మే 30 (సినీ చరిత్రలో ఈరోజు)

* దారి చూపే మార్గదర్శి...
‘దాసరి’ (వర్ధంతి-2017) 


(పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి)

* నాలుగు మూకీలు...
ఇరవై టాకీలుగా ‘హరిశ్చంద్ర’


(పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి)

* నవ్వించే విలన్‌..


ప్ర
ముఖ బాలీవుడ్‌ నటుడు, రాజకీయ నేత పరేష్‌ రావల్‌ (మే 30, 1950) పుట్టిన రోజు. బీజెపీ తరపున లోక్‌సభ సభ్యుడు. హిందీ, గుజరాతీ, మరాఠీ, తెలుగు, ఇంగ్లిషు భాషలను అనర్గళంగా మాట్లాడగలిగే పరేష్‌ రావల్, జాతీయ అవార్డు అందుకున్న నటుడు. ‘వో చౌక్రి’, ‘సర్‌’ చిత్రాలకు ఉత్తమ సహాయనటుడిగా జాతీయ బహుమతులు అందుకున్నాడు. ‘క్షణ క్షణం’ (1991), ‘మనీ’ (1993), ‘గోవిందా గోవిందా’ (1994), ‘బావగారూ బాగున్నారా’ (1998), ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్‌’ (2004) సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. గుజరాత్‌ కుటుంబానికి చెందిన పరేష్, నటి స్వరూప్‌ సంపత్‌ను వివాహమాడారు. వారికిద్దరు పిల్లలు. 1985లో ‘అర్జున్‌’ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. వందకు పైగా చిత్రాల్లో మేటి నటుడిగా మెప్పించారు.

* అల్లువారి హీరో..


థానాయకుడు అల్లు శిరీష్‌ పుట్టిన రోజు. ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ నిర్మించిన ‘గౌరవం’తో కథానాయకుడిగా పరిచయమయ్యాడు అల్లు శిరీష్‌. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ మూడో తనయుడైన శిరీష్‌ తన తాత అల్లు రామలింగయ్య, తండ్రి, అన్న అల్లు అర్జున్‌ నుంచి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొన్నాడు. బాలనటుడిగా హిందీలో తెరకెక్కిన ‘ప్రతిబంద్‌’తో తెరకు పరిచయ్యాడు. 1995లో ‘మాయాబజార్‌’ అనే తమిళ చిత్రంలోనూ బాలనటుడిగా మెరిశాడు. ‘గౌరవం’, ‘కొత్తజంట’ చిత్రాలు పర్వాలేదనిపించాయి. ‘శ్రీరస్తు శుభమస్తు’తో తొలి విజయాన్ని సొంతం చేసుకొన్నాడు. ‘ఒక్క క్షణం’తో నటుడిగా మరింత రాటుదేలాడు. ‘1971: బియాండ్‌ బార్డర్స్‌’ అనే సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు. అందులో మోహన్‌లాల్‌తో కలిసి నటించి శిరీష్‌ మంచి ప్రతిభని కనబరిచాడు. తెలుగులో ‘ఎబిసిడి’తో పాటు, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కిన ఓ మల్టీస్టారర్‌ చిత్రంలో సూర్య, మోహన్‌లాల్‌తో కలిసి  నటించారు. శిరీష్‌ కేవలం నటనపైనా కాకుండా నిర్మాణ వ్యవహారాల్లోనూ పాలు పంచుకొంటుంటారు. ‘గజిని’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. బుల్లితెరతోనూ శిరీష్‌కి అనుబంధం ఉంది. ఐఫా ఉత్సవం, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకుల్ని అలరించారు.

* సృజనశీలి..


బెం
గాలీ దర్శకుడు రితుపర్ణోఘోష్‌ బెంగాల్లో (ఆగస్టు 31, 1964) జన్మించారు. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, గీత రచయితగా బహుముఖంగా సృజనాత్మకత చూపారు. ఆయన తీసిన రెండో చిత్రమే (యునిషే ఏప్రిల్‌) జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. రెండు దశాబ్దాల సినీ జీవితంలో ఆయన 12 జాతీయ అవార్డులు, ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. 1963లో కోల్‌కతాలో పుట్టిన రితుపర్ణోఘోష్‌ తన 49వ (మే 30, 2013) ఏట గుండెపోటుతో మరణించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.