మార్చి 9.. (సినీ చరిత్రలో ఈరోజు)

* రాజీ పడని నిర్మాత

(శ్యాంప్రసాద్‌రెడ్డి పుట్టినరోజు)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* తారలను నేలకు దించిన కుర్రాడు


దర్శీల్‌ సఫారే గుర్తున్నాడా? అమీర్‌ఖాన్‌ తీసిన ‘తారే జమీన్‌ పర్‌’ సినిమాలో ‘డిస్లేక్సియా’ అనే వ్యాధితో బాధపడే పిల్లాడి పాత్రలో నటించిన బాల నటుడు. ముంబైలో 1997 మార్చి 9న పుట్టిన ఈ కుర్రాడు ఆ ఒక్క సినిమాతోనే అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. అతడి నటనకు అనేక అవార్డులు వచ్చాయి. ఆమీర్‌ఖాన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆ సినిమా స్క్రిప్ట్‌ పూర్తి అయ్యాక అందులో నటించే 8 ఏళ్ల కుర్రాడి కోసం వందలాది ఆడిషన్లు జరిగాయి. ఈ అన్వేషణలో ఓ డ్యాన్సింగ్‌ స్కూల్లో దర్శీల్, ఆ చిత్రబృందం కంటపడ్డాడు. ఈ సినిమా తర్వాత అతడు ‘బమ్‌ బమ్‌ బోలే’, ‘జొక్కోమన్‌’, ‘మిడ్‌నైట్స్‌ చిల్డ్రన్‌’ సినిమాల్లో నటించాడు. టీవీ కార్యక్రమాల్లో కూడా తళుక్కుమన్నాడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.