జూన్‌ 18.. (సినీ చరిత్రలో ఈరోజు)

* ప్రేమ, పెళ్లి... మధ్యలో ఐశ్వర్యరాయ్‌!


ల్లరితో మనసు దోచుకున్న ప్రేమికుడు... మంచితనంతో బంధాన్ని పెంచిన భర్త... ఈ ఇద్దరి మధ్య నలిగిపోయిన ఓ అందాల యువతి... ఇదీ ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ సినిమా. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమా, సల్మాన్‌ఖాన్, అజయ్‌ దేవ్‌గన్, ఐశ్వర్యరాయ్‌ నటనతో ఓ దృశ్యకావ్యంగా అలరించింది.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* అదరగొట్టే వేగం..


ర్ధరాత్రి వేళల్లో నడి రోడ్ల మీద కార్ల రేసులు... దూసుకుపోయే యువకులు... మధ్యలో దొంగలు... మారువేషాల్లో పోలీసులు... ఇలా వేగంగా సాగిపోయే ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సినిమాలు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వాటిలో మొదటిది 2001లో ఇదే రోజు ప్రదర్శితమైంది. దీని విజయం వల్ల ఇప్పటి వరకు ఇలాంటి కథాంశాలతో ఏడు సీక్వెల్‌ సినిమాలు వచ్చాయి. సీక్వెల్‌ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ఇవి నిలిచాయి. ఇవన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా 5 బిలియన్‌ డాలర్లు ఆర్జించాయి. వీటిలో నటించిన పాల్‌ వాకర్, విన్‌ డీసిల్, మైకేల్‌ రోడ్రిగ్వెజ్‌లకు అంతర్జాతీయంగా అభిమానులు ఏర్పడ్డారు. ఈ సీక్వెల్స్‌ మరో మూడు నిర్మాణంలో ఉన్నాయి.

* గొప్ప నటుడికి అరుదైన గౌరవం..


అం
తర్జాతీయ గుర్తింపు పొందిన ఆ నటుడి గురించి తెలుసుకోవాలంటే ముందుగా అతడి అవార్డుల జాబితా చూద్దాం. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే ‘ఆర్డర్‌ ఆఫ్‌ ద కంపేనియన్స్‌ ఆఫ్‌ ఆనర్‌’, ‘మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌’ అవార్డులు... ‘సర్‌’ బిరుదు... ‘నైట్‌హుడ్‌’... వీటితో పాటు ఆరు లారెన్స్‌ ఆలివర్‌ అవార్డులు... టోనీ అవార్డు, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు, స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డు, బీఐఎఫ్‌ అవార్డు... రెండు శాటర్న్‌ అవార్డులు... నాలుగు డ్రామా డెస్క్‌ అవార్డులు... రెండు సిటిజన్‌ ఛాయిస్‌ అవార్డులు... రెండు ఆస్కార్‌ నామినేషన్లు... నాలుగు బాఫ్తా అవార్డులు... అయిదు ఎమ్మీ అవార్డు నామినేషన్లు... ఇంకా ఎన్నో! ఇన్ని అవార్డులు పొందిన నటుడిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తే ఇయాన్‌ ముర్రే మెకెల్లన్‌. నాటకాల నుంచి సినిమాల వరకు ఆయన ధరించిన ప్రతి పాత్రా ప్రేక్షకాదరణను, ప్రశంసలను, ఏదో ఒక అవార్డును పొందింది. ‘బ్రిటిష్‌ కల్చరల్‌ ఐకాన్‌’గా పేరొందిన ఆ మహానటుడు అంతర్జాతీయ గుర్తింపు పొందిన ‘రిచర్డ్‌3’, ‘గాడ్స్‌ అండ్‌ మాన్‌స్టర్స్‌’, ‘ఎక్స్‌మెన్‌’ చిత్రాలు, ‘ద లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌’, ‘ద హాబిట్‌’ సీక్వెల్‌ చిత్రాల ద్వారా నాటి, నేటి తరం ప్రేక్షకులకు చిరపరిచితుడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.