జులై 5.. (సినీ చరిత్రలో ఈరోజు)

* మాస్‌ ‘పటాస్‌’...
కళ్యాణ్‌రామ్‌ (పుట్టినరోజు)


నం
దమూరి కుటుంబ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొన్న కథానాయకుడు కల్యాణ్‌రామ్‌. కథానాయకుడిగా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు. ఏం చేసినా తన అభిరుచిని ప్రత్యేకంగా చాటుతుంటారాయన. నందమూరి హరికృష్ణ రెండో తనయుడైన కల్యాణ్‌రామ్‌ 1989లో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘బాలగోపాలుడు’లో బాలనటుడి కనిపించి సందడి చేశారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ‘తొలి చూపులోనే’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. ‘అతనొక్కడే’తో తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ‘లక్ష్మీకళ్యాణం’, ‘హరేరామ్‌’, ‘పటాస్‌’, ‘ఇజం’ తదితర చిత్రాలు కల్యాణ్‌రామ్‌కి విజయాల్ని అందించాయి. నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించిన ఆయన జయాపజయాలతో సంబంధం లేకుండా ఉన్నతమైన విలువలతో చిత్రాల్ని రూపొందించారు. నిర్మాతగా ‘జై లవకుశ’తో ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నారు. కల్యాణ్‌రామ్‌ తమ్ముడు ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. గత ఏడాది కె.వి.గుహన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘118’ చిత్రంలో టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో రిపోర్టర్‌గా నటించి మెప్పించాడు. ఈ ఏడాది సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన  ‘ఎంతమంచి వాడవురా’లో అలరించాడు. జులై 5, 1978లో జన్మించిన కల్యాణ్‌రామ్‌ చికాగోలోని ఇల్లినాయిస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎమ్‌.ఎస్‌.చేశారు. కోయంబత్తూరులో ఇంజినీరింగ్‌ చేశారు. స్వాతిని వివాహమాడిన ఆయనకి శౌర్యరామ్, తారక అద్వైత సంతానం. ఈరోజు ఆయన పుట్టినరోజు.

* అక్కినేనిని పరిచయం చేసిన...
ఘంటసాల బలరామయ్య (జయంతి - 1906)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అందం... అభినయం...


ప్ర
పంచవ్యాప్తంగా పిల్లల్ని, పెద్దల్ని ఆకర్షించిన ‘స్పైడర్‌మ్యాన్‌’ సినిమాలు చూసిన వారికి ఎలిజబెత్‌ ఐరీన్‌ బ్యాంక్స్‌ గురించి చెప్పక్కర్లేదు. నటిగా, దర్శకురాలిగా, మోడల్‌గా, నిర్మాతగా హాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి. చిన్నప్పుడు బేస్‌బాల్, గుర్రపుస్వారీలలో చురుగ్గా పాల్గొన్న ఈమె ఓ లీగ్‌ పోటీలో కాలు విరగడంలో చదువు మీద దృష్టి పెట్టి మోడలింగ్, టీవీల ద్వారా వెండితెరపైకి వచ్చింది. ‘సరెండర్‌ డొరోతీ’ (1998) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఈమె ‘స్పైడర్‌ మ్యాన్‌’ మూడు చిత్రాలు, ‘సీబిస్కట్‌’, ‘ది 40 ఇయర్‌ ఓల్డ్‌ వర్జిన్‌’, ‘రోల్‌ మోడల్స్‌’, ‘ద పిచ్‌ పెర్‌ఫెక్ట్‌’ ట్రయాలజీ, ‘పవర్‌ రేంజర్స్‌’ లాంటి సినిమాల ద్వారా గుర్తింపు పొందింది. ‘పిచ్‌ పెర్‌ఫెక్ట్‌2’తో దర్శకురాలై, తొలి చిత్రానికే అధిక వసూళ్లు సాధించిన రికార్డు నెలకొల్పింది. అమెరికాలో అత్యధిక పారితోషికం పొందిన నటుల జాబితాలో చోటు సాధించింది. ఆమె చిత్రాలన్నీ కలిసి వసూళ్ల పరంగా అధిక వసూళ్లు సాధించిన వాటి జాబితాలో ఐదవ స్థానంలో ఉండడం విశేషం. ఈమె 2003లో ఇదే రోజు నిర్మాత మ్యాక్స్‌ హాండెల్‌మన్‌ను వివాహమాడింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.