మార్చి 27.. (సినీ చరిత్రలో ఈరోజు)

* నయా సీతారామరాజు...
రామ్‌ చరణ్‌ (పుట్టినరోజు -1985)


తం
డ్రి చాటు తనయుడిగానే పరిశ్రమకి పరిచయమైన కథానాయకుడు రామ్‌చరణ్‌ తేజ్‌. మెగా వారసుడిగా భారీ అంచనాల మధ్య ఆయన సినీ రంగ ప్రవేశం చేశాడు. చిరంజీవిలా డ్యాన్స్‌ వేయగలడా? ఆయనలా నటించగలడా? ఆ గ్రేస్‌ ఉందా? అని మొదటి సినిమాతోనే పోల్చి చూడటం మొదలు పెట్టినా... మోయలేనంత అంచనాల భారం తనపై ఉన్నా... తొలి చిత్రం ‘చిరుత’తో ప్రేక్షకుల్ని మెప్పించాడు చరణ్‌. డ్యాన్స్‌లోనూ, నటనలోనూ, ఈజ్‌లోనూ తన ప్రతిభని ప్రదర్శించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఉన్న అగ్ర శ్రేణి మాస్‌ కథానాయకుల్లో ఒకరిగా రామ్‌చరణ కొనసాగుతున్నాడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘చిరుత’తో పరిచయమైన చరణ్, ఒకొక్క సినిమాతో మరింత పరిణతి సాధిస్తూ ఎదిగాడు. పుష్కర కాలంగా కథానాయకుడిగా ప్రయాణం చేస్తున్న ఆయన ప్రస్తుతం 14వ చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చేస్తున్నాడు. ‘మగధీర’ తరువాత రామ్‌చరణ్‌ - రాజమౌళి కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర కోసం మీసం కూడా మెలేశారు. రెండో చిత్రంతోనే రూ: వంద కోట్ల వసూళ్లు సాధించి రికార్డుల పని పట్టిన రామ్‌చరణ్‌... అగ్ర కథానాయకుడు చిరంజీవి, సురేఖ దంపతులకి 1985 మార్చి 27న జన్మించాడు. చిన్నప్పట్నుంచే తండ్రి సినిమాల్ని చూస్తూ డ్యాన్స్‌పై మక్కువ పెంచుకున్నాడు. డిగ్రీ పూర్తయ్యాక 2007లో ‘చిరుత’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి చిత్రంలోనే చక్కటి పరిణతిని ప్రదర్శించిన రామ్‌చరణ్‌ ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నాడు. నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు కూడా ఆయన్ని వరించింది. ఆ తరువాత ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ చేశాడు. ఆ చిత్రంతో రామ్‌చరణ్‌ పేరు ఇతర భాషల్లోనూ ప్రముఖంగా వినిపించింది. ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డుతో పాటు, నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ చిత్రంతో బలమైన మాస్‌ కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు చరణ్‌. 2010లో ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో ‘ఆరెంజ్‌’ చేశాడు. ఆ చిత్రం పరాజయం పాలైనప్పటికీ, చరణ్‌ నటనకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. 2011లో సంపత్‌ నంది దర్శకత్వంలో ‘రచ్చ’ చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్‌ని సాధించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. 2013లో వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ‘నాయక్‌’, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో కలిసి ‘ఎవడు’ చిత్రంలో నటించాడు. ఆ తరువాత ‘జంజీర్‌’తో హిందీకి పరిచయమయ్యాడు. తెలుగులోనూ ఆ చిత్రం ‘తుఫాన్‌’ పేరుతో విడుదలైనా... అది ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఈ చిత్రం అమితాబ్‌ బచ్చన్‌ ‘జంజీర్‌’కి రీమేక్‌గా రూపొందింది. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘గోవిందుడు అందరివాడేలే’, 2015లో శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్‌ లీ’ చిత్రాలు చేశాడు. ఆ రెండు చిత్రాలు కూడా మిశ్రమ స్పందననే తీసుకొచ్చాయి. 2016లో వచ్చిన ‘ధృవ’తో మరోసారి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చరణ్, 2018లో వచ్చిన ‘రంగస్థలం’తో తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ చిత్రం పలు రికార్డుల్ని తిరగరాసింది. ‘వినయ విధేయ రామ’తో పరాజయం ఎదురైనా మరొక ఘన విజయమే లక్ష్యంగా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం రంగంలోకి దిగారు. రామ్‌చరణ్‌ కేవలం కథానాయకుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా విజయాల్ని అందుకున్నాడు. తన తండ్రి రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’ని స్వయంగా నిర్మించాడు చరణ్‌. కొణిదెల ప్రొడక్షన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసిన ఆయన చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాని కూడా అందులోనే నిర్మించారు. 2012లో ఉపాసన కామినేనిని ప్రేమించి పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకున్న చరణ్‌ ప్రస్తుతం కథానాయకుడిగా, నిర్మాతగా బిజీ బిజీగా కొనసాగుతున్నాడు. గుర్రపుస్వారీని అమితంగా ఇష్టపడే చరణ్, ప్రస్తుతం హైదరాబాద్‌ పోలో రైడింగ్‌ క్లబ్‌ ఓనరుగా కొనసాగుతున్నారు. ఆయనకి హైదరాబాద్‌ శివార్లలో ఓ ఫామ్‌ హౌస్‌ ఉంది. అందులో రకరకాల జంతువుల్ని పెంచుతుంటారు. ఖాళీ సమయం ఎప్పుడు దొరికినా అక్కడికి కుటుంబంతో పాటు వెళ్లి పెంపుడు జంతువులతో కలిసి సేద తీరుతుంటారు. తన శ్రీమతి ఉపాసన బహుమతిగా ఇచ్చిన బ్రాట్‌ కుక్కపిల్ల అంటే చరణ్‌కి ఎంతో మక్కువ. విదేశాలకి వెళ్లినప్పుడు ఆ కుక్కపిల్లని మిస్‌ కాకూడదనే ఉద్దేశంతో, బ్రాట్‌ ఫొటోలతో ముద్రించిన లగేజీ బ్యాగులని తనతో తీసుకెళుతుంటాడు చరణ్‌. ఈ రోజు రామ్‌చరణ్‌ పుట్టినరోజు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)

