మార్చి 31.. (సినీ చరిత్రలో ఈరోజు)

* కొత్తవారితో ప్రయోగం ‘తేనెమనసులు’


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* షర్లాక్‌ హోమ్స్‌ పరిశోధన


డి
టెక్టివ్‌ కథలను ఇష్టపడేవారికి షర్లాక్‌ హోమ్స్‌ గురించి వేరే చెప్పక్కర్లేదు. చురుగ్గా, తెలివిగా, అనూహ్యమైన వేగంతో కేసులను పరిశోధించే ఈ డిటెక్టివ్‌ పాత్రను సృష్టించింది సర్‌ ఆర్థర్‌ కోనన్‌ డోయల్‌. ఈ బ్రిటిష్‌ రచయిత స్వతహాగా వైద్యుడు అయినప్పటికీ సాహిత్యం మీద ఆసక్తితో కథలను రాసేవాడు. తొలిసారిగా 1887లో ‘ఎ స్టడీ ఇన్‌ స్కార్లెట్‌’ అనే నవల ద్వారా డిటెక్టివ్‌ షర్లాక్‌ హోమ్స్‌ పాత్రకు ప్రాణం పోశాడు. అది అందరినీ ఆకట్టుకోవడంతో మరో మూడు నవలలు రాశాడు. ఆపై ఈ డిటెక్టివ్‌ పాత్రతోనే దాదాపు 50 కథలు రాశాడు. నేర పరిశోధన సాహిత్యంలో ఈయన కథలు ప్రపంచ వ్యాప్తంగా గొప్పవిగా పేరొందాయి. అలాంటి ప్రఖ్యాత డిటెక్టివ్‌ షర్లాక్‌ హోమ్స్‌ ప్రధాన పాత్రగా 1939లో తీసిన సినిమా ‘ద హౌండ్‌ ఆఫ్‌ ద బాస్కర్‌విల్లేస్‌’. ఈ సినిమా విజయవంతమవడంతో షర్లాక్‌ హోమ్స్‌ పాత్రతో హాలీవుడ్‌లో మరో 13 సినిమాలు వచ్చాయి. బాస్కర్‌విల్లేస్‌ అనే పెద్ద ఎస్టేటుకు చెందిన వారసులను ఓ భయంకరమైన నల్ల కుక్క (హౌండ్‌) చంపేస్తూ ఉంటుంది. ఆ వంశస్థులలో చివరివాడైన హెన్రీ బాప్కర్‌విల్లే వస్తున్న సందర్భంగా ఆ సంస్థానం మేనేజర్‌ వారి రక్షణ కోసం డిటెక్టివ్‌ షర్లాక్‌ హోమ్స్‌ను సంప్రదిస్తాడు. ఆ కుక్క కారణంగా చనిపోయిన వారి కేసులలో పరిశోధన మొదలవుతుంది. ప్రతి వారూ భయం వల్ల గుండె ఆగిపోయి చనిపోతారు తప్ప, ఎవరి ఒంటి మీదా ఎలాంటి గాయాలూ ఉండవు. ఈ లోగా హెన్రీ బాస్కర్‌విల్లే వస్తాడు. అతడిని డిటెక్టివ్‌ షర్లాక్‌ హోమ్స్‌ ఎలా కాపాడాడనేదే కథ. ఈ సినిమా ‘వందేళ్లలో వంద థ్రిలింగ్‌ సినిమాలు’ జాబితాలో స్థానం సాధించింది. ‘మేటి పది మిస్టరీ సినిమాలు’లో ఒకటిగా నిలిచింది.

* అద్వితీయ అభినేత్రి...
మీనాకుమారి (వర్థంతి-1972)


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* షేక్స్‌పియర్‌ కామెడీ కథ


ప్ర
పంచ ప్రఖ్యాత రచయిత విలియం షేక్స్‌పియర్‌ 16వ శతాబ్దంలో రాసిన ఓ కామెడీ కథ ‘ద టేమింగ్‌ ఆఫ్‌ ద ష్రూ’ ఆధారంగా తీసిన సినిమా ‘10 థింగ్స్‌ ఐ హేట్‌ ఎబౌట్‌ యు’ (1999). టీనేజి పిల్లల ఆకర్షణ నేపథ్యంలో హాస్య భరితంగా తీసిన ఈ సినిమా విజయవంతమైంది. పదేళ్ల తర్వాత ఇదే కథతో టీవీ సీరియల్‌ కూడా వచ్చింది.

* స్టార్‌వార్స్‌ నటుడు


స్టా
ర్‌వార్స్‌ సినిమాలు చేసేవారికి ఎవాన్‌ మెక్‌గ్రెగర్‌ చిరపరిచితుడే. స్కాట్‌లాండ్‌కి చెందిన ఇతడు నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. టీవీలు, సినిమాల ద్వారా ప్రాచుర్యం సాధించాడు. ‘స్టార్‌వార్స్‌’ ప్రీక్వెల్‌ ట్రయాలజీ సినిమాల్లో జెడి ఒబివ్యాన్‌ కెనోబీ పాత్రలో ఆకట్టుకున్నాడు. ‘ట్రైన్‌స్పాటింగ్‌’, ‘టి2 ట్రైన్‌స్పాటింగ్‌’, ‘మౌలింగ్‌ రోగ్‌’, ‘బిగ్‌ ఫిష్‌’, ‘ద ఘోస్ట్‌ రైటర్‌’, ‘సాల్మన్‌ ఫిషింగ్‌ ఇన్‌ ద ఎమెన్‌’, ‘ద బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌’, ‘క్రిస్టోఫర్‌ రోబిన్‌’ లాంటి సినిమాల ద్వారా ఆకట్టుకున్నాడు. గోల్డెన్‌ గ్లోబ్‌ లాంటి అవార్డులతో పాటు బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌ పురస్కారం పొందాడు. సామాజిక సేవ ద్వారా బాఫ్టా బ్రిటానియా హ్యుమానిటేరియన్‌ అవార్డు అందుకున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.