌’ చిత్రాలతో అదరగొట్టారు. ‘అరుంధతి’, ‘ఆంజనేయులు’, ‘ఏక్‌ నిరంజన్‌’, ‘కందిరీగ’, ‘దూకుడు’ చిత్రాల్లో సోనూసూద్‌ పాత్రలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. 2016లో తన తండ్రి శక్తిసాగర్‌ పేరుతో శక్తిసాగర్‌ ప్రొడక్షన్స్‌ అనే నిర్మాణ సంస్థని ఆరంభించిన ఆయన ‘అభినేత్రి’కి హిందీ వర్షన్‌గా తెరకెక్కిన ‘తూటక్‌ తూటక్‌ తూటియా’ అనే చిత్రాన్ని నిర్మించారు. జాకీచాన్‌తో కలిసి టనించిన ‘కుంగ్‌ఫు యోగా’ చిత్రాన్ని కూడా హిందీలో ఆయనే సొంతంగా విడుదల చేశారు. ‘అరుంధతి’లో నటనకిగానూ ఉత్తమ ప్రతినాయకుడిగా తెలుగులో నంది పురస్కారాన్ని అందుకొన్నారు. ఈ ఏడాది తమన్నాతో కలిసి ‘అభినేత్రి2’లో అతిథి పాత్రలో నటించారు. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్‌ కలిసి నటించిన ‘సీత’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ ప్రకటించగానే   రోజువారి కార్మికులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. అలాంటి వారికోసం తనవంతూ సాయం అందించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఓ పేద కుటుంబానికి ట్రాక్టర్‌ను సైతం అందజేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చాలానే ఉంది. సోనూ సూద్‌ పంజాబ్‌లోని మోగా పట్టణంలో జులై 30, 1973లో జన్మించారు.  

కండల వీరుడి కథ!


తడు అధిక బరువులనే కాదు... అధికారాన్ని కూడా మోయగలడు... అందుకే బాడీబిల్డర్‌గా క్రీడారంగంలోను, కండల వీరుడిగా సినిమాల్లోను, గవర్నర్‌గా రాజకీయరంగంలో కూడా రాణించాడు. అతడే ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగర్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రచయితగా, ఉద్యమకారుడిగా, రాజకీయ వేత్తగా బహువిధంగా మెప్పించిన ఆర్నాల్డ్‌ 15 ఏళ్లకే బరువులు ఎత్తడం ప్రారంభించాడు. 20 ఏళ్లకల్లా ‘మిస్టర్‌ యూనివర్శ్‌’ టైటిల్‌ గెలుచుకున్నాడు. అంతర్జాతీయంగా బాడీబిల్డింగ్‌ పోటీలు నిర్వహించే ‘మిస్టర్‌ ఒలింపియా’ విజేతగా ఏడుసార్లు నిలిచాడు. దేహదారుఢ్యంపై అనేక పుస్తకాలు రాశాడు. 1947 జులై 30న పుట్టిన ఆర్నాల్డ్‌కి 23 ఏళ్ల వయసులో సినిమాలపై గాలి మళ్లింది. 1970లో వచ్చిన ‘హెర్క్యులెస్‌ ఇన్‌ న్యూయార్క్‌’తో మొదలు పెట్టి ‘ద లాంగ్‌ గుడ్‌బై’, ‘స్టే హంగ్రీ’, ‘ద విలన్‌’ లాంటి సినిమాలు ఏవేవో చేసినా, 1982లో వచ్చిన ‘కానన్‌ ద బార్బేరియన్‌’ సినిమాతో అతడి పేరు మార్మోగిపోయింది. జేమ్స్‌కామెరూన్‌ తీసిన ‘ద టెర్మినేటర్‌’తో స్టార్‌ అయిపోయాడు. పోరాట వీరుడిగానే కాక, హాస్యం చిలికించే పాత్రల్లోనూ మెప్పించాడు. ‘కమేండో’, ‘రా డీల్‌’, ‘ప్రెడేటర్‌’, ‘రెడ్‌హీట్‌’, ‘టోటల్‌ రీకాల్‌’, ‘కిండర్‌గార్టెన్‌ కాప్‌’, ‘ట్రూలైస్‌’ లాంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు సాధించాడు. కాలిఫోర్నియా గవర్నర్‌గా రెండు సార్లు ఎంపికై రాజకీయ నాయకుడిగా కూడా మెప్పించాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ కెనడీ మేనకోడలైన మారియా షివర్‌ను పెళ్లాడాడు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

అవార్డుల తార!


