మార్చి 26.. (సినీ చరిత్రలో ఈరోజు)

* నేను మోనార్క్‌ని...
నన్నెవ్వరూ మోసం చేయలేరు!


రిచయం అవసరం లేని నటుడు... ప్రకాష్‌రాజ్‌. ఏ భాషలో నటించినా... ఆ భాష మాట్లాడుతూ ‘మా నటుడే’ అనేంతగా ప్రేక్షకుల సొంతమవుతుంటాడు. కన్నడ మాతృభాష అయినప్పటికీ... తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడటం ప్రకాష్‌రాజ్‌ ప్రత్యేకత. ఏ పాత్ర అప్పజెప్పినా సరే... అందులో ఇట్టే ఒదిగిపోతుంటారు. ‘ఇద్దరు’, ‘అంతఃపురం’, ‘కాంజీవరమ్‌’ చిత్రాలతో జాతీయ పురస్కారాలు అందుకొన్నారు. ‘పుట్టక్కన్న హైవే’ అనే కన్నడ చిత్రానికిగానూ నిర్మాతగా కూడా జాతీయ పురస్కారం అందుకొన్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, టీవీ హోస్ట్‌గా... ఇలా ఎన్నో రూపాల్లో ప్రకాష్‌రాజ్‌ తన ప్రతిభని ప్రదర్శించారు. ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీగా కూడా పోటీ చేశారు. ఆయనలో ఓ మంచి రైతు కూడా ఉన్నారు. ప్రకాష్‌రాజ్‌ బెంగుళూరులో 26 మార్చి, 1965న దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. సెంట్‌ జోసెఫ్స్‌ బాయ్స్‌ హైస్కూల్, సెంట్‌ జోసెఫ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో చదువుకొన్నారు. ప్రకాష్‌రాజ్‌ అసలు పేరు ప్రకాష్‌రాయ్‌. చిత్ర రంగంలో ఆయనకి గురురైన ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ సలహాతో ప్రకాష్‌రాజ్‌గా పేరు మార్చుకున్నారు. నాటక రంగం నుంచి వచ్చిన ప్రకాష్‌రాజ్‌ బెంగుళూరులోని కళాక్షేత్రలో పలు నాటకాల్లో అభినయించారు. ఆ తరువాత కన్నడ టెలివిజన్‌ రంగంలోకి, సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1994లో ‘డ్యూయెట్‌’తో తమిళంలో పరిచయమయ్యారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ప్రకాష్‌రాజ్‌కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత నుంచి ఆయనకి తెలుగు, మలయాళం, హిందీ భాషల నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగులో ‘సంకల్పం’తో పరిచయమైన ఆయన ఆ తరువాత ‘సహనం’, ‘గన్‌షాట్‌’, ‘వినోదం’, ‘పవిత్రబంధం’, ‘సుస్వాగతం’, ‘హిట్లర్‌’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘అంతఃపురం’... ఇలా ఆయన చేసిన ప్రతి పాత్ర పేరు తెచ్చిపెట్టింది. ప్రకాష్‌రాజ్‌ని ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మార్చేసింది. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నిర్మాతగా కూడా పలు చిత్రాల్ని రూపొందించారు. ప్రకాష్‌రాజ్‌లో మంచి పాఠకుడు, రచయిత కూడా ఉన్నారు. దర్శకుడిగా ఆయన నాలుగు చిత్రాలు చేశారు. తెలుగులో ‘ధోని’, ‘మనవూరి రామాయణం’ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ప్రకాష్‌రాజ్, నటి లలిత కుమారిని 1994లో వివాహం చేసుకొన్నారు. ఈ ఇద్దరూ 2009లో విడిపోయారు. అనంతరం ప్రకాష్‌రాజ్‌ ప్రముఖ నృత్య దర్శకురాలైన పోనీ వర్మని వివాహం చేసుకొన్నారు. ఈ దంపతులకి వేదాంత్‌ అనే అబ్బాయి ఉన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తుంటారు ప్రకాష్‌రాజ్‌. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకొని ఆ గ్రామాభివృద్ధి కోసం పాటు పడుతున్నారు. ఆ ఊరి పక్కనే పొలాలు కొనుగోలు చేసి అక్కడే నివసిస్తుంటారు ప్రకాష్‌రాజ్‌. ‘నేను మోనార్క్‌ని నన్నెవ్వరూ మోసం చేయలేరు’, ‘స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే.. అందులో నేను గొబ్బెమ్మని రా...’, ‘వాడు సామాన్యుడు కాదు’లాంటి సంభాషణల్ని వినగానే గుర్తుకొచ్చేది ప్రకాష్‌రాజే. ఆయన సంభాషణలు చెప్పే విధానం, హావభావాలే ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈరోజు ప్రకాష్‌రాజ్‌ పుట్టినరోజు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* స్టార్‌ట్రెక్‌ నటుడు


