మే 24 (సినీ చరిత్రలో ఈరోజు)...

* ఇండియానా జోన్స్‌ సందడి


ఇం
డియానా జోన్స్‌ అనగానే సాహసాలతో కూడిన యాక్షన్‌ సినిమాలు గుర్తొస్తాయి. వాటిలో ఒకటి ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ద లాస్ట్‌ క్రుసేడ్‌’ (1989). ప్రముఖ దర్శక నిర్మాత జార్జి లూకాస్‌ కథను ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తెరకెక్కిస్తే, యాక్షన్‌ హీరోలైన హారిసన్‌ ఫోర్డ్, సీన్‌ కానరీలు రక్తి కట్టించారు. ‘ఇండియానా జోన్స్‌’ పేరుతో వచ్చిన మూడో సినిమా ఇది. ఇది 1938 నాటి కథగా తెరపై కనిపిస్తుంది. నాజీలు కిడ్నాప్‌ చేసిన తన తండ్రి కోసం ఇండియానా జోన్స్‌ చేసిన అన్వేషణ, ఇద్దరూ కలిసి తప్పించుకోవడం ప్రధానంగా కథ. ఇది యాక్షన్‌తో పాటు, హాస్యాన్ని కూడా పంచుతూ 48 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌కు 474.2 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. ఆస్కార్‌ సహా మరెన్నో అవార్డులను గెలుచుకుంది.

* బహుముఖంగా...


టుడు, కమేడియన్, గాయకుడు, స్క్రీన్‌ రైటర్, నిర్మాత... ఇవన్నీ జాన్‌ సి.రిలీ విశేషణాలే. ‘క్యాజువాలిటీస్‌ ఆఫ్‌ వార్‌’ (1989) సినిమాతో తెరంగేట్రం చేసిన ఇతడు, ఎన్నో సినిమాల్లో సహాయ నటుడిగా అలరించాడు. ‘డేస్‌ ఆఫ్‌ థండర్‌’, ‘వాట్స్‌ ఈటింగ్‌ గిల్బెర్ట్‌ గ్రేప్‌’, ‘ద రివర్‌ వైల్డ్‌’, ‘హార్డ్‌ ఫైట్‌’, ‘బూగీ నైట్స్‌’, ‘మ్యాగ్నోలియా’, ‘షికాగో’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ న్యూయార్క్‌’, ‘ద ఏవియేటర్‌’, ‘వాక్‌ హార్డ్‌: ద డ్యూయీ కాక్స్‌ స్టోరీ’, ‘స్టెప్‌ బ్రదర్స్‌’, ‘గార్డియన్స్‌ ఆఫ్‌ ద గెలాక్సీ’, ‘కాంగ్‌: స్కల్‌ ఐలాండ్‌’ సినిమాల ద్వారా ప్రపంచ గుర్తింపు పొందాడు. ఇల్లినాయిస్‌లో 1965 మే 24న పుట్టిన ఇతడు గాయకుడిగా, నిర్మాతగా కూడా రాణించాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.