ఆగస్టు 30.. (సినీ చరిత్రలో ఈరోజు)
* అందచందాల తార! (జమున పుట్టినరోజు-1936)


‘గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది...’ అంటూ సెలయేరులాగా గెంతులు వేసే ఓ పల్లెటూరి పిల్ల...
‘నీవుండేదా కొండపై నా సామి...నేనుండేదీ నేలపై...’ అనే అమాయకపు అందాల కన్నెపిల్ల...
‘కనులు తెరిచినా నీవాయె...నే కనులు మూసినా నీవాయె...’ అంటూ ప్రేమ పారవశ్యంలో పరవసించే ఓ ప్రేయసి...
‘మీరజాల గలడా నా యానతి...’ అంటూ ఆధిపత్యాన్ని, ఆభిజాత్యాన్ని ప్రదర్శించే ఓ సత్యభామ...
-ఇవన్నీ తల్చుకోగానే ప్రేక్షకుల మదిలో మెదిలే రూపం జమునది! ఏ పాత్ర ధరించినా తన అందంతో నాజూకుతనాన్ని, అభినయంతో వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించిన కథానాయికి జమున. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అలనాటి ఆ అందచందాల తారామణి గురించి సమగ్రమైన సంగతులు తెలుసుకుందాం.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అందం అద్దుకున్న ప్రతిభ!


ఆకట్టుకునే అందం ఉంటే సరిపోదు. అలరించే ప్రతిభ కూడా ఉండాలి. ఆ రెండూ ఉన్నాయి కాబట్టే కామెరాన్‌ మిచెల్లీ డయాజ్‌ హాలీవుడ్‌లో నటిగా, నిర్మాతగా, రచయితగా, ఫ్యాషన్‌ మోడల్‌గా ఎదిగింది. ఓసార ‘ద మాస్క్‌’ సినిమాను గుర్తు తెచ్చుకోండి. అందులో అందాలొలికించిన భామే ఈమె. ‘మై బెస్ట్‌ ఫ్రెండ్స్‌ వెడ్డింగ్‌’, ‘దేరీజ్‌ సమ్‌థింగ్‌ అబౌట్‌ మేరీ’, ‘ఛార్లీస్‌ ఏంజెల్స్‌’, ‘ద స్వీటెస్ట్‌ థింగ్‌’, ‘ఇన్‌ హెర్‌ షూస్‌’... ఇలా ఎన్నో సినిమాలు ఆమె అందాల ప్రతిభకు గీటురాళ్లు. 1972లో ఆగస్టు 30న పుట్టిన ఈమె హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న ‘40+’ తారగా గుర్తింపు పొందింది. ఆమె సినిమాలన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్‌ డాలర్లు రాబట్టాయి. మేటి శృంగార తారగా, అందాల నటిగా ఎన్నో పత్రికల ఓటింగ్‌లో ఆమె గుర్తింపు పొందింది. అన్నట్టు... ఈమె రచయిత్రి కూడా. ఈమె రాసిన ‘ద బాడీ బుక్‌’ బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. ‘ద లాంగివిటీ బుక్‌’ అనే పుస్తకాన్ని కూడా వెలువరించింది. పదహారేళ్లకే ఆమెను ఫ్యాషన్‌ ప్రపంచం ఆహ్వానించింది. ప్రముఖ కంపెనీలకు మోడలింగ్‌ చేస్తూ దేశదేశాలు తిరిగింది. అంతర్జాతీయ పత్రికలపై ముఖచిత్రాలు, ‘టాప్‌లెస్‌’ ఫొటోలు... అబ్బో, పందొమ్మిదేళ్లకల్లా చాలా హడావుడే చేసింది. మరో రెండేళ్లకి ‘ద మాస్క్‌’ చిత్రంలో తొలి అవకాశం తలుపుతట్టడం, ఆ సినిమా హిట్‌ కావడంతో సినీ ప్రపంచంలో తారగా తళుకులీనింది. వెలుగులు చిమ్ముతూనే ఉంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.