అక్టోబర్‌ 24.. (సినీ చరిత్రలో ఈరోజు)

* పాడు పిల్లోడు గుర్తొస్తున్నాడు
 మాడా వెంకటేశ్వరరావు  (వర్ధంతి)


హీరోగా రాణించొచ్చు. హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవొచ్చు. హీరోలు హీరోయిన్‌గా మారి అలరించొచ్చు. హీరోయిన్లు హీరోలుగా ఆకట్టుకోవొచ్చు. కానీ ఆడ, మగ కాని పాత్రలో.. కొంచెం తేడా తేడాగా నటించాలంటే మాత్రం గట్స్‌ కావాలి. ‘ఆ ముద్ర మనపైన పడిపోతేందేమో’ అన్న భయాన్ని పోగొట్టుకుని మరీ నటించాలి. అలా నటించి.. ‘మాడా’గా నిలిచిపోయిన నటుడు ‘మాడా’ వెంకటేశ్వరరావు. ‘మాయిదారి మల్లిగాడు’, ‘ముత్యాలముగ్గు’, ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’, ‘లంబాడోళ్ల రాందాసు’, ‘మెరుపుదాడి’, ‘ఆస్తులు అంతస్తులు’ ఇలా... విజయవంతమైన చిత్రాల్లో, వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. ఎక్కువ శాతం ‘మాడా’ పాత్రల్లోనే కనిపించారు.1950 అక్టోబరు 10న తూర్పు గోదావరి జిల్లా కడియంలో జన్మించిన వెంకటేశ్వరరావు, తొలుత విద్యుత్‌ శాఖ ఉద్యోగిగా పనిచేశారు. ఆ తరవాత సినిమాలపై ప్రేమతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. ‘చూడు పిన్నమ్మా.. పాడు పిల్లోడు’ పాటలో ఆయన నటన అందరికీ నచ్చింది. ఆ తరవాత ఆ తరహా పాత్రలకు ఆయన చిరునామాగా నిలిచారు. 2015 అక్టోబరు 24న అనారోగ్య కారణాలతో మరణించారు. అయితే ఇప్పటికీ నపుంసక పాత్ర అనగానే... మాడానే గుర్తొస్తారు. ఆ తరహా పాత్రలకు ఓ డిక్షనరీగా మిగిలిపోతారు.

* సెక్సీ బాంబ్‌...
మల్లికా శెరావత్‌ (పుట్టినరోజు)

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి..)

* మన్నాడే (వర్థంతి 2013)

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి..)

* పొలిటికల్‌ థ్రిల్లర్‌...

యుద్ధం నేపథ్యంలోని చారిత్రక అంశాలను తీసుకుని ఉత్కంఠ భరితంగా తెరకెక్కించే చిత్రాలు ఆకట్టుకుంటాయి. అన్ని దేశాల్లోను, అన్ని భాషల్లోను ఇలాంటి సినిమాలు వచ్చి విజయవంతమయ్యాయి. అలా హాలీవుడ్‌లో వచ్చిన చిత్రం ‘ద మంచూరియన్‌ క్యాండిడేట్‌’ (1962). కొరియా యుద్ధం నేపథ్యంలో దీన్ని తీశారు. అంతర్జాతీయ రాజకీయాలు, కుట్రలు, ఎత్తుగడల నేపథ్యంలో ఇది థ్రిల్లర్‌గా రూపొందింది. కొరియాతో యుద్ధం జరిగే కాలంలో అమెరికాకు చెందిన కొందరిని రష్యా, చైనా బలగాలు బందీగా పట్టుకుంటాయి.వారిని చైనాలోని మంచూరియా ప్రాంతంలో ఉంచుతాయి. అక్కడి నుంచి వాళ్లు ఎలా తప్పించుకున్నారనేదే కథ. దీన్ని 2.2 మిలియన్‌ డాలర్లతో తీస్తే 7.7 మిలియన్‌ డాలర్లు వసూలు చేయడంతో పాటు ఆస్కార్‌ నామినేషన్లు పొందింది. అంతర్జాతీయ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

............................................................................................................................................................................

నారదుడే... విలన్‌!
జీవన్‌ (
జయంతి)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి..)

