మే 14.. (సినీ చరిత్రలో ఈరోజు)

* అందానికి అందం! (జెరీన్‌ఖాన్‌ పుట్టిన రోజు)(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అందం... హుందాతనం... ఆమె సొంతం

(వహిదా రెహమాన్‌ పుట్టినరోజు)(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* రాబిన్‌హుడ్‌ సాహసాలుఅన్నను కారాగారంలో బంధించి, తమ్ముడు సింహాసనం అధిష్టించడం... ప్రజలపై పన్నులు పెంచేసి పీడించి అరాచకం సృష్టించడం... ఆ ప్రజల లోంచి ఓ నాయకుడు ఈ అన్యాయాలను ఎదిరించడం... ధనికులను దోచుకుని పేదలకు పంచుతూ ప్రజల మద్దతు కూడగట్టుకోవడం, తమ్ముడి పీచమణిచి అసలు రాజును సింహాసనంపై కూర్చోబెట్టడం... మధ్యలో రాకుమారితో ప్రేమ కథ....

ఈ వివరాలన్నీ వింటే ఒకటి కాదు, రెండు కాదు... ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు కళ్ల ముందు సినిమారీలులాగా తిరగుతాయి. ఇంచుమించు ఇదే కథతో ‘ద అడ్వెంచర్స్‌ ఆఫ్‌ రాబిన్‌హుడ్‌’ సినిమా 1938లోనే హాలీవుడ్‌లో తెరకెక్కింది. వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ టెక్నికలర్‌లో మైకేల్‌ కర్టిజ్‌ దర్శకత్వంలో రాబిన్‌హుడ్‌గా ఎరోల్‌ ఫ్లిన్, అతడి మనసు దోచిన రాచకన్యగా అందాల తార ఒలివియా డీ హవిలాండ్‌ నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. మూడు ఆస్కార్‌ అవార్డులు గెలుచుకోవడంతో పాటు, రెండు మిలియన్ల వ్యయానికి రెట్టింపు లాభాలు వసూలు చేసి కాసుల వర్షం కురిపించింది.

* మెగా చిత్రాల మహాశిల్పి


‘స్టార్‌ వార్స్‌’, ‘ఇండియానా జోన్స్‌’... ఈ సినిమాలను తల్చుకుంటే ప్రపంచ సినీ అభిమానులు ఉప్పొంగిపోతారు. అలాంటి ఎన్నో సినిమాలను అందించిన ప్రతిభాశాలి జార్జిలూకాస్‌. కాలేజీ రోజుల్లోనే లఘుచిత్రాలను తీసిన ఇతడి ప్రతిభ, ‘అమెరికన్‌ గ్రాఫిటీ’ సినిమాతో వెల్లడైంది. ఆపై ‘స్టార్‌వార్స్‌’ సినిమా ఓ సంచలనం. ఆరు ఆస్కార్‌ అవార్డులందుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షం కురిపించినన ఈ సినిమా విజయంతో లూకాస్‌ దానికి కొనసాగింపు సినిమాలు తీశాడు. కాలిఫోర్నియాలో 1944 మే 14న పుట్టిన జార్జిలూకాస్‌ దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా అత్యంత విజయవంతమైన ప్రతిభాశాలిగా ఎదిగాడు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* అందమైన ప్రతిభ


-ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా ఎదిగింది!-ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలిగా నిలిచింది!


-రెండు ఆస్కార్లు, మూడు గోల్డెన్‌గ్లోబ్‌లు, మూడు బాఫ్టా అవార్డులు గెలుచుకుంది!


-ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి సెంటినరీ మెడల్‌ అందుకుంది!


-ఫ్రెంచి ప్రభుత్వం నుంచి చెవాలియర్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పురస్కారం పొందింది!

ఇన్ని ఘనతలు సాధించిన ఆమె కేట్‌ బ్లాంచెట్‌. అన్నింటితో పాటు అందాల నటిగా ప్రేక్షకులను కూడా అలరించింది. అంతర్జాతీయంగా విజయవంతమైన ‘ద టాలెంటెడ్‌ మిస్టర్‌ రిప్లే’, ‘ద లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌’ ట్రయాలజీ, ‘ద హాబిట్‌’ ట్రయాలజీ, ‘బాబెల్‌’, ‘ద క్యూరియస్‌ కేస్‌ ఆఫ్‌ బెంజమిన్‌ బట్టన్‌’, ‘సిండ్రెల్లా’, ‘థోర్‌: రగ్నరోక్‌’, ‘ఓషన్స్‌8’ ‘ఎలిజబెత్‌’, ‘ద ఏవియేటర్‌’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాలో 1969 మే 14న పుట్టిన కేట్, చదువుకునే రోజుల్లోనే నటన పట్ల ఆకర్షితురాలైంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.