సెప్టెంబర్‌ 20... (సినీ చరిత్రలో ఈరోజు)

* అభినయం... వ్యక్తిత్వం...
కలబోసిన మహామనీషి!
 అక్కినేని (జయంతి) 


ఓ జానపద నాయకుడు... ఓ చిలిపి స్నేహితుడు... ఓ ఆదర్శవాది... ఓ మహా భక్తుడు... ఓ ప్రేమ పిపాసి... ఓ భగ్న ప్రేమికుడు... ఓ అతితెలివి కవి... ఓ మహా పండి తుడు... ఓ గొప్ప కళాకారుడు... ఓ సమాజ ప్రేమికుడు... ఓ ఉన్నత ఆలోచనా పరుడు...
ఏం చెప్పాలి అక్కినేని నాగేశ్వరరావు గురించి!
ఏ పాత్రని గుర్తు చేసుకోవాలి ఆయన నటనా వైదుష్యం గురించి!!
ఏ గుణగణలు ఉదహరించాలి ఆ మహామనీషి గురించి!!!
ఓ దాదా సాహెబ్‌ ఫాల్కే, ఓ పద్మవిభూషణ్‌ లాంటి అవార్డులు అక్కినేనిని వరించి వచ్చి మురిసిపోయాయి. ఎన్నో పురస్కారాలు, అవార్డులు ఆయనని సత్కరించుకుని తీపి గురుతులను నగిషీలుగా చెక్కుకుని తళుకులీనాయి. అన్నింటినీ మించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోలేని ప్రేమాభిమానాలు, అక్కినేనికి అగ్రపీఠం వేసి స్వర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టాయి. కృష్ణాజిల్లా రామాపురం నుంచి నాటక రంగాన్ని మురిపించి, వెండితెరను అలరించి, ఎన్నో పాత్రలను మెరిపించి చిరస్మరణీయ ఖ్యాతిని అందుకున్న అక్కినేని శకం, తెలుగు చలన చిత్ర చరిత్రలో సువర్ణాధ్యాయం. 1924 సెప్టెంబర్‌ 20న పుట్టి,  జనవరి 22, 2014న మరణించిన అక్కినేని జీవితం, ఆద్యంతం స్ఫూర్తిదాయకం! అనునిత్యం స్మరణీయం!!

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* కష్టాల కొలిమి నుంచి...
కాసుల లోకంలోకి!


నాన్న పెళ్లి చేసుకోని అమ్మకు పుట్టిన అమ్మాయి...
మురికి వాడల్లో పూట గడవని రోజులు చూసిన అమ్మాయి...
తనను పెంచడానికి అమ్మ పడుతున్న కష్టాలు తెలిసిన అమ్మాయి...
పేదరికం అగచాట్లు ఓర్చుకుంటూ పెరిగిన అమ్మాయి... అలాంటి ఆమె...
- ప్రపంచంలోనే అందాల రాశిగా పేరుతెచ్చుకుంది! హాలీవుడ్‌లో మంచి నటిగా కీర్తి గడించింది! చక్కని గాయనిగా శ్రోతలను ఉర్రూతలూగించింది! ఆస్కార్, గ్రామీ సహా
ఎన్నో అవార్డులు గెలుచుకుంది! .. ఆ అమ్మాయే సోఫియాలారెన్‌.