* అలనాటి చరితకు అద్భుత చిత్రణ!


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

...............................................................................................................................................

*‍ ‘మాయాబజార్‌’లో అన్నీ విశేషాలే!(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* ఆస్కార్‌ తొలి నామినేషన్‌ అందుకున్న నటి!  


మూ
కీ చిత్రాల యుగంలో ఆమె స్టార్‌ స్టేటస్‌ అందుకుంది... ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది... అవార్డులతో పాటు అభిమానుల జేజేలనూ అందుకుంది...ఆమే గ్లోరియా స్వాన్‌సన్‌. ‘సన్‌సెట్‌ బౌలెవార్డ్‌’ (1950) నాటి మూకీలో నోమా డెస్మాండ్‌ పాత్రలో ఆమె అభినయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలకు పాత్రమైంది. ఆ సినిమాకు ఉత్తమ నటిగా ఆస్కార్‌ నామినేషన్‌తో పాటు, గోల్డెన్‌గ్లోబ్‌ పురస్కారం గెలుచుకుంది. హాలీవుడ్‌ ప్రఖ్యాత దర్శకుడు సిసిల్‌ బి.డెమిల్లే దర్శకత్వంలో 1920ల్లో ఆమె నటించిన చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించాయి. ఆస్కార్‌ అవార్డుల చరిత్రలో ఉత్తమ నటిగా నామినేషన్‌ అందుకున్న తొలి నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఆపై నిర్మాతగా మారి ‘ద లవ్‌ ఆఫ్‌ సన్యా’ (1927), ‘సాడీ థామ్సన్‌’ (1928) చిత్రాలను నిర్మించింది. ‘ద ట్రెస్పాసర్‌’ సినిమాతో టాకీల్లోకి అడుగుపెట్టింది. షికాగోలో 1899 మార్చి 27న పుట్టిన స్వాన్‌సన్, అనుకోకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. ప్రముఖ హాస్య నటుడు చార్లీ చాప్లిన్‌ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో పరిచయమై క్రమంగా తారగా ఎదిగిన ఈమె, ‘డోన్ట్‌ ఛేంజ్‌ యువర్‌ హస్బెండ్‌’, ‘మేల్‌ అండ్‌ ఫిమేల్‌’, ‘వై ఛేంజ్‌ యువర్‌ వైఫ్‌’లాంటి డెమిల్లే సినిమాలతో అందాల తారగా ఆకట్టుకుంది. రెండేళ్ల కాలంలోనే స్టార్‌డమ్‌ అందుకున్న ఆమెను వదులుకోడానికి నిర్మాతలు వెనుకాడేవారు. దాంతో ఆమె కోరిన పారితోషికంతో పాటు ఏది అడిగితే దాన్ని సమకూర్చేవారు. అందంతో, అభినయంతో, అంతకు మించిన స్టైల్‌తో ఆకట్టుకున్న ఆమె, న్యూయార్క్‌లో 1983 ఏప్రిల్‌ 4న తన 84వ ఏట మరణించింది.

