సెప్టెంబర్‌ 16.. (సినీ చరిత్రలో ఈరోజు)

ఆయన సేవలు నిరుపమానం!
తమ్మారెడ్డి కృష్ణమూర్తి 
(వర్థంతి-2013)


చి
త్ర పరిశ్రమ ‘పెద్దాయన’ అని గౌరవంగా పిలుచుకున్న వ్యక్తి తమ్మారెడ్డి కృష్ణమూర్తి. ప్రభుత్వం నుంచి ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ అందుకున్న వ్యక్తి ఆయన. యువకుడిగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న ఆవేశం ఆయనది. నిర్మాతగా సందేశాత్మక చిత్రాలు అందించిన ఆదర్శం ఆయనది. మద్రాసు నుంచి చిత్రపరిశ్రమ హైదరాబాద్‌ తరలి రావడానికి కృషి చేసింది ఆయనే. హైదరాబాద్‌లో ‘ఫిలింనగర్‌’ వ్యవస్థాపకులు ఆయనే. ఈరోజు ఆయన వర్థంతి.. ఈ సందర్భంగా ఆ మహనీయుని గురించి...

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

కలతలు మాపిన కవలల కథ!


మ్మానాన్న కలతలతో విడిపోతే... ఇద్దరు కవలలు తల్లడిల్లి... ‘పొరుగువారి పాపలాగ పెట్టిపుట్టలేదులే... అమ్మతో నాన్నతో హాయి నోచుకోములే...’ అంటూ బాధపడి, చివరకి ఇద్దరూ కలిసి... ఒకరి స్థానంలోకి మరొకరు ప్రవేశించి అమ్మానాన్నల్ని మార్చి... ఎలా ఒకటి చేశారు? ఈ కథతో వచ్చిన ‘లేత మనసులు’ సినిమా అందరి మనసులను ఆకర్షించింది, అలరించింది. పిల్లల మనస్తత్వాలు, పెద్దల తారతమ్యాలు, పట్టుదలల మధ్య నలిగిపోయే ప్రేమల విలువలతో ఆసక్తికరంగా సాగిపోయే ఈ కథ, అటు హాలీవుడ్‌ నుంచి ఇటు తమిళ, తెలుగు భాషల వరకు విజయవంతమై... కుటుంబ బంధాలనేవి ఏ దేశంలోనైనా ఒకటేనని చాటి చెప్పింది. మరి ఈ సినిమా వివరాలు తెలుసుకుందామా?

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

మరువలేని సుత్తి!
సుత్తివేలు (వర్థంతి-2012)


కు
రుమద్దాలి లక్ష్మీ నరసింహారావు - నవతరం ప్రేక్షకులకు ఈ పేరు చెబితే ఆయనెవరు అనే వాళ్లే ఎక్కువ. అదే సుత్తివేలు అంటే మాత్రం ఎవ్వరైనా గుర్తుపడతారు. హాస్య ప్రధానమైన పాత్రలతో ఒక తరం ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన నటుడు సుత్తివేలు. 1947 ఆగస్టు 7న మచిలీపట్నం సమీపంలో భోగిరెడ్డి పల్లిలో జన్మించారు. చిన్నప్పుడు సన్నగా ఉండేవారు. దాంతో ఆయన పిన్ని జానకాంబ ‘వేలు’ అని పిలిచేవారు. నటుడు అయ్యాక ‘నాలుగు స్తంభాలాట’లో సుత్తి అనే పాత్రని పోషించారు. అప్పట్నుంచి ఆయన పేరు సుత్తివేలు అయ్యింది. 200 పైచిలుకు చిత్రాలతో పాటు, టెలివిజన్‌ ధారావాహికల్లో నటించిన సుత్తివేలు నాలుగు నంది పురస్కారాలు సొంతం చేసుకొన్నారు. చిన్నప్పట్నుంచి నాటకాలపై మక్కువ పెంచుకొన్న ఆయన స్నేహితులతో కలిసి నాటకాల్లో అభినయించేవారు. 1981లో విశాఖ డాక్‌ యార్డులో ఉద్యోగం రావడంతో తన మకాంని బాపట్ల నుంచి విశాఖకి మార్చారు. తీరిక వేళల్లో నాటకాలు వేసేవారు. ‘మనిషి నూతిలో పడితే’ అనే నాటకంలో ఆయన పాత్రని చూసిన జంధ్యాల, ‘ముద్దమందారం’ సినిమాలో రిసెప్షనిస్టు పాత్రని ఇచ్చారు. ఆ తర్వాత జంధాల్య చిత్రాల్లోనే ‘మల్లెపందిరి’, ‘నాలుగు స్తంభాలాట’లో పాత్రలు దక్కాయి. ఆ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో సుత్తివేలు ఉద్యోగం పోగొట్టుకొన్నారు. ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా భావించి ‘ఆనంద భైరవి’, ‘రెండు జెళ్ళ సీత’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘చంటబ్బాయి’ తదితర విజయవంతమైన చిత్రాల్లో హాస్య ప్రధానమైన పాత్రలు పోషించారు. ‘త్రిశూలం’ చిత్రం తర్వాత అవకాశాలు తగ్గినా టి.కృష్ణ వరుసగా తన చిత్రాల్లో అవకాశాలు ఇవ్వడంతో విభిన్నమైన పాత్రల్లో నటించేందుకు ఆస్కారం లభించింది. ‘వందేమాతరం’, ‘ప్రతిఘటన’, ‘కలికాలం’, ‘ఒసేయ్‌ రాములమ్మ’ చిత్రాల్లో సుత్తివేలు పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ‘వందేమాతరం’ చిత్రానికిగానూ ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు సుత్తివేలు. ‘దేవాలయం’, ‘గీతాంజలి’, ‘మాస్టారి కాపురం’ చిత్రాలకిగానూ ఉత్తమ హాస్యనటుడిగా పురస్కారాలు స్వీకరించారు. సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు కలిసి నటించారంటే ఇక ఆ సినిమాలో నవ్వులు గ్యారెంటీ అనుకొనేవారు అప్పట్లో. ఆనందో బ్రహ్మ, లేడీ డిటెక్టివ్‌ ధారావాహికలు సుత్తివేలుకి మంచి పేరు తీసుకొచ్చాయి. లక్ష్మీరాజ్యంతో సుత్తివేలు వివాహం జరిగింది. వీరికి ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. అనారోగ్యంతో బాధపడుతూ 2012, సెప్టెంబరు 16న మద్రాసులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

(మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి...)

చిత్రోత్సవాల్లో చప్పట్లు!


సినిమాను విడుదలకు ముందే అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. అందులో ఏమీ విశేషం కినిపించకపోవచ్చు కానీ, ప్రదర్శించిన ప్రతి చోటా ప్రేక్షకులు ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’ (గౌరవసూచకంగా అందరూ ఒకేసారి లేచి నిలబడి చప్పట్లు కొట్టడం) ఇవ్వడం మాత్రం విశేషమే. ఆ సినిమానే అమెరికన్‌ యాక్షన్‌ డ్రామా ‘డ్రైవ్‌’. రచయిత జేమ్స్‌ శాలిస్‌2005లో రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమాకు నికొలాస్‌ వైండింగ్‌ రెఫిన్‌ దర్శకత్వం వహించాడు. 2011 సెప్టెంబర్‌ 16న విడుదలైన సినిమాను 15 మిలియన్‌ డాలర్లతో తీస్తే 78 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.