మే 9 (సినీ చరిత్రలో ఈరోజు)

* ప్రయోగాల దర్శకుడు

(క్రాంతి కుమార్‌ వర్థంతి)


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* బుర్ర తిరిగే సస్సెన్స్‌!


‘వర్టిగో’ అంటే ఓ విధంగా చెప్పాలంటే బుర్ర తిరగడం. మన ముందు ఉన్న వస్తువులన్నీ గిరగిరా తిరిగిపోతున్నాయనే భ్రమ కలిగే ఓ రకమైన అనారోగ్య లక్షణాన్నే ‘వర్టిగో’ అంటారు. ఈ లక్షణాన్ని కేంద్రంగా తీసుకుని 60 ఏళ్లకు పూర్వమే ‘వర్టిగో’ (1958) సినిమా తీశారు. తీసిందెవరో కాదు, ‘ఫాదర్‌ ఆఫ్‌ సస్సెన్స్‌’గా ప్రాచుర్యం పొందిన దర్శకుడు ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌. సినిమాలో ‘వర్టిగో’తో బాధపడే వ్యక్తిగా నటించింది, ప్రముఖ నటుడు జేమ్స్‌ స్టెవార్ట్‌. ఓ హత్య చుట్టూ, ఓ అనారోగం చుట్టూ కథను రసవత్తరంగా నడిపించి ప్రేక్షకులను కుర్చీల అంచుమీద కూర్చోబెట్టినంత ఉత్కంఠగా రూపొందించిన ఈ సినిమా ప్రపంచంలోనే మేటి సినిమాగా గుర్తింపు పొందింది.

కథలోకి తొంగి చేస్తే... శాన్‌ఫ్రాన్సిస్కో పోలీస్‌ డిటెక్టివ్‌ స్కాటీకి ఎత్తయిన ప్రదేశాలంటే భయం. దానికి తోడు ఎత్తు నుంచి కిందకి చూస్తే బుర్ర గిరగిరా తిరిగిపోయే ‘వర్టిగో’తో బాధ పడుతుంటాడు. ఈ కారణంగా ఉద్యోగం నుంచి విరమణ తీసుకుని తన భయాన్ని జయించే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇదంతా తెలియని అతడి కాలేజీ స్నేహితుడు, తన భార్య వింతగా ప్రవర్తిస్తోందంటూ చెప్పి, ఆమెను వెంబడిస్తూ కారణాలు తెలుసుకోమని కోరతాడు. ముందు వద్దనుకున్నా ఆ స్నేహితుడి భార్యను, ఆమె అందాన్ని చూశాక కాదనలేకపోతాడు. ఆత్మహత్య చేసుకున్న ఓ అందమైన మహిళ ఆత్మ తనను ఆవహించడంతో తను కూడా ఆత్మహత్యకు ప్రయత్నిస్తోందనేది ఆ స్నేహితుడి భయం. ఆ స్నేహితుడి భార్య పూలు కొని శ్మశానానికి వెళ్లి ఎప్పుడో 1857లో చనిపోయిన ఓ చారిత్రాత్మక మహిళ సమాధిపై పూలు ఉంచడం, తిరిగి ఓ మ్యూజియానికి వెళ్లి ఆ చారిత్రాత్మక మహిళ చిత్రపటం కేసి తదేకంగా చూడడం, ఆపై ఓ హోటల్‌కి వెళ్లడం... వీటన్నిటినీ ‘వర్టిగో’ డిటెక్టివ్‌ గమనిస్తూ ఉంటాడు. ఈ కేసు పరిశోధనలో భాగంగా ఆ చారిత్రాత్మక మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, పైగా ఆమె తన స్నేహితుడు భార్యకు ముత్తమ్మమ్మ అవుతుందని కూడా తెలుసుకుంటాడు. ఓ పక్క వర్టిగోతో బాధపడే డిటెక్టివ్‌ తన భయాలను జయించాడా? తన స్నేహితుడి భార్య ఆత్మహత్య ప్రయత్నాలను అడ్డుకోగలిగాడా? ఆమెను వెంబడిస్తూ ఏం తెలుసుకున్నాడు? చివరకి ఏమైందనేదే కథ. ఈ సినిమాను అప్పట్లో 2.5 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తెరకెక్కిస్తే, 7.3 మిలియన్‌ డాలర్లను వసూలు చేయడంతో పాటు ఎన్నో అవార్డులను అందుకుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.