* వాన హోరులో పాటల జల్లు


చా
లా ఎమ్యూజ్‌మెంట్‌ పార్కుల్లో రెయిన్‌ డాన్స్‌లొక ప్రత్యేకత. హోరెత్తించే పాటల నేపథ్యంలో ఏర్పాటు కృత్రిమ జల్లుల్లో యువతీ యువకులు మైమరిచిపోతూ డ్యాన్స్‌లు చేస్తుంటారు. అలా అటు వర్షం, ఇటు పాటలతో ఉర్రూతలూగించిన ఓ సినిమా 1927లోనే వచ్చిందని తెలుసా? అదే ‘సింగింగ్‌ ఇన్‌ ద రెయిన్‌’. అందాల భామలు, వాళ్ల నృత్యాల నేపథ్యంలో అల్లుకున్న ఓ సంగీత భరితమైన ప్రేమ కథ ఇది. మ్యూజికల్‌ రొమాంటిక్‌ కామెడీ సినిమాగా వచ్చిన ఈ సినిమాను అప్పట్లో 2.5 మిలియన్‌ డాలర్ల వ్యయంతో చిత్రీకరిస్తే, 12.4 మిలియన్‌ డాలర్లను వసూలు చేయడంతో పాటు అనేక అవార్డులు పొందింది. ప్రముఖ డ్యాన్సర్‌గా, నటుడిగా, దర్శక నిర్మాతగా పేరొందిన జెనీ కెల్లీ దీనికి దర్శకత్వం వహించడంతో పాటు, కొరియోగ్రాఫర్‌గా కూడా నృత్యాలు సమకూర్చాడు. అందాల తారలు నటి డెబ్బీ రెనాల్డ్స్, జీన్‌ హాగెన్‌ నటుడు డొనాల్డ్‌ ఓకోనర్‌ తదితరులు నటించిన ఈ సినిమాలో అడుగడుగునా పాటలు, డ్యాన్స్‌లు ప్రపంచ సినీ అభిమానులను హుషారెత్తించాయి. మేటి మ్యూజికల్‌ ఫిల్మ్‌గా ఇది ప్రశంసలు పొందింది. పద్నాలుగేళ్ల వయసు వచ్చేసరికల్లా ప్రతి ఒక్కరూ చూసి చూడాల్సిన 50 సినిమాల జాబితాలో ఒకటిగా నిలిచింది. ‘వందేళ్లు...వంద మేటి సినిమాలు’ పేరిట వచ్చే జాబితాల్లో ఇది చోటు సంపాదించుకుంది. సినిమా కథ కూడా నటీనటులు, నృత్య తారల నేపథ్యంలో అల్లుకున్నదే కావడం విశేషం.