రెం
డు అకాడమీ, రెండు గోల్డెన్‌గ్లోబ్, రెండు క్రిటిక్స్‌ ఛాయిస్‌తో పాటు స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులు ఆమె నటనకు గీటురాళ్లు. పేరు హిలరీ స్వాంక్‌. 1974 జులై 30న పుట్టిన ఈ అందాల తార ‘కరాటే కిడ్‌’, ‘బెవర్లీ హిల్స్‌’, ‘బాయిస్‌ డోన్ట్‌ క్రై’, ‘డ్రామా’, ‘మిలియన్‌ డాలర్‌ బేబీ’, ‘ఇన్‌సోమ్నియా’, ‘రెడ్‌ డస్ట్‌’, ‘లోగాన్‌ లక్కీ’ లాంటి చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 1997లో ప్రముఖ దర్శక, నిర్మాత చాద్‌ లోవ్‌ను 1997లో పెళ్లి చేసుకొన్ని కాన్నాళ్లు పాటు సజావుగా సాగిన వీరి కాపురం సరిగ్గా తొమ్మిది సంవత్సరాల తరువాత అంటే 2007లో విడిపోయారు. గత సంవత్సరం ఫిలిప్‌ ష్నైడర్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొంది. ప్రస్తుతం ‘ఐయామ్‌ మదర్‌’, ‘ఫాటెల్‌’, క్రెయిగ్‌ జోబెల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది హంట్‌’ సినిమాలో నటిస్తుంది. సెప్టెంబర్‌ 27, 2019న సినిమా ప్రేక్షకులముందకు రానుంది.

సోనూ నిగమ్‌..
స్వరం మధురం


యన ‘‘కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది.. విన్నావంటే సరదాగా ఉంటుంది’’ అంటే వినకుండా ఉండలేం. ‘‘హ్యాపీగా జాలీగా ఎంజాయ్‌ చెయ్‌రా’’.. అని చెప్తే చెయ్యకుండా ఉండలేం. ఎందుకంటే ఆయన గళం నుంచి జాలువారిన సుస్వరం అలాంటిది మరి. ఇంతకీ ఎవరాయన? అంటే కచ్చితంగా సోనూ నిగమ్‌ అని చెప్పాల్సిందే. నాటి ‘జీన్స్‌’ చిత్రంలోని ‘‘రావే నా చెలియ’’.. పాట నుంచి నేటి ‘లవర్‌’ చిత్రంలోని ‘‘వాట్‌ ఏ అమ్మాయి’’.. పాట వరకు తన ప్రస్థానం గమనిస్తే పైన చెప్పుకున్న మాటలన్నీ అక్షర సత్యాలని అర్థమైపోతుంది. ‘‘ముద్దులెట్టి చెరిపెయ్‌’’ లాంటి ఫాస్ట్‌ బీటయినా.. ‘‘ఆకాశం సాక్షిగా’’ లాంటి మెలోడి గీతమైనా.. ఆయన గళం నుంచి బయటకొస్తే థియేటర్లో ప్రేక్షకులు మైమరచి ఉర్రూతలూగాల్సిందే. సోనూ హిందీ, బెంగాలీ, అస్సామీ, భోజ్‌ పురీ, ఇంగ్లీషు, కన్నడం, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, తుళు, తమిళం, ఉర్దూ, తెలుగు.. అనేక భాషల్లో వేలాది గీతాలు ఆలపించిన ప్రసిద్ధ గాయకుడు. సినిమాల్లోని పాటలే కాకుండా పాప్‌ ఆల్బమ్స్‌తోనూ సంగీత ప్రియులను అలరిస్తుంటారు. అంతేకాదు మైకేల్‌ జాక్సన్‌ మృతికి నివాళిగా ఓ పాటను పాడి తన ప్రత్యేకత చాటుకున్నాడు. అన్ని భాషల్లోనూ రాణించగలిగే ఈయన తెలుగులో కొన్ని పాటలే పాడినా అవన్నీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిన ఆణిముత్యాలే అని చెప్పొచ్చు. ‘లాహిరి లాహిరి లాహిరి’లోని ‘‘నేస్తమా ఓ ప్రియ నేస్తమా’’,‘మొదటి సినిమా’లోని ‘‘ఉరిమే మేఘం’’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లోని ‘‘ప్రియతమా’’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’లోని ‘‘అంతా సిద్ధంగా ఉన్నది’’,‘వరుడు’లోని ‘‘బహుశా ఓ చంచలా’’,‘శకుని’లోని ‘‘మనసులో మధువే’’,‘గోపాల గోపాల’లోని ‘‘నీదే నీదే’’... వంటి అత్యంత ప్రజాదరణ పొందిన గీతాలన్నీ ఆయన స్వరం నుంచి జాలువారినవే. తన స్వర ప్రస్థానంలో ఒక జాతీయ,రెండు ఫిల్మ్‌ ఫేర్‌(హిందీ),మూడు ఫిల్మ్‌ ఫేర్‌(సౌత్‌ ) అవార్డులు అందుకున్నాడు. గాయకుడిగానే కాకుండా నటుడిగా, వ్యాఖ్యాతగా ప్రస్థానం సాగిస్తున్న సోనూ నిగమ్‌ పుట్టిన రోజు నేడు. ఆయన 1973 జులై 30న హర్యాణాలోని ఆగమ్‌ కుమార్‌ నిగమ్, శోభా నిగమ్‌ దంపతులకు జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రితోపాటు వేదికలపై పాటలు పాడటం ప్రారంభించిన సోనూ 18 ఏళ్లకు బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

