జులై 9.. (సినీ చరిత్రలో ఈరోజు)

నిండైన నటనకు చిరునామా!
 గుమ్మడి వెంకటేశ్వరావు (జయంతి-1927)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి..)

 ఆయన చిత్రాలు... జీవన వైవిధ్య భరితాలు!
 కె.బాలచందర్‌ (జయంతి- 1930) 

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి..)

నీ నవ్వుల తెల్లదనాన్ని...
 ఉన్నికృష్ణన్‌ (పుట్టిన రోజు)


విశిష్టమైన గళంతో దక్షిణాదితో పాటు, ఉత్తరాది శ్రోతల్ని కూడా ఉర్రూతలూగిస్తున్న గాయకుడు ఉన్నికృష్ణన్‌. తెలుగులో ఆయన ‘ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో..’, ‘ఎంతందంగా ఉందో...’, ‘నా పాటే హోయ్‌నా హోయ్‌నా’, ‘డాడీ కథ వినవా చెబుతాను (ఉగాది), ‘రొమాన్స్‌లో రిథమ్‌ (తొలిప్రేమ), ఇప్పటికప్పుడు... (ప్రేమకి వేళాయెరా), ‘ఏమైందో ఏమో కానీ.. (నిన్ను చూడాలని), ‘నీ నవ్వుల తెల్లదనాన్ని (ఆది), ‘మధుర మధుర తర మీనాక్షి...’ (అర్జున్‌), ‘ఎందుకు చెంతకి... (కొంచెం ఇష్టం కొంచెం కష్టం) తదితర గీతాల్ని ఆలపించి శ్రోతలకి చేరువయ్యారు. శాస్త్రీయ సంగీత గీతాలాపానలో ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఆంగ్ల భాషల్లో పాటలు పాడారు. తొలి పాటకే జాతీయ ఉత్తమ గాయకుడిగా పురస్కారాన్ని అందుకొన్న ప్రతిభాశాలి ఉన్నికృష్ణన్‌. కేరళలోని పాలక్కాడ్‌లో కె.రాధాకృష్ణన్, డాక్టర్‌ హరిణి దంపతులకి జన్మించిన ఆయన మద్రాసులో కేసరి కుటీరంలో నివసిస్తుంటారు. పి.ఉన్నికృష్ణన్‌ తాత ఎన్‌.కేసరి పేరుగాంచిన ఆయుర్వేద వైద్యుడు. తెలుగులో గృహలక్ష్మి అనే పత్రికని నడిపారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బీకాం పూర్తి చేసిన ఉన్నికృష్ణన్‌ 1987 నుంచి 94 వరకు ప్యారిస్‌ కన్ఫెక్షనరీ లిమిటెడ్‌ సంస్థలో పనిచేశారు. తరువాత ఉద్యోగం వదిలిపెట్టి పూర్తిస్థాయి గాయకుడిగా మారారు. ఉన్నికృష్ణన్‌ భార్య ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి ప్రియ. ఈ దంపతులకి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె ఉత్తర కూడా గాయనిగా రాణిస్తున్నారు. ఆమె కూడా ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాన్ని అందుకొన్నారు. పలు సంగీత పోటీలకి న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించే ఉన్నికృష్ణన్‌ 1966 జులై 9న పుట్టాడు.

 బాలీవుడ్‌ అద్భుత మణిరత్నం
‘గురుదత్‌’ (జయంతి - 1925)(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి..)

 ఓ మంచి హాస్యనటుడు..