‘స్టా
ర్‌ట్రెక్‌’ కథలతో బుల్లితెర, వెండితెరలపై గుర్తింపు తెచ్చుకున్న నటుడు లియొనార్డ్‌ సైమన్‌ నిమోయ్‌. స్టార్‌ట్రెక్‌ కథల్లో స్పోక్‌ పాత్ర ఆయనకు ప్రేక్షకాదరణ తెచ్చిపెట్టింది. నటుడు, దర్శకుడు, ఫొటోగ్రాఫర్, రచయిత, గాయకుడు, గీత రచయిత... ఇవన్నీ అతడిలోని బహుముఖ పార్వ్శాలు. ‘కిడ్‌ మాంక్‌ బారోని’, ‘జాంబీస్‌ ఆఫ్‌ ద స్టాట్రోస్ఫియర్‌’ మూవీ సీరియల్, ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’లాంటి సినిమాలతో మెప్పించాడు. మసాచుసెట్స్‌లో 1931 మార్చి 26న పుట్టిన నిమోయ్, ‘ఐయామ్‌ నాట్‌ స్పోక్‌’, ‘ఐయామ్‌ స్పోక్‌’ అనే రెండు ఆత్మకథలను రాయడం విశేషం. ఈ నటుడి గౌరవార్థం 2015లో ఓ గ్రహశకలానికి ‘4864 నిమోయ్‌’ అని పేరు పెæ్టడం మరో విశేషం. ఎన్నో పురస్కారాలు అందుకున్న నిమోయ్, 2015 ఫిబ్రవరి 27న తన 83వ ఏæ మరణించాడు.

* బ్రిటిష్‌ పురస్కారం అందుకున్న అందం..


అం
దానికి తగిన అభినయంతో ఆమె అంచెలంచెలుగా ఎదిగింది. బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌’ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన హిట్‌ చిత్రాల్లో మెరిసి మెప్పించింది. ఆమే కైరా నైట్లీ. ‘స్టార్‌వార్స్‌ ఎపిసోడ్‌ 1: ద ఫాంటమ్‌ మెనేస్‌’, ‘బెండ్‌ ఇట్‌ బెక్‌హామ్‌’, ‘ప్రైడ్‌ అండ్‌ ప్రిజుడీస్‌’, ‘పైరేట్స్‌ ఆఫ్‌ ద కరీబియాన్‌’, ‘ద హోల్‌’, ‘ఎటోన్‌మెంట్‌’, ‘ఎ డేంజరస్‌ మెథడ్‌’ లాంటి సినిమాల్లో ఆకట్టుకుంది. ఇంగ్లండ్‌లో 1985 మార్చి 26న పుట్టిన నైట్లీ, చిన్నప్పుడే బుల్లితెరపై మెరిసి, పదేళ్లకల్లా వెండితెరకు పరిచయమైంది.

* అటు గానం...
ఇటు అభినయం...


గా
యనిగా, నటిగా యువతను మెప్పించిన నటి డయానా రాస్‌. ఆమె పాడిన గీతాలు, ఆల్బమ్‌లు, రికార్డులు ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా అమ్ముడుపోయాయి. గాయనిగా ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా యువత ఉర్రూతలూగేవారు. సినిమాల్లో మంచి అభినయం చూపి ఆస్కార్‌ కూడా అందుకుంది. ‘లేడీ సింగ్స్‌ ద బ్లూస్‌’, ‘మహోగనీ’, ‘ద విజ్‌’లాంటి సినిమాలతో అభిమానులను మెప్పించింది. టీవీ సినిమాల్లో కూడా ఇంటింటి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిచిగాన్‌లో 1944 మార్చి 26న పుట్టిన డయానా చిన్నతనంలోనే పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకుంది. సంగీత బృందాలతో కలిసి ప్రదర్శనలు ఇచ్చింది. టీవీల ద్వారా కూడా ప్రాచుర్యం సంపాదించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.