* విలక్షణ సినిమాల రూపకర్త


తడి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విలక్షణమైనవిగా పేరొందాయి. తీసిన విధానంలోను, కథనాన్ని నడిపించిన తీరులోను, కథాంశాల ఎంపికలోనే కాదు, సంభాషణల శైలి, నటీనటుల అభినయ పరంగా కూడా ప్రత్యేకమైనవిగా నిలిచాయి. చారిత్రక అంశాల చుట్టూ అల్లుకున్న కథలుగా, నేరాల నేపథ్యంలో సాగే కల్పిత కథనాలుగా ఉండే ఇవి సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇలాంటి సినిమాలను అందించిన ఆ వ్యక్తే క్వెంటిన్‌ టరంటినో. ‘రిజర్వాయర్‌ డాగ్స్‌’, ‘పల్స్ ఫిక్షన్‌’, ‘ఫ్రమ్‌ డస్క్‌ టిల్‌ డాన్‌’, ‘జాకీ బ్రౌన్‌’, ‘కిల్‌బిల్‌’, ‘డెత్‌ ప్రూఫ్‌’, ‘గ్రిండ్‌ హౌస్‌’, ‘ఇంగ్లోరియస్‌ బాస్టర్డ్స్‌’, ‘జాంగో అన్‌చైన్డ్‌’, ‘ద హేట్‌ఫుల్‌ ఎయిట్‌’, ‘వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌’ లాంటి సినిమాలు అతడి నిర్మాణ శైలికి, నటనకి గీటురాళ్లుగా నిలుస్తాయి. రెండు ఆస్కార్, రెండు బాఫ్టా, నాలుగు గోల్డెన్‌గ్లోబ్, పామెడిఓర్, అయిదు గ్రామీలు సహా అనేక పురస్కారాలను అందుకున్నాడు. టైమ్‌ పత్రిక ప్రకటించే వందమంది ప్రభావశీలుర జాబితాలో ఇతడు స్థానం సంపాదించాడు. అమెరికాలో 1963 మార్చి 27న పుట్టిన ఇతడి తండ్రి కూడా నటుడు, నిర్మాత కావడం విశేషం. పద్నాలుగేళ్లకే స్క్రీన్‌ప్లే రాసిన ఇతడు నటనను అభ్యసించి తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగాడు.

* నవ్వుల నటుడు


బ్రి
టిష్‌ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌’ పురస్కారాన్ని అందుకున్న నటుడు, కమేడియన్, మ్యుజీషియన్, కంపోజర్‌ డుడ్లీ మోర్‌. వ్యంగ్యాత్మకమైన నాటక ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఇతడు టీవీ, వెండితెరలపై కూడా హాస్యాన్ని పండించాడు. ‘ఫౌల్‌ ప్లే’, ‘10’, ‘ఆర్థర్‌’, ‘మిక్కీ అండ్‌ మౌడ్‌’లాంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ఆస్కార్‌ నామినేషన్‌తో పాటు గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డును అందుకున్నాడు. ఇంగ్లండ్‌లో 1935 ఏప్రిల్‌ 19న పుట్టిన ఇతడు చిన్నప్పుడే సంగీతం పట్ల అభిరుచిని పెంచుకున్నాడు. సంగీత పరికరాలపై నైపుణ్యం సంపాదించాడు. నవ్వులు పంచుతూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఇతడు, అమెరికాలో 2002 మార్చి 27న తన 65వ ఏట మరణించాడు. ఈ రోజు ఇతడి వర్థంతి.

హాలీవుడ్‌లో అరుదైన ముద్ర


స్ట్రియాలో పుట్టాడు... హాలీవుడ్‌ను ఏలాడు... క్లాసిక్‌ సినిమాల యుగంలో మేటి దర్శక నిర్మాతగా పేరొందాడు... అతడే బిల్లీ వైల్డర్‌. దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ రచయితగా, చిత్రకారుడిగా, పాత్రికేయుడిగా 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తనదైన ముద్ర వేశాడు. ఒకే సినిమాకు నిర్మాతగా, దర్శకుడిగా, స్క్రీన్‌ రచయితగా ఆస్కార్‌ అవార్డులు అందుకున్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఆ సినిమా ‘ద అపార్ట్‌మెంట్‌’, అతడికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఆస్ట్రియాలో 1906 జూన్‌ 22న రైల్వే స్టేషన్‌లో కేకుల దుకాణదారుడికి పుట్టిన ఇతడు, యుక్తవయసులో జర్నలిస్టుగా పనిచేశాడు. అప్పుడే సినిమా రంగం ఆకర్షించడంతో స్క్రీన్‌ రచయితగా అడుగులు వేసి ఆపై చిత్రరంగంలో అంచెలంచెలుగా ఎదిగాడు. ‘నినోచ్‌కా’, ‘డబుల్‌ ఇండెమ్నిటీ’, ‘ద లాస్ట్‌ వీకెండ్‌’, ‘సన్‌సెట్‌ బౌలెవార్డ్‌’, ‘స్టాలాగ్‌ 17’, ‘ద సెవెన్‌ ఇయర్‌ ఇచ్‌’, ‘సమ్‌ లైకిట్‌ హాట్‌’ తదితర చిత్రాల ద్వారా సినీ ప్రేక్షకులను అలరించిన ఇతడు, తన 95వ ఏట 2002 మార్చి 27న మరణించాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.