ఈరోజే ఆగస్టు 28... (సినీ చరిత్రలో ఈ రోజు )
* విలక్షణ దర్శకుడు! (కె.ఎస్‌. ప్రకాశరావు జయంతి -1914)


ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న దర్శకుడు కోవెలమూడి సూర్య ప్రకాశరావు. అంచెలంచెలుగా ఎదిగి నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, సినీమాటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన ఆయన ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తండ్రి. ఓ ‘ప్రేమ్‌నగర్‌’ సినిమాను గుర్తు చేసుకుంటే చాలు కె.ఎస్‌. ప్రకాశరావు ప్రతిభ ఏంటో తెలుస్తుంది. జనం నాడిని పట్టుకున్న దర్శకుడు ఆయన. సినీ దిగ్గజాలుగా ఎదిగిన ఆత్రేయ, పెండ్యాలలను సినీరంగానికి అందించిన ఘనత ఆయనదే!

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అంతరిక్షంలో ఆరాటం!


అంతరిక్షంలో ఏర్పాటు చేసిన ‘హబుల్‌’ టెలిస్కోప్‌ పాడైంది. దానికి మరమ్మతు చేయాలి. అందుకోసం అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం ‘నాసా’ ఓ ‘ఎక్స్‌ప్లోరô’Â అనే స్పేస్‌ షటిల్‌ను పంపుతుంది. అందులో ఓ మహిళ సహా ఇద్దరు వ్యోమగాములు ఉంటారు. హబుల్‌ టెలిస్కోప్‌ దగ్గర స్పేస్‌వాక్‌ చేస్తుంటే రష్యా దేశం అంతరిక్షంలోకి ఓ మిసైల్‌ను పంపుతుంది. దాని వల్ల భూమి చుట్టూ వ్యర్థంగా తిరుగుతున్న అనేక పరికరాలు పేలిపోతాయి. వాటి తాకిడి వల్ల స్పేస్‌షటిల్‌ పాడైపోతుంది. ఆస్ట్రోనాట్‌ స్యూట్స్‌తో అంతరిక్షంలో మిగిలిపోయిన వాళ్లిద్దరూ అక్కడికి 1450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌’ చేరుకుంటేనే బతుకుతారు. మరి î ెళ్లగలిగారా? అక్కడి పరిస్థితులు ఏంటి? తిరిగి భూమి మీదకు రాగలిగారా?... ఈ కథాంశంతో వచ్చిన సినిమా ‘గ్రావిటీ’ ప్రీమియర్‌ 2013లో ఆగస్టు 28న ఇదే రోజు î ెనిస్‌ చిత్రోత్సవంలో జరిగింది. ‘స్పీడ్‌’ నటి శాండ్రాబుల్లక్‌, నటుడు జార్జి క్లూనీ నటించిన ఈ చిత్రానికి అల్ఫాన్సో క్యురాన్‌ దర్శకత్వం వహించాడు. 91 నిమిషాల ఈ చిత్రంలో 80 నిమిషాలు విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉండడం విశేషం. వంద మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా ప్రపంచ దేశాల్లో 723 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది.

* నట సుమం

యాక్షన్‌ కథానాయకుడిగా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఓ î ెలుగు î ెలిగారు సుమన్‌. ఆంగ్లం, హిందీ భాషల్లోనూ నటించి పేరు తెచ్చుకొన్నారు. వందల చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్‌ మాత్రమే కాదు... ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ చిత్రాలతో భక్తిభావాన్నీ పలికించారు. ప్రస్తుతం తెలుగులో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. సుమన్‌ 1959 ఆగస్టు 28న మద్రాసులో జన్మించారు. ఈయన తల్లి కేసరీ చందర్‌ మద్రాసులోని యతిరాజు మహిళా కళాశాలకి ప్రిన్సిపల్‌గా పనిచేశారు. తండ్రి సుశీల్‌చంద్ర మద్రాసులోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో పనిచేసేవారు. వీరి స్వస్థలం మంగళూరు. బీఏలో పట్టభద్రుడైన సుమన్‌ కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ సంపాదించారు. యుద్ధ విద్యల్లో ఒకటైన కలరియపట్టులోనూ నిష్ణాతులే. కరాటే మాస్టారుగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన్ని కుటుంబ స్నేహితుడు కిట్టూ ఓ నిర్మాతకి పరిచయం చేశాడు. అలా 1977లొ ‘నీచల్‌ కులం’ అనే తమిళ చిత్రంతో పరిచయమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ కరాటే సమాఖ్యకి అధ్యక్షుడిగా పనిచేసిన సుమన్‌ ప్రముఖ తెలుగు నాటక రచయిత డి.వి.నరసరాజు మనవరాలైన శిరీషని వివాహం చేసుకొన్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా భిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయిన సుమన్‌, త్వరలోనే రాజకీయ రంగ ప్రî ేశం చేస్తారని ప్రచారం సాగుతోంది. సుమన్‌ పుట్టినరోజు ఈ రోజు.

* విలక్షణ నటుడు...విజయ్‌కుమార్‌

పరిచయం అవసరం లేని నటుడు విజయ్‌కుమార్‌. తమిళంలో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. తమిళనాడు, తంజావూరు జిల్లా, నట్టుచలైలో 1943, ఆగస్టు 29న జన్మించారు విజయ్‌కుమార్‌. 1961లో తమిళ చిత్రం ‘శ్రీవల్లి’తో తెరకు పరిచయమయ్యారు. ఆయన అసలు పేరు పంచాక్షరం. సినిమాల కోసం విజయ్‌కుమార్‌గా మార్చుకున్నారు. వందలాది చిత్రాల్లో నటించిన ఆయన తెలుగులో ‘స్నేహంకోసం’ సినిమాలో చిరంజీవికి స్నేహితుడిగా నటించి అలరించారు. ‘ఖుషి’లో భూమిక తండ్రిగా, ‘100%లవ్‌’లో నాగచైతన్యకి తాతగా కనిపించారు. ప్రస్తుతం దక్షిణాదిన ప్రముఖ క్యారెక్టర్‌ నటుడిగా కొనసాగుతున్నారు విజయ్‌కుమార్‌. ముత్తుకన్ను అనే మహిళని వివాహం చేసుకొన్న విజయ్‌కుమార్‌, ఆ తర్వాత ఒకప్పటి కథానాయిక మంజులని 1976లో వివాహం చేసుకొన్నారు. వీరికి కవిత, అనిత, వనిత, ప్రీత, శ్రీదేవి, అరుణ్‌విజయ్‌ సంతానం. శ్రీదేవి, అరుణ్‌ విజయ్‌ నటులుగా కొనసాగుతున్నారు. సినిమా, టెలివిజన్‌ ధారావాహికల్లోనూ నటించిన ఆయన, ఏఐడీఎంకే పార్టీలో సభ్యుడిగా పనిచేశారు. 2016లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈరోజు విజయ్‌కుమార్‌ పుట్టినరోజు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.