మార్చి 14 (సినీ చరిత్రలో ఈరోజు)...

* సినీ స్వరాల ఆణిముత్యం!

(కె.వి. మహదేవన్‌ జయంతి-1918)

‘మంచి మనసులు’, ‘ముత్యాల ముగ్గు’, ‘మూగ మనసులు’, ‘అంతస్తులు’, ‘ఆస్తిపరులు’, ‘మనుషులు మారాలి’... ఇలా ఎన్నెన్నో మరపురాని చిత్రాలకి సంగీతం అందించిన గొప్ప స్వరకర్త కె.వి.మహదేవన్‌. తెలుగు ప్రేక్షకుల నోళ్లలో నిరంతరం నానే పాటల్ని అందించిన ఘనత ఆయనది. యాభయ్యేళ్లకి పైగా సినిమా ప్రయాణం చేసిన ఆయన దక్షిణాది ప్రేక్షకుల్ని సుస్వర సాగరంలో ముంచెత్తారు. సినీ సంగీతాన్ని పరిపుష్టం చేశారు. 14 మార్చి, 1918లో కన్యాకుమారి జిల్లా, నాగర్‌ కోయిల్‌లో జన్మించిన కె.వి.మహదేవన్, 1942లో సినీ రంగ ప్రవేశం చేశారు. తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు భాషల్లో 600 పైచిలుకు చిత్రాలకి స్వరాలు సమకూర్చారు. తెలుగులో ‘లవకుశ’, ‘శంకరాభరణం’, ‘సిరివెన్నెల’, ‘శ్రుతిలయలు’, ‘పెళ్ళి పుస్తకం’, ‘సప్తపది’, ‘స్వాతికిరణం’ తదితర ఆణిముత్యాల్లాంటి చిత్రరాజాలకి స్వర సొబగులద్ది చరిత్రని సృష్టించారు కె.వి. ఆయన రెండు జాతీయ పురస్కారాల్ని సంపాదించుకొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలకైతే లెక్కే లేదు. ఎంతో మంది గాయకుల్ని పరిచయం చేసి, వాళ్లకి జీవితాల్ని ప్రసాదించిన ఘనత కె.వి.సొంతం.

.......................................................................................

* సృజనాత్మక నటుడు

(ఆమీర్‌ఖాన్‌ పుట్టినరోజు)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

----------------------------------------

* ‘రోడ్డు’న పడ్డ సినిమాలు!


సినిమా అంతా ప్రయాణమే. ఆ ప్రయాణంలో పదనిసలు... ప్రణయాలు... సాహసాలు... సరదాలు... ఇలా సాగిపోయే కథలతో ప్రపంచ భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి. వీటిని ఓ విధంగా ‘రోడ్‌’ సినిమాలు అంటారు. ఇలాంటి కథలకు నాది పలికిన సినిమాగా ‘రోడ్‌ టు సింగపూర్‌’ (1940)ను చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఎంతగా విజయవంతం అయిందంటే, దీని తర్వాత ఏడు సినిమాలు సీక్వెల్‌గా వచ్చాయి. ‘రోడ్‌ టు...’ అని మొదలై సింగపూర్, జాంజిబార్, మొరాకో, యుటోపియా, రియో, బాలి, హాంగ్‌కాంగ్‌ పేర్లతో వచ్చిన ఈ సినిమాలన్నీ వినోదాన్ని పంచాయి. వీటికి నాంది పలికిన ‘సింగపూర్‌’ సినిమా విషయానికి వస్తే చాలా కాలం ఓడ మీద పనిచేసి తిరిగొచ్చిన జోష్, ఏస్‌ అనే ఇద్దరు స్నేహితులు, తమ తోటి ఉద్యోగులకు భార్యల నుంచి తలెత్తిన ఇబ్బందులు గమనించి ‘జన్మలో ఆడవాళ్ల జోలికి పోకూడదు’ అని ఒట్టు పెట్టుకుంటారు. కానీ ఏస్‌ మాజీ ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతుంది. జోష్‌కి వాళ్ల నాన్న ఓ గొప్పింటి సంబంధాన్ని ఖాయం చేస్తాడు. దాంతో ఇద్దరూ కలిసి ఇంటి నుంచి సింగపూర్‌కి పారిపోవాలనుకుంటారు. ఆ ప్రయాణంలో వాళ్లకి ఎదురైన అనుభవాలే సినిమా కథ.

..............................................................................

* అందం... అభినయం... ఆస్కారం


మోడల్‌గా మెప్పించింది... నటిగా రాణించింది... అందంతో, అభినయంతో యువతకు గిలిగింతలు పెట్టింది. ఆస్కార్‌ అందుకుని సత్తా చూపింది. ఆమే... సుసాన్‌ హేవార్డ్‌. ఆమె అందమైన నటన చూడాలంటే ‘స్మాష్‌ అప్‌’, ‘ద స్టోరీ ఆఫ్‌ ఎ ఉమన్‌’, ‘మై ఫూలిష్‌ హార్ట్‌’, ‘విత్‌ ఎ సాంగ్‌ ఇన్‌మై హార్ట్‌’, ‘ఐ విల్‌ క్రై టుమారో’ సినిమాలు చూడాలి. వాటితోనే ఆమెకు అయిదు ఆస్కార్‌ నామినేషన్లు లభించాయి. ఇక ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకున్న ఆమె అభినయాన్ని చూడాలంటే ‘ఐ వాంట్‌ టు లివ్‌’ చూడాలి. న్యూయార్క్‌లో 1917 జూన్‌ 30న పుట్టిన ఈ అందాల అభినేత్రి, కాలిఫోర్నియాలో 1975 మార్చి 14న బ్రెయిన్‌ క్యాన్సర్‌తో మరణించడం విషాదం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.