‘ఆక్వామెన్’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నటి అంబర్ హెర్డ్. ఆమె తల్లి అయిన పైజ్ హెర్డ్ కన్నుమూశారు. తన తల్లితో ఎందో గొప్ప అనుబంధం ఉంది. అదే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అంబర్ తన తల్లి గురించి స్పందిస్తూ..‘‘ఆమె చనిపోవడంతో నేనెంతో ఆవేదన చెందాను. అమ్మ మమ్మల్ని చాలా త్వరగానే విడిచి వెళ్లింది. ఇది నమ్మశక్యం కానీ విషయం. కానీ ఆమెతో నా అనుబంధం ఎంతో మధురమైనది. నాకు తెలిసి అమ్మ చాలా అత్యంత అందమైన మనసు గలది. అమ్మ చనిపోలేదు. ముఫై నాలుగు సంవత్సరాల నుంచి ఆమె ప్రేమను పొందుతూనే ఉన్నాను’’ పేర్కొంది. 2018లో జేమ్స్వాన్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన చిత్రం ‘ఆక్వామెన్’. ఇందులో అంబర్ నీరూస్ రాజు కూతరు మీరాగా సందడి చేసింది. ఇంకా ఇందులో జాసన్ మొమోయ్, ప్రాటిక్ విల్సన్, నికోల్ కిడ్మన్ తదితరులు నటించారు. ప్రస్తుతం అంబర్ ‘ది స్టాండ్’ అనే థ్రిల్ల్రర్ టెలివిజన్ సీరీస్లో ప్రధాన పాత్రలో నటిస్తుంది.