అక్టోబర్‌ 20.. (సినీ చరిత్రలో ఈరోజు)

* భయంకర నటుడు!


ప్రే
క్షకులను భయపెట్టే సినిమాలెన్నో అమెరికాలో 1930ల్లో విరివిగా వచ్చాయి. అవన్నీ దెయ్యాలు, బతికొచ్చిన శవాలు, నరమాంస భక్షకులు లాంటి కథలతో ఉండేవి. అలాంటి ఎన్నో సినిమాల్లో నటించి భయపెట్టిన నటుడిగా బెలా లుగోసి గురించే చెప్పుకోవాలి. అందుకే అతడిని ‘ద కింగ్‌ ఆఫ్‌ హారర్‌’ అని పిలిచేవారు. హంగరీలో 1882 అక్టోబర్‌ 20న పుట్టిన బెలా లుగోసి 12 ఏళ్ల వయసులోనే చదువు ఆపేసి నాటక రంగాన్ని ఎంచుకున్నాడు. తరువాత నిశ్శబ్ద చిత్రాల్లో కనిపించిన ఇతడు అమెరికా వచ్చేశాడు. ఆరడుగుల ఒక అంగుళం పొడవుండే ఇతడు నాటకాలు కొనసాగిస్తూనే 1927లో ‘డ్రాకులా’గా నటించాడు. ఆ నాటకం విజయవంతమవడంతో డ్రాకులాగా 261 ప్రదర్శనలు ఇచ్చాడు. 1931లో వచ్చిన ‘డ్రాకులా’ సినిమా సూపర్‌ హిట్టయింది. ఇక ఆపై భయంకర పాత్రలు రాసాగాయి. ‘ద బ్లాక్‌ క్యాట్‌’, ‘ద రావెన్‌’, ‘సన్‌ ఆఫ్‌ ఫ్రాంకెన్‌స్టెయిన్‌’, ‘ప్లాన్‌ 9 ఫ్రమ్‌ ఔటర్‌ స్పేస్‌’, ‘ద ఇన్విజిబుల్‌ రే’, ‘బ్లాక్‌ ఫ్రైడే’... అన్నీ భయపెట్టే సినిమాలే. ఈ నట భయంకరుడు 1956 ఆగస్టు 16న తన 73వ ఏట మరణించాడు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* తెలుగులో అలరించిన మిస్టరీ...
‘ఆమె ఎవరు?’


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* క్లాసిక్‌ సినిమాల హీరో!


హా
లీవుడ్‌లో క్లాసిక్‌ సినిమాల కాలంలో ఉత్తమ నటులుగా పేరొందిన వారిలో బర్టన్‌ స్టెఫెన్‌ లాంకాస్టర్‌ ఒకడు. ‘ఎల్మర్‌ గ్యాంట్రీ’ (1960) సినిమాకు ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు అందుకోవడంతో పాటు, ‘ద బర్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ అల్కాట్రాజ్‌’, ‘అట్లాంటిక్‌ సిటీ’ సినిమాలకు బాఫ్తా పురస్కారాలు పొందాడు. నిర్మాతగా ‘ట్రెపీజ్‌’, ‘స్వీట్‌ స్మెల్‌ ఆఫ్‌ సక్సెస్‌’, ‘రన్‌సైలెంట్‌’, ‘రన్‌ డీప్‌’, ‘సెపరేట్‌ టేబుల్స్‌’ లాంటి సినిమాలు అందించాడు. 1964లో వచ్చిన ‘సెవెన్‌ డేస్‌ ఇన్‌ మే’ చిత్రంలో క్రిక్‌ డగ్లస్, ఫెడ్రిక్‌ మార్చిలాంటి హేమాహేమిలతో కలిసి నటించారు. వ్యక్తిగత జీవితంలో ముగ్గుర్ని పెళ్లి చేసుకొన్నారు. మొదటి ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో భార్య సుశాన్‌ మార్టిన్‌తో చనిపోయేంతవరకు కలిసున్నాడు. బర్టన్‌కి మొత్తం ఐదుగురు సంతానం. వారిలో ఒకరు నటుడు, రచయిత బిల్‌ లాన్‌కాస్టర్‌. బర్టన్‌ స్టెఫెన్, కే బ్రదర్స్‌ సర్కస్‌ కంపెనీలో కొన్నాళ్ల పాటు పనిచేశారు. తరువాత రెండవ ప్రపంచ యుద్ధంలో యుస్‌ తరపున మిలటరీలో స్పెషల్‌ సర్వీస్‌ డివిజన్‌లో విధులు నిర్వహించారు. న్యూయార్క్‌లో 1913 నవంబర్‌ 2న పుట్టిన బర్టన్‌ 1994 అక్టోబర్‌ 20న కాలిఫోర్నియాలో తన 80వ ఏట మరణించాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.