సెప్టెంబర్‌ 23 (సినీ చరిత్రలో ఈరోజు)...

* బావలు సయ్యా...
సిల్క్‌ స్మిత (వర్థంతి-1996)


వెం
డితెరపై మెరిసిన అందాల తారలు ఎంతోమంది. వారిలో సిల్క్‌ స్మిత ప్రత్యేకం. స్టార్‌ హీరోల్ని మించిన క్రేజ్‌ ఆమెది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రెండు వందలకిపైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులపై తనదైన ముద్ర వేశారు. ప్రత్యేకమైన ఆమె అందాన్ని చూడటం కోసమే అప్పట్లో ప్రేక్షకులు థియేటర్లకి వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో 1960, డిసెంబరు 2న జన్మించిన సిల్క్‌స్మిత అసలు పేరు విజయలక్ష్మి. నాలుగో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పిన ఆమె సినీ నటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని అత్త ఇంటికి చేరింది. స్మిత అని పేరు మార్చుకొని, తమిళంలో ‘వండి చక్రం’ అనే చిత్రం చేసింది. 1979లో విడుదలైన ఆ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్‌. ఆ చిత్రం పాత్ర ప్రేక్షకాదరణ పొందడంతో స్మిత కాస్త సిల్క్‌ స్మితగా మారిపోయారు. శృంగార తారగా ఎదిగిన ఆమె ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే ప్రత్యేక గీతాల్లో ఎక్కువగా ఆడిపాడారు. అందంతో పాటు, అభినయంతోనూ ఆమె ప్రేక్షకుల మనసుని చూరగొన్నారు. 1981లో విడుదలైన ‘సీతాకోకచిలుక’ చిత్రంలో సిల్క్‌ అభినయం ఆకట్టుకుంది. ‘లయనం’, ‘వసంత కోకిల’ చిత్రాల్లో నటనతో సిల్క్‌స్మిత మంచి పేరు తెచ్చుకొన్నారు. తెలుగులో ‘యమకింకరుడు’, ‘ఖైదీ’, ‘మెరుపుదాడి’, ‘శ్రీదత్త దర్శనం’, ‘పాతాళ భైరవి’, ‘ఖైదీ నంబర్‌ 786’, ‘గీతాంజలి’, ‘ఆదిత్య 369’, ‘కుంతీపుత్రుడు’, ‘అలీబాబా అరడజను దొంగలు’, ‘బావ బావమరిది’, ‘మా ఆవిడ కలెక్టర్‌’, ‘కిష్కిందకాండ’... ఇలా ఆమె ఎన్నో చిత్రాల్లో ఆడిపాడి ప్రేక్షకుల్ని మురిపించారు. ‘బావ బావమరిది’ చిత్రంలో బావలు సయ్యా... అంటూ సిల్క్‌స్మిత చేసిన హంగామా ఆ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ పాట ఇప్పటికీ వినిపిస్తుంటుంది. అవివాహిత అయిన సిల్మ్‌స్మిత 1996 సెప్టెంబరు 23న మద్రాసులోని తన సొంతింట్లో విగతజీవిగా పడిపోయారు. చిత్రనిర్మాణ ప్రయత్నాల్లో ఉన్న ఆమె నష్టాలపాలవడంతో పాటు, ప్రేమ వ్యవహారాలతో ఆమె ఆత్మహత్య చేసుకుందనే అభిప్రాయాలు వినిపించాయి. సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్‌’ సంచలన విజయం సొంతం చేసుకొంది. ఈరోజు సిల్క్‌స్మిత వర్ధంతి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

క్విట్‌ ఇండియా ఉద్యమంలో... 
దర్శకుడు కె.బి.తిలక్‌ (వర్థంతి-2010)


మాజంలో మార్పు కోసం, చైతన్యం కోసం అభ్యుదయ భావాలతో చిత్రాల్ని తీసిన అగ్ర దర్శకుడు కె.బి.తిలక్‌. ‘ముద్దుబిడ్డ’, ‘ఎమ్‌.ఎల్‌.ఎ’, ‘అత్తా ఒకింటి కోడలే’, ‘చిట్టి తమ్ముడు’, ‘ఈడు జోడు’, ‘భూమికోసం’ తదితర చిత్రాలు తెరకెక్కించి విజయాల్ని అందుకొన్నారు. కె.బి.తిలక్‌ పూర్తి పేరు కొల్లిపర బాలగంగాధర తిలక్‌. జనవరి 14, 1926లో పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరులో జన్మించారు. తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. ఏలూరులో చదివేటప్పుడు తిలక్‌ కూడా స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942లో జైలుకి వెళ్లారు. ఆ తరువాత ప్రజానాట్యమండలిలో పనిచేశారు. మేనమామలు ఎల్వీ ప్రసాద్, అక్కినేని సంజీవిల ప్రోత్సాహంతో మొదట కొన్ని సినిమాలకి ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తరవాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసి స్వీయ దర్శకత్వంలో చిత్రాల్ని నిర్మించారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళంలోనూ చిత్రాల్ని తెరకెక్కించారు. ఆయన తెలుగులో తెరకెక్కించిన చివరి చిత్రం ‘ధర్మవడ్డీ’. 2008లో బి.ఎన్‌.రెడ్డి జాతీయ పురస్కారం అందుకొన్నారు తిలక్‌. ప్రముఖ నటి జయప్రదని వెండితెరకి పరిచయం చేసిన ఘనత ఈయనదే. యు.విశ్వేశ్వరరావు దర్శకత్వం వహించి నిర్మించిన ‘నగ్నసత్యం’ సినిమాలో ఓ పాత్రలో నటించారు. సెప్టెంబరు 23, 2010లో తుదిశ్వాస విడిచారు కె.బి.తిలక్‌. ఈ రోజు ఆయన వర్ధంతి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

అపరాధ పరిశోధనలో
చక్రపాణీయం ‘సి.ఐ.డి’


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* తొలి ఆస్కార్‌ వేడుకల్లో...
తొలి అవార్డు!