మరాఠీ రసిక్...
సులోచన (పుట్టినరోజు)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

మ్యాట్రిక్స్‌ నటుడు


అం
తర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన మ్యాట్రిక్స్‌ సినిమాలు గుర్తున్నాయా? మూడు భాగాలుగా వచ్చిన ఈ సినిమాల్లో మార్ఫియస్‌ పాత్ర గుర్తుందా? ఆ పాత్ర ద్వారా ప్రపంచ ప్రాచుర్యాన్ని పొందిన నటుడే లారెన్స్‌ ఫిష్‌బర్న్‌. నటుడిగా, నాటక రచయితగా, నిర్మాతగా, స్క్రీన్‌ రైటర్‌గా, దర్శకుడిగా హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ఇతడు పిల్లి గెడ్డంతో, బోడి గుండుతో చాలా యాక్షన్‌ సినిమాల్లో మెప్పించాడు. ‘బోయిస్‌ అండ్‌ ద హుడ్‌’, ‘మిస్టర్‌ క్లీన్‌’, ‘ఎపొకలిప్స్‌ నౌ’, ‘ద బోవెరీ కింగ్‌’, ‘వాట్‌ ఈజ్‌ లవ్‌ గాట్‌ టు డూ విత్‌ ఇట్‌’, ‘టూ ట్రైన్స్‌ రన్నింగ్‌’, ‘డీప్‌ కవర్‌’, ‘కింగ్‌ ఆఫ్‌ న్యూయార్క్‌’, ‘మ్యాన్‌ ఆఫ్‌ స్టీల్‌’, ‘బ్యాట్‌మ్యాన్‌ వెర్సెస్‌ సూపర్‌మ్యాన్‌’, ‘యాంట్‌మ్యాన్‌ అండ్‌ ద వాస్ప్‌’ లాంటి సినిమాలతో పాటు ఎన్నో టీవీ సీరియల్స్‌ ద్వారా కూడా గుర్తింపు పొందాడు. జార్జియాలో 1961 జులై 30న పుట్టిన లారెన్స్‌ కాలేజీ రోజుల్లోనే నాటక రంగం పట్ల ఆకర్షితుడయ్యాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి నటుడిగా అనేక పురస్కారాలు అందుకున్నాడు.

స్టార్‌ దర్శకుడు


* ఆయన నిర్మించిన పది సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 4.7 బిలియన్‌ డాలర్లను వసూలు చేశాయి!

* ఆ సినిమాలన్నీ 34 ఆస్కార్‌ అవార్డులను నామినేషన్లు పొంది, పది అవార్డులను సాధించాయి!

* ప్రపంచంలోనే ప్రభావశీలురైన 100 మందితో టైమ్‌ పత్రిక రూపొందించిన జాబితాలో ఆయన రెండు సార్లు స్థానం సంపాదించాడు!

* బ్రిటిష్‌ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మకమైన ‘కమాండర్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌’ పురస్కారాన్ని అందుకున్నాడు!

ఇన్ని ఘనతలను తన ఖాతాలో వేసుకున్న ఆ దర్శక నిర్మాతే క్రిస్టోఫ్‌ ఎడ్వర్డ్‌ నోలన్‌. ఆయన గురించి ఆయన పొందిన అవార్డుల కంటే ఆయన తీసిన సినిమాలే ఎక్కువ చెబుతాయి.విలక్షణ శైలితో ఆయన రూపొందించిన ‘ద డార్క్‌ నైట్‌ ట్రిలాజీ’, ‘ద ప్రిస్టేజ్‌’, ‘ఇన్‌సెప్షన్‌’, ‘ఇంటర్‌స్టెల్లార్‌’, ‘డన్‌క్రిక్‌’, ‘ఫాలోయింగ్‌’, ‘మెమెంటో’, ‘ఇన్‌సోమ్నియా’ లాంటి ఆయన సినిమాలెన్నో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించాయి. లండన్‌లో 1970 జులై 30న పుట్టిన క్రిస్టోఫర్‌ నోలన్, ఎనిమిదేళ్ల వయసులోనే చిత్రీకరణ మొదలు పెట్టాడంటే ఆశ్చర్యమేస్తుంది. తండ్రి కొనిచ్చిన సూపర్‌ 8 కెఏరాతో చిన్న చిన్న చిత్రాలు తీసేవాడు. ఆ అభిరుచే అతడిని చిత్రరంగంవైపు నడిపించింది. స్నేహితులతో కలిసి అతడు రూపొందించిన ‘గెంఘిస్‌ బ్లూస్‌’ డాక్యుమెంటరీ ఆస్కార్‌కు నామినేషన్‌ పొందింది. చిత్రరంగంలో స్క్రిప్ట్‌ రీడర్‌గా, కెమేరా ఆపరేటర్‌గా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఇతడు 1998లో స్నేహితులతో కలిసి తొలి సినిమాను తీస్తే అదే అనేక అవార్డులు పొందింది. ఆపై ఆయన సినిమాలన్నీ విజయంతో పాటు, ప్రశంసలు పురస్కారాలు పొందినవే.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.