అతడి సినిమాలన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా 9 బిలియన్‌ డాలర్లును వసూలు చేశాయి. అతడి నటనకు ఎన్నో అవార్డులు వచ్చిపడ్డాయి. ఉత్తమ నటుడిగా రెండు వరుస సంవత్సరాల్లో రెండు ఆస్కార్‌ అవార్డులు పొందిన రికార్డు కేవలం ఇద్దరికే ఉంటే అందులో ఒకడుగా అతడు గుర్తింపు పొందాడు. అతడే టామ్‌హ్యాంక్స్‌. నాలుగేళ్లకే అమ్మానాన్నా విడిపోతే నాన్నతో వెళ్లిపోయి సవతి తల్లి దగ్గర పెరిగిన గందరగోళ బాల్యం నుంచి ఎదిగిన అతడు ఓ మంచి హాస్య నటుడిగా, ఓ చక్కని క్యారెక్టర్‌ నటుడిగా వెండితెరపై వెలిగాడు. 1980లో వచ్చిన ‘హి నోస్‌ యువార్‌ ఎలోన్‌’ అనే లోబడ్జెట్‌ సినిమాతో మొదలైన టామ్‌హ్యాంక్స్, ‘స్ప్లాష్‌’, ‘బిగ్‌’, ‘టర్నర్‌ అండ్‌ హూచ్‌’, ‘ఏ లీగ్‌ ఆఫ్‌ దైర్‌ ఓన్‌’, ‘స్లీప్‌లెస్‌ ఇన్‌ సియాటిల్‌’, ‘క్యాస్ట్‌ఎవే’, లాంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ప్రముఖ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌తో చేసిన ‘సేవింగ్‌ ప్రైవేట్‌ ర్యాన్‌’, ‘క్యాచ్‌మీ ఇఫ్‌ యుకెన్‌’, ‘ద టెర్మినల్‌’, ‘బ్రిడ్జి ఆఫ్‌ స్పైస్‌’, ‘ద పోస్ట్‌’ సినిమాలు అతడి నటనకు ప్రశంసలు తెచ్చాయి. నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఎదిగిన అతడు బాఫ్తా అవార్డును, కెన్నెడీ సెంటర్‌ గౌరవాన్ని, ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ను, ఫ్రెంచ్‌ లెజియన్‌ గౌరవాన్ని అందుకున్న ప్రతిభావంతుడు. 1956లో ఇతడు జులై 9న పుట్టాడు.


నాలుగు దశాబ్దాలు ఆమెవే!

ఆమె పాడితే అమెరికా ఆడింది... ఆమె నటిస్తే వెండితెర మురిసిపోయింది... నాలుగు దశాబ్దాల పాటు గాయనిగా, నటిగా, రచయితగా యువతను ఉర్రూతలూగించిన హుషారైన ప్రయాణం కోర్ట్‌నీ లవ్‌ది. పాప్‌ సంగీత ప్రపంచంలో ఓ విజయ పతాకాన్ని ఎగరేసింది. సినిమాల్లో అందాల తారగా మెప్పించింది. కాలిఫోర్నియాలో 1964 జులై 9న పుట్టిన లవ్, ‘సిద్‌ అండ్‌ నాన్సీ’, ‘స్ట్రెయిట్‌ టు హెల్‌’, ‘మేన్‌ ఆన్‌ ద మూన్‌’, ‘ట్రాప్‌డ్‌’, ‘ద పీపుల్‌ వెర్సెస్‌ లారీ ఫ్లింట్‌’ లాంటి సినిమాలతో అభిమానులను అలరించింది. మరోపక్క గాయనిగా ఎన్నో ఆల్బమ్‌లను వెలువరించింది. గ్రామీ, గోల్డెన్‌గ్లోబ్‌ లాంటి అవార్డులెన్నో అందుకుంది. మధ్యలో డ్రగ్స్‌ అలవాటుకు బానిసైనా ఆ అలవాటును జయించి తిరిగి తన ప్రస్థానం కొనసాగించడం విశేషం. ‘మాంగా’, ‘ప్రిన్సెస్‌ ఐ’, ‘డర్టీ బాండీ’, ‘ద డైరీస్‌ ఆఫ్‌ కోర్ట్‌నీ లవ్‌’లాంటి పుస్తకాలు వెలువరించి రచయితగా కూడా ఆకట్టుకుంది.

బాలీవుడ్‌ భరతుడు
సంజీవ్‌ కుమార్‌ (జయంతి - 1938)

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి..)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.