నిశ్శబ్ద చిత్రాల్లోనే అతి గొప్ప చిత్రం...

సినీ చరిత్రలో మాస్టర్‌పీస్‌గా పేర్కొనదగిన చిత్రం...

అమెరికాలో నిర్మించిన వంద గొప్ప చిత్రాల జాబితాలో ఒకటి...

- ఇలా ఎన్నో ప్రశంసలు అందుకున్న సినిమా ‘సన్‌రైజ్‌: ఎ సాంగ్‌ ఆఫ్‌ టు హ్యూమన్స్‌’. రచయిత హెర్మన్‌ సుడీమాన్‌ రాసిన కథల సంపుటిలోని ఓ కథ ఆధారంగా తీసిన ఈ సినిమా ఓ దృశ్యకావ్యం లాంటిదని అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 1929లో జరిగిన తొలి ఆస్కార్‌ వేడుకల్లో ‘యునీక్‌ అండ్‌ ఆర్టిస్టిక్‌ పిక్చర్‌’ అవార్డును పొందింది. ఇందులో నటించిన జానెట్‌ గేనర్‌ ఆస్కార్‌ అవార్డు అందుకున్న తొలి హీరోయిన్‌గా నిలిచింది. సినీమాటోగ్రఫీకి కూడా ఆస్కార్‌ అందుకుందీ సినిమా. అమెరికా ప్రభుత్వం ఈ సినిమాను భద్రపరిచింది. తరువాతి రోజుల్లో దీన్ని డీవీడీలుగాను, బ్లూరేలుగాను మార్చి అమ్మారు. 2014లో ఈ సినిమాను తిరిగి విడుదల చేశారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

రైలు దొంగల కథ


మెరికాలో ఒకప్పుడు ఓ దొంగల ముఠా రైళ్లు, బ్యాంకుల దోపిడీలతో ఠారెత్తించింది. తెలివిగా, సాహసంతో దొంగతనాలు చేసే ఆ ముఠా గురించిన అంశాల చుట్టూ కథను అల్లుకుని తీసిన సినిమా ‘బచ్‌ కాసిడీ అండ్‌ ద సన్‌డ్యాన్స్‌ కిడ్‌’ (1969). ప్రముఖ నటులు పాల్‌ న్యూమన్, రాబర్డ్‌ రెడ్‌ఫోర్డ్‌ నటించిన ఈ చిత్రానికి జార్జి రాయ్‌హిల్‌ దర్శకత్వం వహించాడు. తుపాకులు, గుర్రపు స్వారీలు, బాంబు పేలుళ్లతో ఉత్కంఠభరితంగా తీసిన ఈ సినిమా 6 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 102 మిలియన్‌ డాలర్లకు పైగా ఆర్జించింది. అమెరికాలో ‘వందేళ్లు... వంద మేటి సినిమాలు’ జాబితాలో చోటు సంపాదించింది. నాలుగు ఆస్కార్‌ అవార్డులు సాధించింది. ఆరు బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డులు సహా మరెన్నో పురస్కారాలు పొందింది.

* ఓ అమాయకుడి జైలు జీవితం


హా
యిగా బ్యాంకు ఉద్యోగం చేసుకుంటూ సౌకర్యవంతంగా జీవిస్తున్న ఓ మామూలు వ్యక్తి అనుకోకుండా జైలు పాలయితే ఏమవుతుంది? బయట మర్యాదస్తుడిగా, మెత్తని మనిషిగా పేరుతెచ్చుకున్న అతడు జైలులో కరడుకట్టిన ఖైదీల మధ్య, కఠోర నిబంధనల మధ్య ఎలా గడపాల్సి వస్తుంది? ఈ కథాంశం నేపథ్యంలో తీసిన సినిమా ‘ద షాషంక్‌ రెడెంప్షన్‌’ (1994). అమెరికా రచయిత స్టీఫన్‌ కింగ్‌ రాసిన ‘రీటా హేవర్త్‌ అండ్‌ షాషంక్‌ రెడెంప్షన్‌’ అనే నవల ఆధారంగా తీసిన ఈ సినిమా ఏడు ఆస్కార్‌ అవార్డులకు నామినేషన్‌ పొందడంతో పాటు, రెండు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు, మరెన్నో పురస్కారాలు పొందింది. బ్యాంకు ఉద్యోగం చేసుకునే యాండీ కథగా ఇది ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో తన భార్య, ప్రియురాళ్లను హత్య చేశాడనే అభియోగంపై జీవిత ఖైదుకు గురవుతాడు. అయితే జైలులో తోటి ఖైదీలతో అతడి ప్రవర్తన, మంచితనం కారణంగా పేరోల్‌ మీద బయటకి వస్తాడు. ప్రముఖ నటులు టిమ్‌ రాబిన్స్, మోర్గాన్‌ ఫ్రీమన్‌ తదితరులు నటించిన ఈ సినిమాకు ఫ్రాంక్‌ డారాబాంట్‌ దర్శకత్వం వహించాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.