అక్టోబర్‌ 22.. (సినీ చరిత్రలో ఈరోజు)

* అనుకోకుండా వచ్చిన
అందాల భరిణ!
పరిణీతి చోప్రా (పుట్టినరోజు)


కజిన్స్‌ ప్రియాంక చోప్రా, మీరా చోప్రా, మన్నారా చోప్రాల బాటలో నడవకూడదనుకుంది నటి పరిణీతి చోప్రా. ‘సినిమాలేంటి? ఆ మేకప్‌లేంటి?’ అంటూ పెదవి విరిచి బ్యాంకింగ్‌ రంగంలో ఉపాధిని కోరుకుంది. అందుకు తగినట్టుగానే మాంఛెస్టర్‌ బిజినెస్‌ స్కూల్లో చేరి బిజినెస్, ఫైనాన్స్, ఎకనామిక్స్‌లో మూడు డిగ్రీలు చేసింది. తిరిగొచ్చి యష్‌రాజ్‌ చిత్ర నిర్మాణ సంస్థలో పబ్లిక్‌ రిలేషన్స్‌ విభాగంలో ఉద్యోగానికని చేరింది. కానీ వెండితెర ఆమెను ఆకర్షించడంతో 2011లో ‘లేడీస్‌ వెర్సెస్‌ రిక్కీ బల్‌’ సినిమా బాలీవుడ్‌ తెరంగేట్రం చేసి తొలి సినిమాకే ఫిలింఫేర్‌ అవార్డుకి నామినేషన్‌ అందుకోవడమే కాదు, నటిగా కూడా మార్కులు కొట్టేసింది. ఆపై ‘ఇష్క్‌జాదే’తో జాతీయ బహుమతి అందుకుంది. ‘హసీతో ఫసీ’, ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’లాంటి సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని గెల్చుకుంది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)
.........................................................................................................................................................................

హిందీలో హైదరాబాదీ విలన్‌
అజిత్‌ (వర్ధంతి)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* బ్లాక్‌బస్టర్‌ చిత్రాల నటుడు!


ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన గొప్ప చిత్రాలెన్నింటిలోనో అతడు కనిపిస్తాడు. తన గంభీరమైన నటనతో ఆకట్టుకుంటాడు. అతడే జెఫ్రీ లిన్‌ గోల్డ్‌బ్లమ్‌. పేరు వినగానే గుర్తుకు రాకపోతే, ‘జురాసిక్‌ పార్క్‌’, ‘ద ఇండిపెండెన్స్‌ డే’, ‘ద లాస్ట్‌వరల్డ్‌: జురాసిక్‌ పార్క్‌’, ‘జురాసిక్‌ పార్క్‌: ఫాలెన్‌ కింగ్‌డమ్‌’, ‘ఇండిపెండెన్స్‌ డే: రిసర్జెన్స్‌’ సినిమాలను తల్చుకుంటే చాలు. 1952 అక్టోబర్‌ 22న పుట్టిన ఈ అమెరికన్‌ నటుడు ‘ఇన్వాసన్‌ ఆఫ్‌ ద బాడీ స్నాచెర్స్‌’, ‘ద బిగ్‌ చిల్‌’, ‘ఇంటూ ద నైట్‌’, ‘ద ఫ్లై’, ‘ద టాల్‌ గై’, ‘డీప్‌ కవర్‌’, ‘ద ప్రిన్స్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌’, ‘థార్‌: రాగ్నరాక్‌’ లాంటి సినిమాలతో విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. 1974న మైకేల్‌ విన్నర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘డెత్‌ విష్‌’ చిత్రంతో వెండితెర ప్రయాణం మొదలుపెట్టి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు.

