జులై 6.. (సినీ చరిత్రలో ఈరోజు)

* మంగళంపల్లి బాలమురళీకృష్ణ...
(జయంతి - 1930)



(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి)

* ఆకట్టుకున్న నవలా చిత్రం..


ఓ హాలీవుడ్‌ సినిమా 6 ఆస్కార్‌లతో పాటు ఎన్నో అవార్డులు సాధించి, కాసుల వర్షం కూడా కురిపించిందంటే ఆసక్తికరమే. ఆ చిత్రమే ‘ఫారెస్ట్‌ గ్రంప్‌’. 1994లో ఇదే రోజు అమెరికాలో విడుదలైన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు టామ్‌హ్యాంక్స్‌ నటించాడు. రాబర్ట్‌ జెమెకిస్‌ దర్శకత్వంలో 55 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 677 మిలియన్‌ డాలర్లను రాబట్టింది. విన్‌స్టన్‌ గ్రూమ్‌ ఇదే పేరుతో 1986లో రాసిన నవల ఆధారంగా రొమాంటిక్‌ డ్రామా నిర్మించిన ఈ చిత్రాన్ని అమెరికా ప్రభుత్వం జాతీయ సినిమాల లైబ్రరీలో భద్రపరిచింది.

* కండల వీరుడు..


హాలీవుడ్‌లో రాకీ అన్నా అతడే... రాంబో అన్నా అతడే. కండలు తిరిగిన శరీరంతో యాక్షన్‌ చిత్రాల పరంపరతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సిల్వస్టర్‌ స్టాలోన్‌ 1946లో పుట్టిన 71 ఏళ్ల యువకుడు. ‘రాకీ’ ‘బాల్‌బోవాగా 7’ సీక్వెల్‌ చిత్రాల్లో కనిపించాడు. జాన్‌ రాంబోగా నాలుగు సినిమాల్లో అలరించాడు. ‘ది ఎక్స్‌పెండబుల్స్‌’ కథానాయకుడిగా మూడు చిత్రాల్లో మెప్పించాడు. ఈ మూడు సీక్వెల్స్‌గా వచ్చిన 14 సినిమాల్లో రచన, దర్శకత్వంలో ముఖ్య భూమిక ఇతడిదే. స్మిత్‌సోనియన్‌ మ్యూజియంలో ఇతడి వివరాలు కనిపిస్తాయి. ఫిలడెల్ఫియా మ్యూజియం దగ్గర ఇతడి విగ్రహం ఓ నటుడికి దక్కిన గౌరవానికి చిహ్నంగా నిలుస్తుంది. ఆస్కార్‌ నామినేషన్లు, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు ఇతడి ఖాతాలో ఉన్నాయి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.