మే 26.. (సినీ చరిత్రలో ఈరోజు)

* భయానక నటుడు..


మూ
డు దశాబ్దాల పాటు హారర్‌ సినిమాల నటుడిగా గుర్తింపు పొందడం అంటే విచిత్రమే. ఆ ఘనత పీటర్‌ క్యుషింగ్‌దే. 1950ల నుంచి 70ల వరకు వచ్చిన అనేక భయానక చిత్రాల్లో పాత్రల ద్వారా ఆకట్టుకున్నాడు. డిటెక్టివ్‌ షెర్లాక్‌హోమ్స్‌ పాత్ర ద్వారా పలు సినిమాల్లో మెప్పించాడు. డ్రాకులా, స్టార్‌వార్స్, డాక్టర్‌ హూ చిత్రాల్లో పాత్రలు ఈయనకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చాయి. స్టార్‌వార్స్‌-4 సినిమాలో ‘గ్రాండ్‌ మాఫ్‌ టార్కిన్‌’ పాత్ర ద్వారా యువతరం ప్రేక్షకులకూ అభిమానపాత్రుడయ్యారు. ప్రతిష్ఠాత్మకమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌’ గుర్తింపు పొందారు. ఇంగ్లండ్‌లో 1913 మే 26న పుట్టిన ఇతడు, చిన్నప్పుడే నాటకాల ద్వారా ఆకట్టుకున్నాడు. దాదాపు 60 ఏళ్ల పాటు వివిధ పాత్రలు పోషించి మెప్పించిన ఈయన క్యాన్సర్‌ వల్ల 1994లో మరణించారు.

* ఆస్కార్‌ నటి..


హ్యా
రీపాటర్, ఫైట్‌క్లబ్, ద కింగ్స్‌ స్పీచ్, ద వింగ్స్‌ ఆఫ్‌ డవ్‌ చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన నటి హెలెనా బన్‌హామ్‌ కార్టర్‌. ‘మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌’ గుర్తింపు పొందిన నటి. ‘ద వింగ్స్‌ ఆఫ్‌ ద డవ్‌’ (1997) చిత్రానికి ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకుంది. ‘ద కింగ్స్‌ స్పీచ్‌’ (2010) చిత్రంలో క్వీన్‌ ఎలిజబెత్‌ పాత్ర ధరించి ‘బాఫ్తా’ అవార్డు అందుకుంది. అదే ఏడాది ఉత్తమ నటిగా అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్‌ పొందింది. ఇంగ్లండ్‌లో 1966 మే 26న పుట్టిన ఈమె, ‘లేడీ జాన్‌’, ‘ఎ రూమ్‌ విత్‌ ఏ వ్యూ’, ‘వేర్‌ ఏంజెల్స్‌ ఫియర్‌ టు ట్రెడ్‌’, ‘ద ప్లానెట్‌ ఆఫ్‌ ద ఏప్స్‌’, ‘ఛార్లీ అండ్‌ ద చాకొలేట్‌ ఫ్యాక్టరీ’, ‘ఎలైస్‌ ఇన్‌ వండర్‌ల్యాండ్‌’లాంటి సినిమాల ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకుల అభిమానం పొందింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.