బుల్లితెరపై 1975లో ‘కొలంబో’ అనే అమెరికన్‌ టెలివిజన్‌లోనూ నటించారు. అంతటితో ఆగకుండా వెండితెర - బుల్లితెరలపై సమానంగా నటిస్తూ వచ్చారు. ప్రస్తుతం ‘ది వరల్డ్‌ అకార్డింగ్‌ టు జెఫ్‌ గోల్డ్‌బమ్‌’ అనే కార్యక్రమానికి ప్రెజెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతేకాక 2021లో వచ్చే ‘వాట్‌ ఇఫ్‌..?’ అనే టీవీ సీరిస్‌కి గ్రాండ్‌మాస్టర్‌కి గొంతు అరువిస్తూనే, అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఇంతటి పేరు సంపాదించిన గోల్డ్‌బ్లమ్‌ వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. మొదటగా పాట్రిక గౌల్‌ అనే ఆమెను 1980లో పెళ్లి చేసుకొన్నారు. 1986లో విడాకులు తీసుకున్నారు. మరుసటి సంవత్సరం నటి, నిర్మాత, మోడల్‌ అయిన గీనా డేవిస్‌ని 1987లో వివాహం చేసుకున్నాడు. మూడు సంవత్సరాలు సవ్యవంగా సాగిన వీరికాపురం 1990నాటికి బీటలువారాయి. గత కొద్దికాలంగా అంటే 2014 నుంచి డ్యాన్సర్, కార్టూనిస్టు అయిన ముఫ్పైఆరేళ్ల ఎమిలి లివింగ్‌ష్టని పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నాడు. ప్రస్తుతం జెఫ్రీ 2021న రాబోయో ‘జురాసిక్‌ వరల్డ్‌3’లో డాక్టర్‌ లాన్‌ మాల్కోమ్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈరోజు జెఫ్రీ లిస్‌ గోల్డ్‌బ్లమ్‌ పుట్టినరోజు.

* ఓ అమ్మాయి స్వేచ్ఛ కథ


పెద్దల పెంపకం, పిల్లల స్వేచ్ఛ కొన్ని పరిమితులకు లోబడి ఉంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. అవి అదుపు తప్పితే విపరిమాణాలు తలెత్తుతాయి. ఈ అంశాన్ని హత్తుకునేలా తెలియజేసిన సినిమా ‘నౌ వాయేజర్‌’ (1942). అమెరికాలో ‘టాప్‌ లవ్‌ స్టోరీస్‌’లో ఒకటిగా పేరు పొందింది. ఆరు దశాబ్దాల పాటు సినీ రంగంలో గొప్ప నటిగా ప్రాచుర్యం పొందిన బెట్టీ డేవిస్‌ ప్రధాన పాత్రలో ఇర్వింగ్‌ ర్యాపర్‌ దర్శకత్వంలో వచ్చిన ఇది, ‘వందేళ్లు... వంద మేటి సినిమాలు’ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ప్రేక్షకాదరణతో పాటు అవార్డులు అందుకుంది. అమెరికా రచయిత్రి ఆలివ్‌ హగిన్స్‌ ప్రౌటీ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఆ నవల గొప్ప మనో విశ్లేషణాత్మకమైనదిగా పాఠకాదరణ పొందింది. తల్లి ఆంక్షలు, తిట్ల వల్ల ఆత్మవిశ్వాసం లేకుండా పెరిగన ఓ అమ్మాయి, తన స్వేచ్ఛను కాపాడుకోవడం కోసం ఏం చేసిందనేది కథ. తల్లి అహంకార పూరితమైన పెంపకం వల్ల డిప్రెషన్‌కు గురైన అమ్మాయిని వైద్యుడి సలహా మేరకు ఓ శానిటోరియంలో చేరుస్తారు. అక్కడ తల్లి ఆంక్షలేవీ లేకపోవడంతో ఆత్మవిశ్వాసాన్ని పుంజుకుని చలాకీ అమ్మాయిగా మారుతుంది. తిరుగు ప్రయాణంలో ఓ ఓడలో ప్రయాణిస్తూ ఓ వ్యక్తి ప్రేమలో పడుతుంది. ఇంటికి రాగానే తనను తిరిగి పరిమితుల పంజరంలో బందీ చేయాలనుకున్న తల్లికి ఎదురు తిరుగుతుంది. ఆ ఘర్షణ వల్ల తల్లి గుండెపోటుకు గురై మరణించడంతో పశ్చాత్తాప పడుతుంది. తిరిగి శానిటోరియంలో చేరి జీవితం పట్ల సరైన దృక్పథంతో పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటుంది. తన ప్రేమతో పాటు జీవితాన్ని కూడా తీర్చిదిద్దుకుంటుంది. తరాల మధ్య అంతరాలను, సంఘర్షణను చర్చనీయాంశంగా తీసుకుని మనోవిళ్లేషణాత్మకంగా తీసిన ఈ సినిమా, తల్లితండ్రులనూ పిల్లలనూ కూడా బాగా ఆకట్టుకుంది.