* అమెరికాలో అదరగొట్టిన చైనా చిత్రం 

అమెరికా బాక్సాఫీసు వసూళ్లలో మొదటి స్థానంలో నిలిచిన తొలి చైనా చిత్రంగా అది పేరుతెచ్చుకుంది!
కేవలం 31 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో తీసిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 177.4 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది!
ప్రతిష్ఠాత్మకమైన పదమూడు అవార్డులను అందుకుంది! అదే చైనా మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘హీరో’ (2002) చిత్రం. ఇందులో హీరో బ్రూస్‌లీ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న మార్షల్‌ ఆర్ట్స్‌ యోధుడు జెట్లీ. చైనా క్రీస్తుపూర్వం 227 కాలంనాటి క్విన్‌ రాజుల కాలంలో జరిగిన కథగా దీన్ని తీశారు. రాజును చంపాలనుకున్న ముగ్గురు యోధులను ఓ అంగరక్షకుడు ఎలా ఎదుర్కొని మట్టి కరిపించాడనేదే కథ. చైనాలో ఇదే రోజు విడుదలైన ఇది హాంగ్‌కాంగ్, అమెరికాల్లో వేర్వేరు తేదీల్లో విడుదలై ఆకట్టుకుంది.

* అభినయం విలక్షణం


ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన కొన్ని మేటి చిత్రాల్లో కీలకమైన పాత్రల ద్వారా ఆ నటుడు గుర్తుండిపోతాడు. అతడే ఎఫ్‌. ముర్రే అబ్రహామ్‌. ‘అమాడ్యుస్‌’ (1984) సినిమా ద్వారా ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నాడు. ఇంకా గోల్డెన్‌గ్లోబ్, బాఫ్తా లఅఆంటి ఎన్నో అవార్డులు అతడి ఖాతాలో పడ్డాయి. ‘ఆల్‌ ద ప్రెసిడెంట్స్‌ మెన్‌’, ‘శాక్రిఫైస్‌’, ‘ద నేమ్‌ ఆఫ్‌ ద రోజ్‌’, ‘లాస్ట్‌ యాక్షన్‌ హీరో’, ‘స్టార్‌ట్రెక్‌: ఇన్‌సరెక్షన్‌’, ‘ద గ్రాండ్‌ బుడాపెస్ట్‌ హోటెల్‌’లాంటి సినిమాల్లో అతడి విలక్షణమైన అభినయాన్ని అభిమానులు మర్చిపోలేరు. అమెరికాలో 1939 అక్టోబర్‌ 24న పుట్టిన అబ్రహాం, కాలేజీ రోజుల్లోనే నటన పట్ట ఆకర్షితుడయ్యాడు. నాటకాల ద్వారా పేరు తెచ్చుకుని బుల్లితెర, వెండితెర అవకాశాలు అందుకున్నాడు.

* అవార్డుల నటుడు


అతడు నాటకాలు వేసినా, టీవీ సీరియల్స్‌లో కనిపించినా, వెండితెరపై అలరించినా ఆయా రంగాల్లో ఉత్తమమైన అవార్డులన్నీ అతడిని వెతుక్కుంటూ వచ్చాయి. ఆస్కార్, టోనీ, బాఫ్తా, గోల్డెన్‌గ్లోబ్‌ లాంటి పురస్కారాలు అందుకున్న ఆ నటుడు కెవిన్‌ క్లైన్‌. నటుడిగా, కమేడియన్‌గా, గాయకుడిగా, వాయిస్‌ యాక్టర్‌గా అతడి ప్రతిభ ప్రస్ఫుటం. ‘ద పైరేట్స్‌ ఆఫ్‌ పెనజాన్స్‌’, ‘సోఫీస్‌ ఛాయిస్‌’, ‘ఎ ఫిష్‌ కాల్డ్‌ వాండా’, ‘ద బిగ్‌ ఛిల్‌’, ‘సిల్వరాడో’, ‘క్రై ఫ్రీడమ్‌’, ‘గ్రాండ్‌ కాన్యన్‌’, ‘డేవ్‌’, ‘ద హంచ్‌బ్యాక్‌ ఆఫ్‌ నోట్రడామ్‌’, ‘ద ఐస్‌ స్టార్మ్‌’, ‘ఇన్‌ అండ్‌ ఔట్‌’, ‘వైల్డ్‌ వైల్డ్‌ వెస్ట్‌’, ‘ద రోడ్‌ టు ఎల్‌డొరాడో’, ‘డీలవ్లీ’, ‘ద కాన్స్పిరేటర్‌’, ‘మై ఓల్డ్‌ లేడీ’, ‘ద బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌’ లాంటి సినిమాలు అతడి అభినయ వైవిధ్యానికి గీటురాళ్లు. మిస్సోరీలో 1947 అక్టోబర్‌ 24న పుట్టిన కెవ్లిన్‌ మొదట నాటకాల ద్వారా పేరు తెచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.