మే 28 (సినీ చరిత్రలో ఈరోజు)

* విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు!
ఎన్‌.టి.రామారావు (జయంతి-1923)


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* సుస్వరాల మేటి!
కోటి (పుట్టినరోజు)


సా
లూరి రాజేశ్వరరావు అంటే ఆయనెవరని అడుగుతారేమో కానీ... కోటి అంటే మాత్రం తెలుగు శ్రోతలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. సాలూరి రాజేశ్వరరావు వారసుడైన కోటి మెలోడీ బాణీకి పెట్టని కోట. సుమారుగా 500 చిత్రాలకి స్వరాలు సమకూర్చిన అగ్ర సంగీత దర్శకుడాయన. తెలుగు, తమిళం, కన్నడ పరిశ్రమలకి సుపరిచితుడు. రాజ్‌తో కలిసి రాజ్‌ - కోటి ద్వయంగా దక్షిణాది చిత్ర పరిశ్రమపై తమదైన ముద్ర వేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి దగ్గర సహాయకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన కోటి విజయవంతమైన ఎన్నో చిత్రాలకి స్వరాలు సమకూర్చారు. ‘హలో బ్రదర్‌’ చిత్రానికి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారు. మణిశర్మ, ఎ.ఆర్‌.రెహమాన్‌ వంటి ప్రముఖ దర్శకులు వాళ్ల కెరీర్‌ ఆరంభంలో కోటి దగ్గర శిష్యరికం చేశారు. కోటికి ఇద్దరు తనయులు. ఒకరు రోషన్, మరొకరు రాజీవ్‌. రోషన్‌ తన తండ్రి బాటలోనే ప్రయాణం చేస్తూ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు. రాజీవ్‌ కథానాయకుడిగా కొనసాగుతున్నారు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* సినీ మాయల మరాఠీ..
విఠలాచార్య (వర్ధంతి-1999)


వెం
డితెరను రాజులు, రాచరికాలు, కంచుకోటలు, మాయలు, మంత్రాలు, రాక్షసులు, శాపాలు, వరాలతో ముంచెత్తి సినీ ప్రేక్షకులను చిత్రవిచిత్ర ఊహాలోకాల్లో విహరింపజేసి... ‘జానపద బ్రహ్మ’గా పేరు పొందిన బి. విఠలాచార్య వర్థంతి (1999). కర్నాటకలోని ఉడుపిలో 1920 జనవరి 18న తల్లిదండ్రులకు ఏడవ సంతానంగా పుట్టిన విఠలాచార్య, మూడో తరగతి వరకే చదువుకున్నాడు. తొమ్మిదో ఏటనే ఉపాధి కోసం ఇల్లు విడిచి పెట్టిన అతడు కొంతకాలానికి సోదరుడి ఉడుపి రెస్టారెంట్‌ను కొని దాన్ని విజయవంతంగా నడిపాడు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్లిన దేశభక్తుడు. జైలు నుంచి వచ్చాక వ్యాపారాన్ని తమ్ముడికి వదిలి కొన్నాళ్లు టూరింగ్‌ సినిమా హాళ్లను నడిపాడు. వచ్చిన ప్రతి సినిమా చూస్తూ ఆసక్తి పెంచుకుని స్నేహితుల భాగస్వామ్యంతో మైసూరులో చిత్రనిర్మాణ సంస్థ స్థాపించి 18 కన్నడ సినిమాలు నిర్మించాడు. ఆ తర్వాత సొంతంగా ‘విఠల్‌ ప్రొడక్షన్స్‌’ స్థాపించి 1954లో తొలిసారి దర్శకత్వం చేపట్టి ‘రాజ్యలక్ష్మి’ సినిమా తీశారు. తర్వాతి సినిమా ‘కాన్యాదానం’ను తెలుగులో తీయడం కోసం మద్రాసు వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. ఆయన తీసిన ‘వద్దంటే పెళ్లి’, ‘అన్నాచెల్లెళ్లు’, ‘కనకదుర్గ పూజా మహిమ’, ‘మదన కామరాజు కథ’, ‘బందిపోటు’, ‘గురువును మించిన శిష్యుడు’, ‘నవగ్రహ పూజా మహిమ’, ‘అగ్గిపిడుగు’, ‘జ్వాలాద్వీప రహస్యం’, ‘మంగమ్మ శపథం’, ‘అగ్గిబరాటా’, ‘అగ్గిదొర’, ‘కదలడు వదలడు’, ‘రాజకోట రహస్యం’, ‘జగన్మోహిని’... లాంటి ఎన్నో చిత్రాలు ప్రేక్షకజనరంజకంగా విజయవంతం అయ్యాయి. ఎన్‌టీఆర్‌తో ఆయన 19 చిత్రాలు తీశారు. మే 28, 1999 తన 79వ ఏట చెన్నైలో కన్నుమూశారు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* గుడ్లగూబ పాఠాలు!  


డవిలో గుడ్లగూబ స్కూలు పెడుతుంది. పక్షులకి పాఠాలు చెబుతుంటుంది. అన్నీ ప్రకృతి గురించిన పాఠాలే. ‘ఈ సృష్టిలో కేవలం మనుషులు, పక్షులు మాత్రమే పాటలు పాడగలవు’ అంటూ బోధిస్తూ ఉంటుంది.... ఆసక్తికరమైన ఈ కథతో వచ్చిన సినిమా ‘మెలోడీ’ 1953లో ఇదే రోజు విడుదలైంది. వాల్ట్‌ డిస్నీ తీసిన ఈ సినిమాకో ప్రత్యేకత ఉంది. ఇది త్రీడీలో తీసిన తొలి కార్టూన్‌ చిత్రం.
...................................................................................................................................................................

సన్‌ ఆఫ్‌ ఇండియా...
మెహబూబ్‌ ఖాన్‌ (వర్ధంతి-1964)

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.