సెప్టెంబర్‌ 4.. (సినీ చరిత్రలో ఈరోజే)

* హుషారైన ప్రేమికుడు! (రిషీకపూర్‌ పుట్టిన రోజు-1952)
‘మె షాయర్‌ తో నహీ...’ అంటూ పాడగానే యువతకు నచ్చేశాడు. ‘హమ్‌ తుమ్‌ ఏక్‌ కమరేమె బంధ్‌హో...’ అనేసరికల్లా వెర్రెత్తించేశాడు. అలా తన తొలిసినిమా ‘బాబీ’తోనే హుషారైన నటనతో కుర్రకారును ఆకట్టుకున్నాడు రిషికపూర్‌. ఆపై సినిమాల్లో అతడి అల్లరి అంతా ఇంతా కాదు. ‘ఖుల్లం ఖుల్లం ప్యార్‌ కరేంగే హమ్‌ దోనోం...’ అన్నాడు. ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్లతో ప్రేమకథలు నడిపి రొమాంటిక్‌ హీరోగా పేరు సంపాదించేశాడు. ‘హమ్‌ కిసీసే కమ్‌ నహీ’ అని నిరూపించేశాడు. ఇప్పటికీ నటుడిగా కొనసాగుతూ ఆకట్టుకుంటున్నాడు. మరి రిషికపూర్‌ సినీ జీవితాన్ని ఓసారి సింహావలోకనం చేద్దామా?

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి..)

* దర్శకురాలి ఘనత!
ఆస్కార్‌ చరిత్రలో తొలిసారి ఓ దర్శకురాలు తీసిన సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది... అలాగే తొలిసారిగా ఓ దర్శకురాలు ఉత్తమ దర్శకురాలి అవార్డు గెలిచింది...
ఆ సినిమా ‘ద హర్ట్‌ లాకర్‌’ అయితే, ఆ దర్శకురాలు కత్రిన్‌ బిగెలో. అమెరికన్‌ వార్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్‌ ప్రదర్శన 2008 సెప్టెంబర్‌ 3న వెనీస్‌ చిత్రోత్సవంలో జరిగింది. ఈ సినిమా తొమ్మిది ఆస్కార్‌లకు నామినేషన్‌ పొంది, ఆరు ఆస్కార్‌లను గెలుచుకోవడం విశేషం. యుద్ధం నేపథ్యంలో, వాస్తవికమైన చిత్రీకరణతో, మానవ సంబంధాలను, భావోద్వేగాలను చక్కగా రూపొందించిన చిత్రంగా ఇది విమర్శకుల ప్రశంసలు పొందింది. కత్రిన్‌ బిగెలో ఈ సినిమాకు నిర్మాత కూడా కావడం విశేషం అయితే జర్నలిస్ట్‌ అయిన మార్క్‌బోల్‌ దీనికి స్క్రీన్‌ప్లే రాయడం మరో విశేషం. దర్శకురాలు కత్రిన్‌ బిగెలో ప్రఖ్యాత దర్శకనిర్మాత జేమ్స్‌ కామెరాన్‌ మాజీ భార్య. అయితే అతడే ఆమెను ఈ సినిమా తీయమని ప్రోత్సహించాడు. చడం ఆసక్తికరం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఆస్కార్‌ అవార్డులలో ఈ సినిమా కామెరాన్‌ తీసిన ‘అవతార్‌’ సినిమాతో పోటీ పడి మరీ ఆరు అవార్డులు అందుకుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.