జులై 7.. (సినీ చరిత్రలో ఈరోజు)

* ఆయన ప్రతిభ... బహుముఖం!
మిక్కిలినేని (జయంతి)


టు గంభీరమైన నటనకు... ఇటు పెద్ద మనిషి తరహా పాత్రలకు కూడా పెట్టింది పేరు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. ఏ పాత్ర ధరించినా అందులో సహజంగా ఒదిగిపోయి మెప్పించేవారు. నాటకాల నుంచి వెండితెరకు వచ్చిన మిక్కిలినేని, రచయితగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజకీయ నేతగా కూడా ప్రసిద్ధుడు. గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 1914 జులై 7న పుట్టిన మిక్కిలినేని తొలుత జానపద కళారూపాలతో ప్రభావితుడయ్యారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్రానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. నాటక రంగానికి చెందిన 400 మంది నటీనటుల జీవితాలను ‘నటరత్నాలు’ పేరిట అక్షరాల్లో పొందుపరిచిన రచయిత ఈయన. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు. మిక్కిలినేనిని ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. కె.ఎస్‌.ప్రకాశరావు దర్శకత్వంలో 1949లో వచ్చిన ‘దీక్ష’తో మిక్కిలినేని సినీప్రస్థానం మొదలైంది. బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన ‘భైరవద్వీపం’ వరకూ 400లకు పైగా తెలుగు చిత్రాల్లో నటించారు. కమ్యూనిస్ట్‌గా, గ్రంథాలయ, హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్తగా సేవలందిచారు. ‘తెలుగువారి జానపద కళారూపాలు’ అనే పుస్తకాన్ని కూడా మిక్కిలినేని వెలువరించారు. ‘మన పగటి వేషాలు’, ‘ఆంధ్రుల నృత్యకళా వికాసం’ తదితర పరిశోధనాత్మక గ్రంథాల రచయిత. బహుముఖంగా సేవలందించిన మిక్కిలినేని 2011 ఫిబ్రవరి 22న విజయవాడలో తన 95వ ఏట మరణించారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ప్రేమించిన గూఢచారి..


జే
మ్స్‌బాండ్‌ ప్రేమిస్తే ఏమవుతుంది? ‘ద స్పై హూ లవ్డ్‌ మీ’ సినిమా అవుతుంది. పదో బాండ్‌ సినిమాగా, రోజర్‌మూర్‌ మూడో సినిమాగా వచ్చిన ఇది సహజంగా సీనీ అభిమానులను అలరించింది. బాండ్‌ సినిమాల్లో అందరి విలన్లలాగే ఇందులో కూడా విలన్‌ కూడా విపరీత ఆలోచనలు చేస్తాడు. ప్రపంచాన్ని నాశనం చేసి సముద్రగర్భంలో కొత్త నాగరికతను మొదలుపెట్టాలనుకుంటాడు. బాండ్‌ రంగంలోకి దిగి రష్యా ఏజెంట్‌ అయిన భామతో కలిసి విలన్‌ కథ కట్టిస్తాడు. 1977లో జులై 7న విడుదలైన ఈ సినిమా మూడు అకాడమీ నామినేషన్లు పొందడంతోపాటు, 14 మిలియన్ల బడ్జెట్‌కి, 185 మిలియన్‌ డాలర్లు రాబట్టింది.

* వెలుగుల విజయం...
చీకటి పతనం..


‘శి
ఖరం మీదకి చేరుకోవడం కన్నా, అక్కడి నుంచి జారిపోకుండా చూసుకోవడం చాలా కష్టం’ అన్న సూక్తికి ఆమె జీవితమే ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ సినిమా ‘ఇ.టి.- ది ఎక్స్‌ట్రా టెర్రెస్టియ్రల్‌’ గుర్తుందా? అయితే అందులో నటించిన చిన్న పాప కూడా గుర్తుకొచ్చే ఉంటుంది. ఆమే డ్రూ బ్లైత్‌ బారీమోర్‌. ఓ నటిగా, రచయితగా, దర్శకురాలిగా, మోడల్‌గా, నిర్మాతగా ఎదిగిన ఆమె జీవితంలో ఉత్థానపతనాలు రోలర్‌కోస్టర్‌ను తలపిస్తాయి. బాలీవుడ్‌లో కపూర్‌ల కుటుంబంలాగే అమెరికాలో బారిమోర్‌ల కుటుంబం కూడా అలాంటిదే. ఎందరో నటులున్న ఆ కుటుంబంలోంచి వచ్చిన ఈమె చిన్నతనంలోనే స్టార్‌డమ్‌ అందుకుంది. డబ్బు, కీర్తి వచ్చిపడ్డాయి.... కానీ ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు చూస్తే... చిన్నారి బారీమోర్‌ 9 ఏళ్లకి సిగరెట్‌ అంటించింది... 11 ఏళ్లకే మందు గ్లాసు అందుకుంది... రాత్రిలు బార్‌ల వెంట, పార్టీల వెంట తిరిగింది... 13 ఏళ్ల కల్లా మాదకద్రవ్యాలకి బానిసైంది... పద్నాలుగేళ్లకి ఆత్మహత్యకి ప్రయత్నించింది. ఆ తరువాత మానసికంగా దిగజారిపోయి చివరకి ఓ పునరావాస కేంద్రంలో చికిత్స పొంది కోలుకుంది. మంచిచెడులు తెలుసుకుంది. తన జీవితం అందరికీ గుణపాఠం కావాలనే కోరికతో ‘లిటిల్‌ గర్ల్‌ లాస్ట్‌’ (1991) పుస్తకం రాసింది. తిరిగి విజయాల బాట పట్టింది. ‘పాయిజన్‌ ఇవీ’, ‘స్కీమ్ర్‌’, ‘ఎవర్‌ ఆఫ్టర్‌’, ‘ద వెడ్డింగ్‌ సింగర్‌’, లాంటి సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. నిర్మాతగా మారి మంచి చిత్రాలు తీసింది. ‘విప్‌ ఇట్‌’ (2009)తో దర్శకురాలైంది. నటిగా ఎన్నో అవార్డులు సాధించింది. సేవా కార్యక్రమాల కోసం భారీ విరాళాలు ఇచ్చింది. ఆమె 2001లో జులై 7న నటుడు టామ్‌ గ్రీన్‌ను వివాహమాడింది.

* మాయలు నేర్చిన కుర్రాడు..


మా
యలు, మంత్రాలు నేర్చిన కుర్రాడి కథగా ‘హ్యారీపాటర్‌’ సినిమాలకు ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. ఈ చిత్రాల పరంపరలో ఆఖరుది, ఎనిమిదోది అయిన ‘హ్యారీపాటర్‌ అండ్‌ ద డెడ్లీ హాలోస్‌’ సినిమా 2011లో జులై 7న విడుదలైంది. బ్రిటిష్‌ రచయిత్రి జె.కె. రౌలింగ్‌ ఇదే పేరుతో రాసిన నవల ఆధారంగా తీసిన ఇది హ్యారీపాటర్‌ సినిమాల్లో త్రీడీ వెర్షన్‌లో విడుదలైన ఏకైక సినిమా. తాజా లెక్కల ప్రకారం చూస్తే ఇంతవరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో పదవది. హ్యారీపాటర్‌ సినిమాల్లో అత్యధికంగా రాబట్టింది. 250 మిలియన్‌ డాలర్లతో తీసిన ఇది 1.342 బిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.