ఇæలీలోని ప్యారిస్‌లో 1934 సెప్టెంబర్‌ 20న పుట్టిన సోఫియా విల్లని సికోలోన్, ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సోఫియాలారెన్‌గా మారడానికి మధ్య ఎన్నో బాధలు, వ్యధలు, కన్నీళ్లు ఉన్నాయి. అమ్మ రోమిల్డాతో ఇద్దరు పిల్లలు పుట్టేవరకూ సహజీవనం చేసిన నాన్న, పెళ్లి చేసుకోకుండా వదిలి వెళ్లిపోవడం వల్ల సోఫియా బాల్యమంతా దిగులుగానే గడిచింది. అమ్మమ్మ మద్యం, చిరుతిళ్లు అమ్మే చిన్న దుకాణంలో, అమ్మ పియానో వాయిస్తుంటే అక్క మాæలు పాడేది. సోపియా టేబుల్స్‌ క్లీన్‌ చేసి, గిన్నెలు తోముతుండేది. అలాంటి పరిస్థితుల్లో పదహారేళ్లకల్లా అందమైన రూపం సోఫియాకు వరమైంది. భవిష్యత్తుకు బంగారు బాæలు పరిచింది. సరదాగా అందాల పోటీకి వెళితే ‘మిస్‌ ఎలిగెన్స్‌’ టైటిల్‌ గెలుచుకుంది. మురికివాడలో మెరిసిన అందం ప్రపంచాన్ని ఆకర్షించింది. వెండితెర ఆమెకు స్వాగతం పలికింది. మొదట్లో చిన్న, చితక వేషాలు వేసిన సోఫియా పేరమౌంట్‌ సంస్థ దృష్టిలో పడ్డాక అంతర్జాతీయ తారగా ఎదిగింది. ‘ద ప్రైడ్‌ అండ్‌ ద ప్యాసన్‌’, ‘హౌస్‌బోట్‌’, ‘ఇట్‌ స్టార్టెడ్‌ ఇన్‌ నేపిల్స్‌’ లాంటి సినిమాలు ఆమెలోని నటికి, అందానికి కూడా చాటింపు వేశాయి. ఇటాలియన్‌ చిత్రం ‘టు ఉమెన్‌’ సినిమాలో నటనకు సోఫియా ఆస్కార్‌ అవార్డు అందుకుంది. ఇటాలియన్‌ ఉత్తమ నటిగా ఆరుసార్లు అవార్డులు అందుకుంది. అమెరికన్‌ చిత్రాలైన ‘గ్రంపియర్‌ ఓల్డ్‌ మెన్‌’, ‘నైన్‌’ లాంటి చిత్రాలు ఆమె ఇంటి ముందు నిర్మాతలు క్యూకట్టేంత పేరు తెచ్చిపెట్టాయి. మరో పక్క గాయనిగా గ్రామీ అవార్డు, నటిగా అయిదు గోల్డెన్‌గ్లోబ్, బాఫ్తా, లారెల్, వోల్పికప్, జీవనసాఫల్య అవార్డులు ఎన్నో సాధించింది. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో సోఫియా చిత్రాలు ప్రధాన ఆకర్షణగా మారాయి. అమెరికన్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌ ‘వంద ఏళ్లు... వంద తారలు’ జాబితాలో చోటు సంపాదించింది. ఆ జాబితాలో జీవించి ఉన్న ఏకైన సెలబ్రిటీ ఆమే. ఆమెకిప్పుడు 86 ఏళ్లు.

* నవ్వుల వరం!
 ధర్మవరపు  (జయంతి-1954)


ఆయన తెరపై కనిపించగానే నవ్వొస్తుంది. శరీర భాష, చూపులు, ముఖకవలికలు చాలు... ప్రేక్షకుల పెదవులపై నవ్వులు పూయించడానికి. ఇక డైలాగ్‌ చెబితే, ఆ విరుపు వినగానే ఫక్కున నవ్వాల్సిందే. ఆయనే ధర్మవరపు సుబ్రహ్మణ్యం. నాటక రంగంలో నవించి, బుల్లితెరను బులిపించి, వెండితెరపైకి వచ్చి చక్కిలిగింతలు పెట్టిన నటుడు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఆనందోబ్రహ్మ’ హాస్య కదంబంతో ఇంటింటికీ పరిచయమైన ధర్మవరపు, 1954 సెప్టెంబర్‌ 20న ప్రకాశం జిల్లా కొమ్మినేనివారిపాలెంలో పుట్టాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే, అమ్మ పోరు పడలేక డిగ్రీ అయిందనిపించినా మనసంతా నటన మీదే. హైదరాబాద్‌లోని పంచాయితీ రాజ్‌ శాఖ అధికారిగా ఉద్యోగంలో చేరినా అదే తంతు. ఆకాశవాణి, టీవీలకు నాటకాలు పంపడం, వీలున్నప్పుడల్లా వేయడం. దూరదర్శన్‌లో తొలి తెలుగు ధారావాహిక ‘అనగనగా ఒక శోభ’ను ప్రారంభించినది ఆయనే. తరువాత ‘మనసు గుర్రం.. లేదు కళ్లెం’, ‘పరమానందయ్య శిష్యుల కథ’, ‘ఆనందో బ్రహ్మ’ ఆయనకు వెండితెరకు సోపానాలు పరిచాయి. జంధ్యాల తీసిని ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో వెండితెరపైకి వచ్చి అనేక పాత్రలతో నవ్వించాడు. నవ్వుల ప్రపంచంలో వినూత్న పంథాను అనుసరించిన ధర్మవరపు, 2013 డిసెంబర్‌ 7న హైదరాబాద్‌లో మరణించారు. ఈరోజు నవ్వులరాజు ధర్మవరపు జయంతి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ఆయన జీవితానుభవాలే...
దృశ్య కావ్యాలు!
 మహేష్‌ భట్‌ (పుట్టినరోజు-1948)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.