ఆగస్టు 27.. (సినీ చరిత్రలో ఈరోజు)
* బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించిన సినిమా! (రైతుబిడ్డ విడుదల-1939)


జమీందారీ వ్యవస్థపై జమిందార్లే తీసిన సినిమా...
రైతుల కష్టాలకు అద్దం పట్టిన సినిమా...
బ్రిటిష్‌ ప్రభుత్వం ఆగ్రహానికి గురైన సినిమా...
-అదే ‘రైతుబిడ్డ’. సినిమా మాధ్యమం ఎంత బలమైనదో చాటి చెప్పిన ఈ సినిమాను చల్లపల్లి జమిందారు నిర్మిస్తే, సంచలన దర్శకుడిగా పేరొందిన గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించారు. అలనాటి కాలంలోనే చర్చనీయాంశంగా మారిన ఈ సినిమా సంగతులేంటో చూద్దాం.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)
* జాతీయ అవార్డు... ‘ఏ’ సర్టిఫికెట్టు! (‘మనసులు మమతలు’ విడుదల-1965)


తెలుగులో తొలిసారి ‘పెద్దవారికి మాత్రమే’ సర్టిఫికెట్‌ పొందిన చిత్రం...
జాతీయ స్థాయిలో బహుమతి అందుకున్న చిత్రం...
ఎఎన్నార్‌, సావిత్రి, జయలలిత, జగ్గయ్య తదితరులు నటించిన చిత్రం...
అదే ‘మనుషులు మమతలు’. ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలేంటో తెలుసుకుందామా?

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)
* అందాల నేహా... సంగతులు ఆహా! (నేహాధూపియా పుట్టిన రోజు)


అందం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరి కళ్లు అందంగా ఉంటాయి. మరికొందరి నవ్వు బాగుంటుంది. ఇంకొందరేమో నడుమొంపుల్లో అందాన్ని దాచుకొంటుంటారు. అయితే నేహా దూపియా మాత్రం నా ఒళ్లంతా అందమే అంటోంది. ‘తెరపైన ఎంత ఘాటుగా కనిపిస్తుంటారో.. బయట చూసినప్పుడు కూడా అంతే మత్తుగా ఆకర్షిస్తుంటారు’ అంటే - ‘అవును మరి.. నా పరువాలపై నాకు ఆ స్థాయిలోనే నమ్మకాలున్నాయి’ అని సమాధానమిస్తుంది. మోడలింగ్‌ రంగం నుంచి వెండితెరపైకి దూసుకొచ్చిన నేహా ధూపియా... తమవైన అందచందాలతో వహ్వా అనిపించింది. అటు కథానాయికగానూ, ఇటు ప్రత్యేక గీతాలతోనూ బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె ప్రస్థానం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామా?

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)
* అతడి పాటలు ఆణిముత్యాలు! (ముఖేష్‌ వర్థంతి-1976)


అతడు పాడిన పాట... సాహిత్యానికి మాధుర్యాన్ని జత చేస్తుంది! భావానికి గాంభీర్యాన్ని తోడు తెస్తుంది! చెవులకు హృదయాన్ని జోడిస్తుంది! మనసుకు ఆర్ద్రతను నేర్పుతుంది! జ్ఞాపకాలను తీపి గుర్తులుగా మారుస్తుంది!
అతడు ముఖేష్‌. ఎన్నో హిందీ గీతాలకు శ్రోతల గుండెల్లో గుడి కట్టిన గాయకుడు. ఆ మధుర గాయకుడి వర్థంతి సందర్భంగా ఆయన విశేషాలేంటో గుర్తు చేసుకుందాం.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)
* పక్షి వీరుడు!

చీమ... సాలీడు... గబ్బిలం... కాదేదీ హాలీవుడ్‌కు అనర్హం! ఇప్పుడీ జాబితాలో పక్షి కూడా చేరింది. యాంట్‌మ్యాన్‌, స్పైడర్‌మ్యాన్‌, బ్యాట్‌మ్యాన్‌లాంటి సూపర్‌ హీరోల తర్వాత ‘బర్డ్‌మ్యాన్‌’ వచ్చి చేరాడు. కామెడీ సినిమాగా 2014 ఆగస్టు 27న విడుదలైన ఇది వెనీస్‌ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా ఎంపికవడం విశేషం. తొమ్మిది ఆస్కార్‌లకు నామినేషన్‌ పొంది నాలుగు ఆస్కార్‌ అవార్డులు పొందింది. ఇంకా ఎన్నో అవార్డులు పొందిన ఈ సినిమాను 18 మిలియన్‌ డాలర్లతో నిర్మిస్తే ప్రపంచవ్యాప్తంగా 103 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది.


* బాండ్‌ ప్రేమించిన భామ!


అదొక గూఢచారి సినిమా. అందులో హీరో బ్రిటిష్‌ గూఢచారి. హీరోయిన్‌ రష్యా గూఢచారి. ఇద్దరూ గూఢచారి పనులు చేస్తూనే నిగూఢమైన ప్రేమలో పడ్డారు. ఆ సినిమానే ‘ద స్పై హూ లవ్డ్‌ మీ’. ఇందులో బాండ్‌భామగా నటించిన కథానాయికే బార్బరా బాచ్‌. న్యూయార్క్‌లో 1947 ఆగస్టు 27న పుట్టిన ఈమె అమెరికాలో నటిగా, మోడల్‌గా రాణించింది. బాండ్‌భామగా నటించిన ఈమె మరో సినిమాలో కూడా గూఢచారిగా నటించింది. ఆ సినిమా ‘ఫోర్స్‌ 10 ఫ్రమ్‌ నవరోన్‌’. ఈ రెండు సినిమాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. మొదట్లో బార్బరా మోడల్‌గా పనిచేస్తూ రోమ్‌కి వెళ్లినప్పుడు ఒక ఇటలీ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అక్కడి సినిమాల్లో నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. కొన్నేళ్ల తర్వాత విడిపోయి అమెరికా వచ్చేసి నటనను కొనసాగించింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.