* విజృంభించిన థోర్‌


సూపర్‌ హీరోలంటే అంతే... అతీత శక్తులతో అద్భుతాలూ చేయగలరు, బాక్సాఫీసును బద్దలుకొట్టి డాలర్ల వర్షాన్నీ కురిపించగలరు. అందుకనే హాలీవుడ్‌లో వాళ్లదే హవా. కామిక్‌ పుస్తకాల నుంచి, టీవీలు, సినిమాలు, ఆట బొమ్మలు, వీడియోగేమ్స్‌ క్యారెక్టర్లు... ఇలా అన్ని చోట్లా కనిపిస్తూనే ఉంటారు, సందడి చేస్తూ ఉంటారు. అలాంటి సూపర్‌హీరోల్లో థోర్‌ కూడా ఒకడని తెలుసుగా? గ్రీకు పురాణాల్లో అస్గార్డ్‌ లోకంలో ఉండే పిడుగు దేముడు. తుపానులు, మెరుపులు, పిడుగులను ఉన్నట్టుండి సృష్టించగలడు. సూపర్‌మ్యాన్‌లాగా గాలిలో ఎగరగలడు కూడా. తన ఆయుధమైన పెద్ద సుత్తిని పట్టుకుని దుండగులపై విరుచుకుపడగలడు. అలాంటి థోర్‌ శక్తులను నమ్ముకుని తీసిన సినిమా ‘థోర్‌: ద డార్క్‌ వరల్డ్‌’ (2013). ఇది అంతకుముందు 2011లో వచ్చిన ‘థోర్‌’ సినిమాకు సీక్వెల్‌. క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ థోర్‌గా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 644.6 మిలియన్‌ డాలర్లను కురిపించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘థోర్‌: రగ్నరాక్‌’ అనే సినిమా 2017లో వచ్చింది. అంతేకాదు మరో సీక్వెల్‌గా ‘థోర్‌: లవ్‌ అండ్‌ థండర్‌’ సినిమా 2021, నవంబర్‌ 5న విడుదల కానుంది.

* క్లాసిక్‌ కథానాయిక 


హాలీవుడ్‌లో చిరకాలం గుర్తుంచుకోదగిన క్లాసిక్‌ సినిమాలు వచ్చిన కాంలో అయిదు దశాబ్దాల పాటు నటిగా అలరించిందామె. ప్రపంచవ్యాప్తంగా గొప్పవిగా ప్రాచుర్యం పొందిన కొన్ని సినిమాల్లో మరిచిపోలేని పాత్రలతో ఆకట్టుకుంది. ఆమే... జోన్‌ ఫాంటైన్‌. సస్పెన్స్‌ సినిమాలకు పేరొందిన ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ సినిమాల్లో నటించి ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకుంది. ఈమె సోదరి ఒలివియా హవిలాండ్‌ కూడా నటిగా రాణించింది. ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ కలిసి ఎక్కువ ఆస్కార్లు అందుకున్న సహోదరులుగా గుర్తింపు పొందారు.

కాలిఫోర్నియాలో 1917 అక్టోబర్‌ 22న పుట్టిన జోన్‌ డె బ్యూవాయిర్‌ డె హవిలాండ్, వెండితెరపై జోన్‌ ఫాంటైన్‌గా పేరొందింది. ‘ద మ్యాన్‌ హూ ఫౌండ్‌ హిమ్‌సెల్ఫ్‌’ (1937), ‘గుంగాదిన్‌’ చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ తీసిన ‘రెబెక్కా’ సినిమాతో స్టార్‌డమ్‌ అందుకుంది. హిచ్‌కాక్‌ మరో సినిమా ‘సస్పిషన్‌’ సినిమాకు ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది. ‘ద కాన్‌స్టంట్‌ నింఫ్‌’, ‘లెటర్‌ ఫ్రమ్‌ ద అన్‌నోన్‌ ఉమన్‌’, ‘వోయేజ్‌ టుది బాటమ్‌ ఆఫ్‌ ద సీ’, ‘ద విచెస్‌’, ‘కాలిట్‌ ఎ డే’, ‘నోమోర్‌ లేడీస్‌’, ‘ఎ మిలియన్‌ టు వన్‌’ లాంటి సినిమాలతో మంచి నటిగా నిరూపించుకుంది. నాటక రంగం, రేడియో, టెలివిజన్‌ రంగాల్లో కూడా ఆమె తనదైన ముద్ర వేసింది. తన ఆత్మకథను ‘నో బెడ్‌ ఆఫ్‌ రోజెస్‌’ పేరుతో వెలువరించింది. ఇంగ్లిషు దంపతులకు జపాన్‌లో పుట్టిన ఈమె తల్లి ప్రోద్బలంతో నటనవైపు దృష్టి సారించింది. తల్లి కూడా నటి కావడంతో చిన్న వయసులోనే నాటకాలతో పేరు తెచ్చుకుంది. అందాల తారగా, హుందా అయిన అభినేత్రిగా అంచెలంచెలుగా ఎదిగింది.

............................................................................................................................................................. 

* చిత్రమైన భావాలు
ఖాదర్‌ (జయంతి)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.